గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఏప్రిల్ 2010, ఆదివారం

వట పత్ర శాయీ! నమామ్యహమ్.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj682JS3K2W_kE5Ajr-QUbY7oMqbVdKl5oMCsKW3yq8_1Bxc7Uj-gScswc6TW8oNRP9JpPUTeji23DpVMuI-dCc5-0hipJ4Lffa0ocbQx9XfA48ins-TPZSzCJ_lsWG_yOeADrThGcIPwY/s400/krishna1.jpg 
శ్లో:-కరారవిందేన పదారవిందమ్ ముఖారవిందే వినివేశయమ్ తమ్
వటస్య పత్రస్య పుటే శయానమ్ బాలమ్ ముకుందమ్ మనసా స్మరామి.

క:- కరపద్మములను గొనుచును

చరణాబ్జము; ముఖజలజముఁ జక్కగ నిడుచున్
ధరణి వట పత్ర శయనుని
దరహసితుఁని; బాలకృష్ణుఁ దలతును నేనున్.
-:భావము:-
పద్మముల వంటి చేతులతో పద్మముల వంటి కాళ్ళను పట్టుకొని

ముఖ పద్మమున చేర్చుచు;
వట పత్రముపై శయనించి యున్నబాల ముకుందుని 
మనసారా స్మరింతును. 
జైహింద్.






Print this post

4 comments:

రవి చెప్పారు...

"భారతి" అని దూరదర్శన్ వారి ఛానెల్ ఒకటొస్తుందండి. అందులో సంస్కృత పద్యాల "అంత్యాక్షరి" జరుగుతుంది. అక్కడ ఈ శ్లోకం విన్నాను. మళ్ళీ ఆ అమృతబిందువులు ఇక్కడ మీ బ్లాగులో!

శ్లోకం మొదటి పాదం చదివినప్పుడు మా పాపాయి గుర్తొచ్చి మనసు నిండిపోయింది.

ధన్యవాదాలండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవి రవీ!
హృదయ వచశ్శరీరముల ఎంతయు పుణ్య సుధా ప్రపూర్ణులై
ముదము బహూపకారములు మూడు జగంబులకున్ ఘటించుచున్
వదలక సాధు సద్గుణ లవంబులు కొండలు చేసి మెచ్చుచున్
మదిని వికాస యుక్తులగు మాన్యులు కొందరు ఒల్తురిద్ధరన్.
మీ కామెంట్ చూసిన నాకు ఈ పద్యం స్ఫురనకు వచ్చింది.
మిమ్ములను కన్న పూజ్య తల్లిదండ్రులకు; నమస్కరించాలనిపించింది.
చక్కని ఆలోచన మన మనస్సు చేయద మన్నది మన పురా కృత సుకృత వెశేషమే గాని వేరు కాదు.
ధన్యోసి.ఇలాగే కలకాలం సహృదయుఁడవై వర్ధిల్లుదువు గాక.
ధన్యోస్మి.
శుభాశీశ్శులు.

కథా మంజరి చెప్పారు...

వట పత్ర సాయిని ఎంత అందంగా చూపించారండీ ...చక్కని శ్లోకానికి అందమయిన వివరణ. మీ బ్లాగు టపాలు చూడడం ఒక గొప్ప కావ్యంలోని రసవత్తర ఘట్టాలు చదువుతున్నట్టుగా ఉంటుందండీ. మీ పాండిత్య ప్రకర్ష ఆశ్చర్య కరంగానూ. అభినందనీయంగానూ ఉంది.
మంచి మంచి విషయాలు మాకు ెరుక పరుస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు " వట పత్ర శాయి " చిత్రం ఎంత అందం గా ఉందొ చూసిన కొలదీ చూడాలని పించేలా ఉంది. అంతేనా ? శ్లోకం ,అంతకు మించిన పద్యం,విశదీకరించి చెప్పే భావం అసలు ఈ రసామృతాన్ని ఆస్వాదించగల తరుణం నాకు ఇప్పుడే దక్కింది. వాగ్దేవి వర పుత్రులు మీరు.ఇక పెద్దల ప్రశంసల ముందు ప్చ్ ! నా చిన్న కలం ఎంత ? మీ సోదరి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.