గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2023, శుక్రవారం

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ - ...18 - 29...//... ప్రవృత్తిం చ నివృత్తిం చ - ...18 - 30,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లోబుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు|

ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనఞ్జయ. || 18-29 ||

తే.గీగుణములనుబట్టి మూడేసి కూడియున్న

బుద్ధి, ధృతిని,నేఁ దెలిపెదన్ బూర్తిగాను

వినుము విజయుండ! తెలివితో వీనులార,

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

ధనంజయా! గుణాలనిబట్టి మూడేసి విధాలుగా ఉండే బుద్ధినీ, ధృతినీ గురించి వేరువేరుగా

పూర్తిగా చెబుతాను విను.

శ్లోప్రవృత్తిం నివృత్తిం కార్యాకార్యే భయాభయే|

బన్ధం మోక్షం యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ. ||18-30 ||

తే.గీవిను ప్రవృత్తినివృత్తులు,వివరముగను,

బంధ మోక్షముల్, భువి భయాభయములనిక

కన నకార్య కార్యములను, గనుము తెలియ

తెలిపెదను పార్థ! ధీయుతా! తెలుసుకొనుము.

భావము.

అర్జునా! ప్రవృత్తి-నివృత్తులు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధ మోక్షాలు---

వీటిని వివరంగా చెబుతాను విను.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.