జైశ్రీరామ్.
శ్రీ చక్రబంధ అష్ట లక్ష్మీ స్తోత్ర గీతావళి.
౧. లక్ష్యమును జేర్చు శ్రీ గజలక్ష్మి మ్రోల
మనసు నిల్పుదు. శ్రీదేవి మమ్ము చేదఁ
గవన మత్తేభ శ్రీ కల్గి కాంక్ష తీర్- చు
లక్ష్య మది గని, లబ్ధి దలంచుమేల.
౨. రక్ష ధన లక్ష్మి శ్రీఁ గొల్పు నక్షయంబు
వర్ధనము చేయుశ్రీ శుభ భావశ్రీని
కొలుచు వారికి శ్రీ లక్ష్మి కొల్పు భాతి
రక్షవయి కొల్పు బుద్ధిని భ్రాంతి తీర!
౩. లక్ష్య నరునికి శ్రీ ధాన్య లక్ష్మి ప్రాపు
దయను పోషించు శ్రీకివే దండి పూలు
లేమి విడనాడ శ్రీ సేవలే సురక్ష
లక్ష్మి దరి లేని పుష్పాలు లక్షలేల?
౪. లక్ష శుభములు శ్రీ ధైర్య లక్ష్మిఁ జేర
లక్ష్మిలసమాన శ్రీ ధైర్య లక్ష్మి వెంట
నమరు వారలు శ్రీ దీప్తి కంక మాల్య
లక్ష్మిలభినవరక్షట లౌల్యమేల
౫. కలిత సంతాన శ్రీలక్ష్మి. జ్ఞాన పుత్రు
లక్ష్యముననిచ్చు శ్రీముక్తిలాభమౌను
చపలతన్ బాపు. శ్రీజ్ఞాన శక్తిఁ దేల్చు
కమలలోచన త్రుళ్ళును కాల్చు గాక!
౬. విద్య యనఁబడు శ్రీ లక్ష్మి! విశ్వ మాత !
నశ్వరముఁ బాపు శ్రీదివ్య జ్ఞాన ధామ !
రుచిరసన్నుత శ్రీ విద్య రోచిఁ గొల్పు!
విద్యనమరుచు తల్లి! మద్వేల్పు దేవి!
౭. లక్ష్యములఁ గూర్చు శ్రీ ఆది లక్ష్మి జ్ఞాన
ముద్ర ధరియింతు శ్రీభక్త పూజ్య మ్రోల
గొప్ప కవిఁ జేసి శ్రీ లక్ష్మి కొల్పు భాతి
లభ్యమునుఁగొల్పినన్నేల లాఁతి యేల
౮. సత్కవులపాలి శ్రీకర చంద్ర వంక
జగతి సద్రూప శ్రీలిచ్చు,చక్కఁ గాచు
శ్రీ విజయ లక్ష్మి.శ్రీ జన సేతుచంద్ర.
సద్విజయ శ్రీని కల్పించుచంద్రభాస!
కృతికర్త.
చిత్రకవితాసమ్రాట్....కవికల్పభూజ....పద్యకవితాభిరామ....చిత్రకవితా సహస్రఫణీ....పుంభావ భారతి.
చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ .,P.O.L., M.A., విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. ఆ 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165
రచనలు.
1) అగ్నిసూక్తము .. పద్యానువాదము.
2) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
3) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమున మూడు ప్రాసయతులతో ఒక్క
రోజులో వ్రాసినది.)
4) ఆంధ్ర సౌందర్యలహరి. సంస్కృతశ్లోక, పదచ్ఛేద, అన్వయక్రమ, పద్య, ప్రతిపదార్థ,
భావసహితము.
5) ఆంధ్రామృతమ్, పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.
6) ఈశావాస్యోపనిషత్ పద్యానువాదము. తే. 04 - 11 - 2025.
7) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
8) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
9) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 -
2025.
10) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
11) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
12) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
13) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
14) బాలభావన శతకము.
15) మూకపంచశతి పద్యానువాదము.
16) మృడ శతకము. శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)
17) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
18) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
19) రాఘవా! శతకము.
20) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
21) రుద్రమునకు తెలుగు భావము.
22) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
23) వసంతతిలక సూర్య శతకము.
24) విజయభావన శతకము.
25) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
26) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.
27) శ్రీఅవధానశతపత్రశతకము.
28) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
29) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
30) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
31) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
32) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
33) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత
118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)
34) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
35) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
36) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
37) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ.10-3-2025మరియు 11-3- 2025.తేదీల మధ్యవిరచితము.
38) శ్రీలక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
39) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
40) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున
మూడు మకుటములతో మూడు శతకములు.)
41) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
42) శ్రీ శివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)
43) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.
44) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు,
సీతాన్వయముగా తేటగీతి పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో
సుందరోత్పల నక్షత్రమాల.)
45) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
46) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము
47) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత
పాదఉత్పలమాలిక.
48) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)(ఏకదిన విరచితము)తే.20 – 4 – 2025.
49) సంక్షిప్త రామాయణము. పద్యానువాదము.
50) శివసహస్రము పద్యార్చన.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.