జైశ్రీరామ్.
శ్లో. అనాయాసేన మరణం - వినా దైన్యేన జీవనమ్
దేహాంతే తవ సాన్నిధ్యం - దేహిమే పరమేశ్వరమ్||
తే.గీ. కష్టదూరమౌ మరణంబు కరుణనిమ్ము,
దైన్య దూర జీవనమును దయనొసగుము,
పాపపుణ్యాల ఫలములు వాయఁజేసి
నేను మరణించు వేళ నన్ నీవె కొనుము.
భావము. ఓ పరమేశ్వరా(రీ)! నాకు కష్టము లేని మరణమునే ప్రసాదించుము.
దైన్యమెఱుగనట్టి జీవనమే దయతో నొసంగుము. నన్ను పాపపుణ్యముల
ఫలశూన్యునిగా చేసి దేహము విడుచు వేళలో నీలోనికి నన్ను చేర్చుకొనుము.
పై శ్లోకాన్ని
దైవ దర్శనం, సేవలు అనంతరం గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు
దేవాలయ ప్రాంగణంలో కాసేపు కూర్చొని,
గుడిలో దర్శించిన మూర్తిని జ్ఞాపకానికి తెచ్చుకొని
మనస్సులోనే దర్శించుకొని పఠించాలి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.