గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, అక్టోబర్ 2009, గురువారం

అదొక పెద్ద వెల్లువ. దాని సంగతి మీకు తెలుసా?

ప్రియ పాఠకులారా!
మనం అక్షౌహిణిని గూర్చి ముచ్చటించుకున్నాం కదా! అది బారతం వరకే మనం పరిమితమై చెప్పుకున్నాం. ఐతే రామాయణం లోనికి తొంగి చూస్తే భారతంలో చెప్పిన 18 అక్షౌహిణీల సైన్యం అత్యల్పమనిపించక మానదు. మీరూ పరికించండి.

కంబ రామాయణంలో " సుగ్రీవుని వద్ద గల సైన్యం " 70 వెల్లువలట.
ఈ వెల్లువ సంగతి మనకు వివరంగా తెలియక పోయినా "అది పార్టీ మీటింగ్‍కు వచ్చినజనమేంటిరా బాబు, అదో పెద్ద వెల్లువ" అని వాడేస్తూ ఉంటాం.
ఇప్పుడీ వెల్లువ విషయం తెలుసుకుందాం.

అక్షౌహిణికి ఎందరుంటారో మనం ఇంతకు ముందు టపాలో తెలుసుకున్నాం కదా! అటువంటీ
8 అక్షౌహిణులు = ఒక ఏకము.
8 ఏకములు = ఒక కోటి. {ఈ కోటి మనం వాడుకునే నూరు లక్షలొక కోటి అన్నది మాత్రం కాదని గుర్తించండి.}
8 కోట్లు = ఒక శంఖము.
8 శంఖములు = ఒక కుముదము.
8 కుముదములు = ఒక పద్మము.
8 పద్మములు = ఒక నాడి.
8 నాడులు = ఒక సముద్రము.
అటువంటి
8 సముద్రములు = ఒక వెల్లువ.
అంటే 366917139200 మంది సైన్యం ఉంటే దానిని వెల్లువ అంటారన్నమాట.

ఇటువంటివి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుడి అధీనంలో ఉండేది.
అంటే 256842399744000 సైన్యమన్నమాట.
ఆ సుగ్రీవుని వద్ద గల సైన్యాధిపతులే 67 కోట్ల మంది.
వీటన్నిటికీ నీలుడు అధిపతి.
ఆశ్చర్యంగాలేదు?

తెలుకోవాలనుకున్నా, తెలియఁజెప్పాలనుకున్నా చాలా చాల విషయాలు మన చరిత్ర పుటల్లోంచి లభిస్తూనే ఉంటాయి గ్రహించేవారికి. మీకు తెలిసిన విషయాలు నాకూ తెలియఁజేయండి.

జైహింద్.
Print this post

2 comments:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఆర్యా,
ఆ కాలంలో రాజరిక వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ. ప్రతి గ్రామానికీ ఒక పెద్ద, ఆ పెద్దే ఆ ప్రజలకు అధిపతి. మిగిలిన అందరూ ఆపత్కాల సమయాల్లో సైనికులే.. కాబట్టి.. ఇది అప్పటి జనాభాలెక్క అయివుండవచ్చని నా అభిప్రాయం. చర్చలకు ఆస్కారం లేదు.తోచింది చెప్పాను.

Sanath Sripathi చెప్పారు...

అదిరిందండీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.