శ్లో:-
కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా
బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే.
అంబా కురంగ మద జంబాల రోచిరిహలంబాలకా దిశతుమే
శం బాహులేయ శశి బింబాభిరామ ముఖ సంబాదిత స్తనభరా!
సీ:-
కంబు సన్నిభమైన కంఠంబు కల తల్లి;
వీణ దాల్చిన మృదుపాణి జనని.
బింబోష్ఠయు' కదంబ విపిన సంచారియు;
ఇంద్రాది సుర వంద్య . యీశు రాణి.
కస్తూరి ప్రభ యుక్త కాల వర్ణ శిరోజ.
కమనీయ కాంతుల కల్పవల్లి.
శశిబింబమును బోలు షణ్ముఖపీడిత
స్తనభరంబుననొప్పు చక్కనమ్మ.
గీ:-
మాతృ దేవత దుర్గమ్మ మహిమ గొలిపి;
శుభము లిచ్చుత. ఎనలేని సుఖము లిడుత.
శాస్త్ర సు జ్ఞాన సంపద చక్క నొసగి
కాచు గావుత నన్ను సుజ్ఞాన మాత.
భావము:-
కంఠము యొక్క ఆకారము చేత శంఖముతో మిక్కిలి పోలిక కలదీ; లేత సొరకాయను పోలిన వీణతో కూడి యున్నదీ; దొండ పండు వంటిఅధరము కలదీ; కడిమి తోటలో వినమ్రులై నమస్కరిస్తున్న వజ్రాయుధుడైన ఇంద్రాది దేవతల సమూహము కలదీ; కస్తూరి యొక్క పంకము యొక్క కాంతి గల వ్రేలాడుతున్న కురులు కలదీ; కుమార స్వామి యొక్క చంద్ర బింబము వలె మనోహరమైన ముఖముతో;పీడింప బడిన కుచ భారము కలదీ అయిన మాత్రు మూర్తి పార్వతీ దేవి నాకు శుభాన్ని; సుఖాన్ని; శాస్త్ర సంపదను; ఈ జన్మములో ప్రసాదించు గాక!
జైహింద్.
Print this post

4 comments:
చకితులఁ జేయు మీరల వచస్సురభీకరశోభిఁ బద్యముల్
సుకృతము మాది, యిట్టి సుప్రసూనమరందములంది గ్రోలగన్
చికి యగు కైతలమ్మకును చేతులు మోడ్చి నొసంగ, మీకు నా
చకిత కురంగ లోచని యశస్సు, శుభంబులు నెల్ల నిచ్చుతన్
పరిమళ భరితమైన పద్య పుష్పాలను అను నిత్యం పూయిస్తూ ,నిత్య నూతనమైన జగన్మాత దర్శన భాగ్యం కలిగిస్తూ, భక్తి రసామృతాన్ని భావంలొ ఒలికిస్తూ,పదుగురితొ పదే పదే చదివిస్తూ చింతా వారు అందిస్తున్న అశ్వధాటి అనువాదం ఎన....లేని....సాటి....మేటి.
అభీష్ట సిద్ధిరస్తు .అక్క
భా‘రవీ!
చక్కని కవితా ధార నలవరచుకొనిన నీకభినందనలు.
రవితేజంబుపమింపనెట్టులగు నీ రమ్యంపు సద్భావనల్
సువిధేయత్వము;సుందరాత్మయును;నన్శోభిల్లగాజేయ సత్
కవితల్ చక్కగచెప్పనేర్చుటయు;సత్ కాంక్షించుటల్ చూడగా
రవి తేజంబును చంద్ర కాంతి చలువల్ రాజిల్ల నీవైతివా?
నీ అభిమానానికి ధన్యవాదములు.
చాలా బావుంది.
రవి పద్య రూప వ్యాఖ్య కూడా భేషు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.