గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీ పుల్లెలశ్యామ్ గారి మణిప్రవాళములో అందగించిన కందము

జైశ్రీరామ్ . 
శ్రీ పుల్లెలశ్యామ్  గారి మణిప్రవాళములో అందగించిన కందము దాని బంధమరందమాధురి గ్రోలండి.
కం. 
ఐ నో సమాఫ్ద పీపుల్ 
మే నాటెంజోయ్ ద తెలుగు మీటరినింగ్లీష్ 
వై నాటీజ్ మై క్వొశ్చెన్ 
హౌ నై సీజ్ దట్ రిథం యిననదర్ లాంగ్వేజ్.
జైహింద్.
Print this post

5 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ పుల్లెల శ్యాంసుందర్ గారి కందము నూత్న రీతిలో అద్భుతంగా నున్నది .హేట్సాఫ్

Zilebi చెప్పారు...

చింతా వారు,

పుల్లెల వారు రాసేరు కాబట్టి బతికి పోయేరు !

జిలేబి రాసి ఉంటే వామ్మో :) వాయ గొట్టేసి ఉండరూ :)

చాలా బాగుందండీ :)

చీర్స్
జిలేబి

Zilebi చెప్పారు...


వైనా టీజ్ మై క్వొశ్చెన్ !
ఐనో బట్యిఫ యిటెల్యు ఐవిల్ బీకిల్డ్ :)
ఫైనర్ దస్కిల్ గోస్ సర్
ఫైనర్ యుబికం ద తెలుగు ఫైర్బ్రాండ్ దట్జ్ వై :)

చీర్స్
జిలేబి

పుష్యం చెప్పారు...

చింతా వారికి, నమస్సులు. మీవంటి ఉత్తమమైన బ్లాగులో నా పద్యము ప్రచురించినందుకు ధన్యవాదములు. ఇది పూర్తిగా ఆంగ్లములో వ్రాయబడినది గాబట్టి దీనిని మణిప్రవాళమని అనలేమేమో?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మీరు చెప్పినది నిజమేనండి. కాని నామ వాచక పదమైనప్పటికీ తెలుగు అనే పద పయోగాన్ని చూచి నేను దీనిని మణిప్రవాళము అని అన్నానంతే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.