గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, అక్టోబర్ 2011, గురువారం

శ్రీ నేమానివారి సూచనలు.

ప్రియ మిత్రులారా! తెలుగు పద ప్రయోగాలలో సాధారణంగా మనకు తెలియకుండానే అసాధువులు కూడా దొర్లిపోతుంటాయి.
అలాంటి ప్రయోగాల్లో కొన్ని  అసాధు ప్రయోగాలను శ్రీ పండిత నేమానివారు  ఈ విధంగా చూపిస్తున్నారు.  చూడండి.
మిత్రులారా!
కొందరి రచనలను చూచి ఈ క్రింది సూచనలను చేస్తున్నాను:
(1) శక్తివంతుడు(తప్పు) : శక్తిమంతుడు (ఒప్పు)
ఇకార ఉకారముల మీద "మంతుడు" అనే వాడాలి.
ఉదా: ధీమంతుడు, శ్రీమంతుడు, బుద్ధిమంతుడు, 
హనుమంతుడు, ఆయుష్మంతుదు, రోచిష్మంతుడు
(2) దేశముకు(తప్పు), దేశమునకు (ఒప్పు)
ఉకార ఋకారముల తరువాత "నకు" అని చేర్చాలి.
ఉదా: రాజునకు, పితృనకు, పుత్రునకు, 
ఔత్సాహికులైన రచయితలు ఈ సూచనలను గ్రహించగలరు.
ఇట్లు
పండిత నేమాని.
అవి తప్పక మనం గ్రహించాలనే భావనతో మీముందుంచాను.
జైశ్రీరాం.
జైహింద్.  
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఓర్పు తో మంచి సూచనలను ఇచ్చి పద్య రచనను ప్రోత్స హిస్తున్నందులకు గురువులు ' పూజ్యులు ఐన పండితోత్తములకు కృతజ్ఞతా పూర్వక శిరసాభి వందనములు.

Pandita Nemani చెప్పారు...

సార్వవిభక్తిక సీసము:
జ్యేష్ఠుండు, రఘుకుల శ్రేష్ఠుండు, రాముండు
రాజాధిరాజ విరాజితుండు
రామునే తలచెద, రామునే కొలిచెద
రామునే మ్రొక్కెద స్వామి యనుచు
రాముని చేతనే రాజిల్లు నిరతమ్ము
ఘనముగా మా వంశ గౌరవమ్ము
రాముని కొరకు నే బ్రార్ధించి సాదర
వందనమ్ము లొనర్చుచుందు నెపుడు
రాము గంటెను వేరొక్క ప్రభువు లేడు
రామునకు జేయు సేవ మాత్రమ్మె చాలు
నందులో నేను ధన్యత్వమొందు వాడ
నో భరద్వాజ! సురభూజ! యోగిరాజ!

from Nemani's Adhyaatma raamaayanam

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.