గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఏప్రిల్ 2012, సోమవారం

విజయ భావన (విజయనగరం) 388 వ సభ - "కవితా చమత్కృతి"

జై శ్రీరామ్.
సాహితీ ప్రియ బంధువులారా! ఆత్మీయులు, అభిమానులు, సాహితీ ప్రియులు, అవకాశమున్న వారు విజయ భావన సాహితీ సభకు వచ్చి ప్రోత్సాహ కారకులవగలరని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని గూర్చిన వివరాలు ఈ ఆహ్వాన పత్రం ద్వారా మీ ముందుంచుతున్నాను. 
నమస్తే.
జైహింద్.
Print this post

8 comments:

కథా మంజరి చెప్పారు...

వి.య భావన సభలో మీరు ప్రథాన వక్తగా పాల్గొంటన్నందుకు, కవితా చమత్కృతి అనే చక్కని అంశం మీద ప్రసంగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

సభ విజయవంత మవాలని కోరు కుంటున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రమా! ధన్యవాదములు.

సో మా ర్క చెప్పారు...

మంచి కార్యక్రమమైనా,దూరాభారం కారణంగా రాలేకపోతున్నందుకు మన్నించగలరు.మీ కార్యక్రమం విజయవంతం కావాలని కవితా సరస్వతిని ప్రార్ధిస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! సోమార్క గారూ! మీ అభిమాన పూర్వక శుభాకాంక్షలకు హన్యవాదాలు.

prajapatrika చెప్పారు...

arya
innallaku meeku saraina vedika dorikindi. chitra kavitva chamatkriti pai meeru maatladinadi vrasi pampandi. prachurinchi marinta mandiki andistamu. eee amsam pai ippadivaraku meeru chesina krushini samrdavantanga prakatinchandi..abhinandanalu
~Sudarsan, editor, Praja Patrika, Rajahmundry cell: 98480 95374

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
విజయ భావన సభలో ప్రధాన వక్త గా పాల్గొంటు న్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇంకా ఇలాగె అనేక సభలలో , ప్రసంగములు , అవధానములూ , చేస్తూ , దిగ్దిగంతాలకు కీర్తి ప్రతిష్టలు దద్ద రిల్లాలని దీవిస్తూ , హృదయ పూర్వక శుభా కాంక్షలు . ప్రేమాభి మానములతో అక్క

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రజాపత్రికాధీశ్వరులు సుదర్శన్ గారికి.
ఆర్యా! మీ అవ్యాజానురాగానికి నా ధన్యవాదములు. మీ అందరి శుభాకాంక్షల ఫలితంగా విజయనగరంలో విజయ భావనలో నా ఉపన్యాసం ప్రశంసనీయంగానే సాగిందని ఆక్కడి పెద్దల మాటలను బట్టి భావిస్తున్నాను.
ఈ విషయంలో నన్ను ప్రోత్సహించిన సాహితీ బంధువులందరికీ నా ధన్యవాదములు తెలుపుకొంటున్నాను.
మీకు నేను నా ఉపన్యాస సారాంశాన్ని సమగ్రంగా త్వరలో పంప గలను.
ధన్యవాదములతో
మీ
రామ కృష్ణా రావు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా! నమస్తే. మీరు నమస్కరించి వ్రాయడం నాకు బాధ కలిగిస్తోంది. అన్యధా భావింపక ఆశీస్సులు మాత్రమే అంద జేయ గలరని భావిస్తున్నాను.
మీ అందరి ఆశీస్సుల బలంతో విజయ నగరంలో విజయ భావనలో నా కార్యక్రమం ప్రశంసనీయంగానే సాగిందని శ్రోతల మాటలను బట్టి అర్థమయింది. అంతా ఆ శారదాంబ కృప.
నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.