ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన!
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !
కll
చతురాస్యుఁడ! నా నుదురున
అతులిత దుష్కర్మవ్రాయి! హాయిగ వలతున్!
స్తుతియింపగ నరసికుల
మతిమాలియు వ్రాయఁబోకు. మరువకుమయ్యా!
భావము:-
ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా వ్రాయుము. సహిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం వ్రాయకుసుమా! . ముమ్మాటికీ వ్రాయకు.
జైహింద్
Print this post
7 comments:
నమస్కారములు అవును నిజమె భగవంతుడు ఎన్ని కష్టాలను పెట్టినా భరించ గలము.గాని రసికత్వము లేని వారి ముందు చెవిటి వానిముందు శంఖం ఊదినట్టె అంతే కాదు వారి మాటలు మనసుని ఎంత గాయ పరుస్తాయొ ఇది వినండి రచయిత్రి అంటే గొప్పేముంది " బూతులేగా రాసేది " ? అని ఇద్దరే ఇద్దరు అన్నారు వారికి సాహిత్యం అస్సలు గిట్టదు,సరికదా చాలా హేళన అన్నమాట నాగరికత మోజు తెలుగు నామోషీ. ఇది నా స్వానుభవం మంచి పద్యం చెప్పారు.ధన్య వాదములు.
ఈ శ్లోకం చివరి రెండు పాదాలూ బాగా ప్రాచుర్యం పొందినవి. గుర్తు చేసినందుకు అభినందనలు! తెలుగు పద్యం మీరు రాసిందేనా?
‘శంకరాభరణం’ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర శంకరశాస్త్రి ధోరణిని నిందిస్తూ ఈ శ్లోకభావాన్ని ప్రస్తావిస్తుంది.
కాళిదాసు రాసిన ఈ శ్లోకం ఏ కావ్యంలోదో సందర్భం ఏమిటో కూడా వివరించివుంటే ఇంకా బావుండేదండీ.
ఆర్యా,
నేను ఇవ్వాళే మొదటి సారి మీ బ్లాగ్ చూసాను. అద్భుతం. మాలిఖ మాలిఖ మాలిఖ అని వేడుకున్నది కాళిదాసు కదా? కాకపోతే, ఇటువంటి భావము తో కాళిదాసు శ్లోకము కూడా ఉందని విన్నాను. దయ తో తెలుపగలరు
భవదీయుడు,
సీతారామం
అమ్మా! రాజేశ్వరీ మాతా!
ఎవరైనా మంచి మాటలు మాటాడే సమయంలో అవి వినడానికి కూడా యోగ్యత ఉండాలమ్మా!
ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. పాపం మీకు వ్యతిరేకంగా మాటాడిన వారికి ఎదురైన సంఘటనలు సాహిత్యం పట్ల విరక్తి కలిగించేవిగా ఉన్నాయేమో! ఐతే అన్ని కవిత్వాలూ అలాగే ఉంటాయనే భ్రమో? లేక కవులందరూ వ్రాసేవాటిలో ఏమీ ఉండదనే విశ్వాసమో వారినలా మార్చినందుకు మనం చింతించడం తప్ప వేరే ఏమీ చెయ్యలేము కదా! భగవంతుణ్ణి అందరికీ మేలే చెయ్యమని ప్రార్థించడం మాత్రమే మనం చేయగలిగేది.
మీ అబిమానానికి ధన్యవాదాలు.
ఆర్యా! వేణూ గారూ! సాహిత్యము యెడల మీకు గల ఆదరణకు అభినందనలు.
నేను బ్లాగులో వ్రాసిన శ్లోకాలకు చేసే అనువాద పద్యాలు నేను వ్రాస్తున్నవే.
ఆ విధంగా కాక ఎవరై పద్యాలైనా ఉదహరిస్తే తప్పక అది రచించిన కవి పేరుతెలిస్తే వ్రాత్స్సను. పేరు తెలియకపోతే అజ్ఞాత కవి రచించినదని వ్రాస్తాను.
నీ సూచనలు చాలా బాగున్నాయి. తప్పక వీలైనంత వరకూ అనుసరిస్తాను.
ఆంధ్రామృతాన్ని గ్రోలుతున్నందుకు ధన్యవాదములు.
ఆర్యా! సీతారామా!
మర్యాదను పెంచి నన్ను మన్ననఁ గనిరే!
సూర్యుని కిరనముచే నని
వార్యంబుగ వెలుగు మణిగ వర్ధిలుదికపై!
ఇది కాళిదాసు గారి కవిత్వం అని తెలుసు కానీ ఎందులోది sir? అలాగే "ఇతర" అనే శబ్దానికి అర్థం తెలుపగలరు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.