జైశ్రీరామ్.
చ మ త్కా ర శ్లో క ము. వి వ ర ణ ము.
ఒక బ్రాహ్మణుడు ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు.
ఆ ధనికుడు సంపదనతో పాటు సంస్కారమున్నవాడు.
ఆ బ్రాహ్మడికి కడుపునిండా షడ్రసోపేతమైన భోజనం పెట్టి, చక్కని పట్టు వస్త్రాలను యిచ్చి ఘనంగా సత్కరించాడు.
ఇంకేముంది కడుపునిండి, సత్కారం జరిగే సరికి ఆశీర్వచన శ్లోకం తన్నుకుంటూ వచ్చింది ఆ బ్రాహ్మణుఁడికి.
శ్లో. విహంగో వాహనం యేషాం,
త్రికంచధరపాణయః
పాసాల సహితా దేవాః
సదాతిష్ఠన్తు తే గృహే.
భావము.
పక్షులు వాహనాలుగా కలవారునూ, త్రికములను ధరించిన వారునూ, పాసాలతో నిండిన వారునూ, అగు దేవతలు మీ యింట ఎప్పుడూ ఉందురు గాక!
ఇదేమి ఆశీర్వచనమండీ అంటారేమో... ఒక్క క్షణం ఆలోచించండి మరి.
వి అంటే పక్షి,
హం అంటే హంస,
గో అంటే ఎద్దు,
పక్షి వాహనంగా కలవాడు విష్ణువు,
హంస వాహనుడు బ్రహ్మ,
ఎద్దు వాగాహనం గలవాడు శివుడు,
అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ త్రికంచ,
త్రికం ను ధరించినవారు.
త్రి అంటే త్రిశూలం,
కం అంటే శంఖము,
చ అంటే చక్రములను ధరించినవారు
త్రిమూర్తులు కదా!
త్రిశూల ధారి శివుడు,
శంఖ ధారి బ్రహ్మ,
సుదర్శన ధారి విష్ణువు
ఈ ముగ్గురూ పాసములతో కూడిన దేవతలు.
పా అంటే పార్వతి,
స అంటే సరస్వతి,
లఅంటే లక్ష్మీ దేవి .
పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి తో కూడిన దేవుళ్ళు
మీ యింట ఎల్లప్పుడూ వుందురుగాక! అని అర్థము.
సరస్వతి, లక్ష్మీ, పార్వతులనడంలో
విద్యలు, ఐశ్వర్యములు, సౌభాగ్యములు
మీ యింట వుండాలి అని అర్థం.
శంఖ, చక్ర, త్రిశూలములు ధరించిన వారు అనడం వలన శత్రు బాధలు, రాక్షస బాధలు, మీకు వుండవు అని భావము.
త్రిమూర్తులు వారి భార్యలతో మీ ఇంట వుందురు గాక!అనటం తో సర్వ సౌఖ్యములు, విద్యలతో పాటు , శాశ్వతమైన పరంధామము మీకు లభించుగాక!
అని చమత్కారమైన ఆశీర్వాదము.
జైహింద్.
1 comments:
Nice information.
Puzzles
8 liter 5 liter 3 liter puzzle
10 7 3 liter puzzle
5 liter and 3 liter puzzle
Water Jug Problem
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.