జైశ్రీరామ్.
శ్లో. తమసో లక్షణం కామో, - రజస స్త్వార్థ ఉద్యతే,
సత్త్వస్య లక్షణం ధర్మః, - శ్రైష్ఠ్య మేషామ్ యథోత్తరమ్.
గీ. తమమునకు కామమే లక్షణముగ నుండు,
కన రజోలక్షణంబర్థమనఁగనొప్పు,
సత్వలక్షణమది ధర్మ సాధనంబె,
మూటిలో గొప్పదైనది మూడవదియె.
భావము: తమో గుణ లక్షణం కామము, రజో గుణ లక్షణం అర్థము, సత్త్వ గుణ
లక్షణం ధర్మమునందు అభిలాష. వీటిలో మొదటి దానికంటే రెండోది,
రెండో దానికంటే మూడోది శ్రేష్ఠమైనది.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.