గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2008, ఆదివారం

కందం మనకందం. వ్రాద్దామామరి?

1 comments

క :-ఆంతా బాగున్నారా?
సంతోషము నొన్దినార? సజ్జనులగు మీ
యంతట మీరే పద్యము
కొంతైనా వ్రాసినారొ గురుతుగ నుండున్.
ఆంధ్రులారా! ఛందస్సు లోనే మనమెందుకు వ్రాయాలనుకొంటున్నారా?చెపుతాను, వినండి.
ఛందస్సు ఒక ఫ్రేమ్ లాంటిది. మన భావాన్ని ఛందో బద్ధమైన అక్షర రూపంలో బిగించి మారడానికి వీలు లేకుండా చేస్తుంది. గణములు, యతులు, ప్రాసలు ఇందుకు తోడ్పడతాయి.
ఇక మీకు కందంలో పద్యం వ్రాయాలనుకున్నారనుకోండి. సులభ శైలిలో కందపద్యాలు వ్రాయబడిన కృష్ణ శతకం లాంటివి మనం మననం చేస్తే , ఒక పాతికపద్యాలు కంఠస్తం వచ్చేసరికి 26 వ పద్యం మీకు తన్నుకొస్తుంది. వ్రాయాలనిపిస్తుంది .
ఇంక గణాలంటారా అవి కాలానుగుణంగా నేర్చుకోవచ్చు. మేరూ ప్రయత్నించి మీ అనుభవాన్ని నాకూ పంచండి.

30, ఆగస్టు 2008, శనివారం

అవునంటారా........కాదంటారా........

1 comments

శ్రీమదాంధ్ర భాషాభిమానులకు గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మ దినము ఒక పర్వ దినము. 29-8- 2008 వ తేదేని ఈ విషయాలను మనం అవకాశానుగుణంగా ఆ రోజున చర్చించుకొని ఉంటాం. ఆ పండుగ సంబరం ఆరోజుతో వదిలేస్తే ఆంధ్రులు ఆరంభశూరులు అనే అపప్రధ నిజం చేసినవారిమవతాం. 29-8-2009 వ తేదీన మనం సింహావలోకనం చేసుకొందాం. అందుకు సరయిన ప్రణాళిక ఇప్పుడే నిర్మించుకోవాలి. మనకు ఆంగ్లం మాటలాడడం అత్యవసరం అనుకున్నప్పుడు రోజులో కనీసం కొన్ని గంటలయనా స్వచ్ఛమయిన తెలుగు మాటలాడే ప్రయత్నం చేయగలిగితే మన ఆంద్ర భారతి మనకు దూరం కాదు. అవునంటారా.................కాదంటారా..........?


క:-దినమునకొక గంటైనను
మనమంతా తెలుగుపలికి దివ్యత్వమునీ
తెనుగుకు గొలుపగ నేర్చిన
మన భాషకు గుర్తు కలిగి మన్ననలందున్.

ఇదీ నా అభిప్రాయం. మరి మీరేమంటారు? వీలయితే మీరు ఛందోబద్ధంగా చెప్పండి.

చింతా రామకృష్ణా రావు

తెలుగు భాషా ధినోత్సవం

0 comments

చోడవరం లో తెలుగు భాషా దినోత్సవమును ఎంతో ఘనంగా జరుపుకున్నారు తెలుగు భాషలో మాధుర్యం , మమతానురాగాలు వుంటాయని డిగ్రీ కళాశాల సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ చింత. రామ కృష్ణా రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటలాడుతూ మాతృభాష ను నిర్లక్ష్యం చేయరాదని, తెలుగు అన్ని భాషలలోకి ఛాలా గొప్పదని అన్నారు గిడుగు రామ మూర్తి గారి జన్మదినోత్సవాన్ని మనం ఈ తెలుగు భాషా ధినోత్సవం గా జరుపుకుంటున్నామని ఆయన ఉపన్యాసించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు చాలామంది వచ్చారు. వారి వారి వుపన్యాసాల తో విద్యార్ధులకు తెలుగు ఫై వుత్సాహాన్ని కలిగించారు ఈ సభ అంతటి తో ఘనం గా ముగించారు

28, ఆగస్టు 2008, గురువారం

యువతరంగం

0 comments


యువతరంగం (ద్విమాసికపత్రిక)ప్రభుత్వ డిగ్రీ కాళాశాల, చూడవరం విశాఖ పట్నం


ప్రియ
ఆంద్ర,భారతీయ సోదరసోడరీమణులారా! మీ అందరినీ ఈ విధంగా కలవగలగడం నాకెన్తో సంతోషం కలిగిస్తోన్ది. ముందుగా మీ అన్దరికీ నా వందనములు.
విశాఖపట్నం disrtict చోడవరం గ్రామంలో ఉండే నా పేరు"చింతా రామ కృష్ణా రావు" నేనుఇక్కడ ప్రభుత్వ Digree కళాశాలలో వుపన్యాసకునిగా పని చీసి, ఈ మధ్యే పదవీ విరమణ చేసికుడా ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నాను. తెలుగు భాష బోధించడంలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను.యువతలోని అంతర్గత శక్తులను కవితలో వేలువరించేల అందున పద్య కవితలో వెలువరించేలా చేయాలనే నా ఆకాంక్ష కొంత వరకు ఇక్కడ నాకు తీరినా, ఆంధ్రుడైన ప్రతీవాడు పద్యంలో తన భావం చెప్పా గలగలనే నా కోరిక ఈ బ్లాగ్ ద్వార చాల సులభ
సాధ్యం అని నేను నమ్ముతున్నాను. నాలాగే మీరు వుత్సహవంతులై వుంటారు. కాబట్టి మీరు కుడా ప్రయత్నం చేసేలగుంటే తప్పకుండ మీచేత కూడా పద్యాల్లో మాతడే ల చెయ్య గలనని నాకు నమ్మకం వుండి.


చ:-అసదృశమైన
భాషయన ఆన్ధ్రమె చెప్పగనొప్పు ముందుగన్,
పస గలయట్టిపద్యములు భావ ప్రపూర్ణ సు బోధకంబుగా
దెసలను మారు మ్రోగగను, తీయగ వ్రాసి పఠింప నేర్పెదన్.
కసరక నాదు యత్నమును గాంచి రహింపుడు నన్ను జేరుచున్.


గమనించారుకదా! సహృదయులైన మీరు మీ అభిప్రాయాలను తెలిపి నన్ను ప్రోత్సహిన్చ గలరని ఆశిస్తున్నాను.
మళ్ళీ కలుసుకుందాం సద్ గుణ "గణా"లను పంచుకుందాం.