గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, అక్టోబర్ 2011, గురువారం

సహృదయ సత్ ప్రియులారా! మీకు విజయ దశమి శుభాకాంక్షలు.

జగజ్జనని 
సహృదయ సత్ ప్రియులారా! మీకు విజయ దశమి శుభాకాంక్షలు.
మన అందరికీ  శుభము కూర్చుమని ఆ శారదా మాతను వేడుకొందాము.

అమ్మా! దీనజనావళిన్ గనెడి సౌహార్ద్రోజ్వలా! శారదా!
మమ్మున్ బ్రోచెడి కన్న తల్లి! కనుమా!మమ్మున్ సదాప్రేమతో.
సమ్మోదాత్మను వర్తిలంగ, కొలుపన్ సత్కార్యముల్, నిత్యమున్
మిమ్మున్ గొల్చుచునుండునట్లు. ఘను సంప్రీతిన్ సదా గొల్పుమా. 
జైశ్రీరాం.
జైహింద్.

Print this post

2 comments:

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

ఆర్యా ! మీకు, కవిమిత్రులన్దరకు విజయదశమి శుభాకాంక్షలు.

కం: దుర్గతి గలుగదు, జీవన
మార్గము గన స్వర్గ మగును,మనసున అరిష
డ్వర్గములారును ఆరును,
దుర్గను మది దలచి వేడ దురితము లణగున్ .

పంతుల జోగారావు చెప్పారు...

మీకు మా దసరా శుభాకాంక్షలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.