గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2024, శనివారం

ఐఐటి ఖరక్ పూర్ విద్యార్థి అసమాన సాహితీ ప్రతిభకు నిదర్శనం .20ఏళ్ల సాహిత్ ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

10 నిమిషాలు చాలు..పండితుడైనా..పామరుడైనా..వినాల్సిన సందేశమిది#Jagadguru @...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, నవంబర్ 2024, గురువారం

26 - 11 - 2024న డా.పీ.టీ.జీ. రంగాచార్యులవారి ఇంటివద్ద జరిపిన సత్కారం.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

నాప్రాప్యమభివాంఛంతి . ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  నాప్రాప్యమభివాంఛంతి   -  నష్టం నేచ్ఛంతి శోచితుం ౹

ఆపత్సు చ న ముహ్యంతి   -  నరాః పండిత బుద్ధయః ౹౹

తే.గీ. ప్రాప్తమవనట్టిదానికై పరుగులిడరు,

తాము కోలుపోయిన దానిఁ దలపరు మది,

ఆపదలవేళ మోహమ్మునందబోరు,

బుద్ధిమంతులౌ పండితుల్, బుధవరేణ్య!   

భావము.  ప్రాప్తి లేనిదాన్ని వివేకం ఉన్న పండితులు ఆశించరు.నష్టమైనదానికి 

చితించరు.అలాగే,ఆపత్తు కాలంలో ఏ మోహానికి గురి కారు.

జైహింద్.

27, నవంబర్ 2024, బుధవారం

23 శతకములు (PDF) తెలుఁగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోవచ్చును.

0 comments

జైశ్రీరామ్. 

23 శతకములు (PDF) తెలుఁగులో. 

ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోవచ్చును.


వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-1

కాళహస్తీశ్వర శతకము www.freegurukul.org/g/Shathakam-2

సుమతి శతకం www.freegurukul.org/g/Shathakam-3

కుమార శతకము www.freegurukul.org/g/Shathakam-4

కుమారి శతకం www.freegurukul.org/g/Shathakam-5

దాశరధి శతకము www.freegurukul.org/g/Shathakam-6

భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-7

వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-8

భాస్కర శతకం www.freegurukul.org/g/Shathakam-9

పుణ్య గానము www.freegurukul.org/g/Shathakam-10

భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-11

శతక త్రయము www.freegurukul.org/g/Shathakam-12

శతకాల్లో రత్నాలు www.freegurukul.org/g/Shathakam-13

దాశరథి శతకము-కంచెర్ల గోపన్న-రామదాసు www.freegurukul.org/g/Shathakam-14

కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-15

దశావతారను శతకము www.freegurukul.org/g/Shathakam-16

కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-17

కలివర్తన దర్పణం www.freegurukul.org/g/Shathakam-18

ఆంధ్ర నాయక శతకం www.freegurukul.org/g/Shathakam-19

మదాంద్ర నాయక శతకము www.freegurukul.org/g/Shathakam-20

మారుతి శతకం www.freegurukul.org/g/Shathakam-21

మూక పంచశతి కటాక్ష శతకం www.freegurukul.org/g/Shathakam-22

నరసింహ శతకము www.freegurukul.org/g/Shathakam-23

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

జైహింద్.

25, నవంబర్ 2024, సోమవారం

కారముకన్నులంబడగ కారెనవారితహర్షబాష్పముల్. పద్యభారతిలో ఈనాటి సమస్యకు నా పూరణ.

0 comments

జైశ్రీరామ్.

 ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

పద్యభారతిలో  ఈనాటి సమస్య.

👇🏼

ఉ.కారముకన్నులంబడగ కారెనవారితహర్షబాష్పముల్.

నాపూరణ.

👇🏼

ఉ. శ్రీరమణీ మనోహరుని, చిద్వరతేజుని, సుప్రశస్త సు

స్మేరముఖాబ్జశోభితుని, చెన్నుగ భక్తులఁ గాచుచున్ ననున్

జేరఁగ వచ్చినట్టి నరసింహుని దివ్యమనోజ్ఞమౌ శుభా

కారము కన్నులం బడగ కారె నవారిత హర్ష బాష్పముల్.

అమ్మదయతో🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

24, నవంబర్ 2024, ఆదివారం

తే.23 - 11 - 2024న శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమంలో అష్టావధానంలో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డిగారు ఆశువు పృచ్ఛకులు. నేను నిషిద్ధాక్షరి.

0 comments

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
ఆర్యులకు ప్రణామములు.🙏🏼

నిన్నటి సభలో
👇🏼
శా.  శ్రీమన్మాడ్గుల సద్వధాని ఫణి! రాశీభూత విఞానమా!
యీ మంథన్ మహనీయ శోభతమచే హృద్యంబునైవేద్యమై,
ధీమంతుల్ కిషనాఖ్యులున్ బొగడగాదివ్యంబుగా నొప్పు నీ
శ్రీమద్భారతదేశ కీర్తి వెలుగున్ చెల్వొందు నల్దిక్కులన్.

అమ్మదయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

తే.22 - 11 - 2024న కోటిలింగాల తీర్థక్షేత్రదర్శనభాగ్యంపొందిన సన్నిహితులతో నేను.

0 comments

జైశ్రీరామ్. 

జైహింద్.





తే.22 - 11 - 2024న ధర్మపురిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయములో ఆస్థాన వేదపండితులు దేవాలయాధికారులు అత్యంత గౌరవముతో నాకు చేసిన సత్కారం.

1 comments

జైశ్రీరామ్. 

మ.  కొరిడేవంశజ విశ్వనాథులె కృపన్ గూర్మిన్ ననున్ మెచ్చుచున్
వరణీయుండుగ చెప్పినంతనె దయావర్షంబు కుర్పించుచున్,
సురలట్లచ్చట నాకు సత్కృతులతో సద్దీవనాళిన్, ప్రభా
రమణీయంబుగ వేదమంత్రములతో రాణింపగాఁ జేసిరే.
ఈ స్వామివారి సన్నిధిలో మహనీయులైన ఈ పెద్దలు నన్ను అవ్యాజానురాగంతో సత్కరించి వేదమంత్రములతో తమ అమూల్యమైన ఆశీర్వచనములందించి ఆశ్చర్యచకితుని చేసిరి. అట్టి ఈ పెద్దలందరికి, ముఖ్యముగా బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథశాస్త్రి మహోదయులకు నా ధన్యవాదపూర్వక నమస్సులు.

జైహింద్.

21, నవంబర్ 2024, గురువారం

అతిథి ఇంటికి వచ్చినప్పుడు సంస్కృతంలో సంభాషణ मित्रस्य आगमनम् Conversatio...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అనాయాసేన మరణం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అనాయాసేన మరణం   -  వినా దైన్యేన జీవనమ్ 

దేహాంతే తవ సాన్నిధ్యం   -  దేహిమే పరమేశ్వరమ్||

తే.గీ.  కష్టదూరమౌ మరణంబు కరుణనిమ్ము,

దైన్య దూర జీవనమును దయనొసగుము,

పాపపుణ్యాల ఫలములు వాయఁజేసి

నేను మరణించు వేళ నన్ నీవె కొనుము.

భావము.  ఓ పరమేశ్వరా(రీ)! నాకు కష్టము లేని మరణమునే ప్రసాదించుము. 

దైన్యమెఱుగనట్టి జీవనమే దయతో నొసంగుము. నన్ను పాపపుణ్యముల 

ఫలశూన్యునిగా చేసి దేహము విడుచు వేళలో నీలోనికి నన్ను చేర్చుకొనుము.

పై శ్లోకాన్ని 

దైవ దర్శనం, సేవలు అనంతరం  గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు 

దేవాలయ ప్రాంగణంలో కాసేపు కూర్చొని,

గుడిలో దర్శించిన మూర్తిని జ్ఞాపకానికి తెచ్చుకొని 

మనస్సులోనే దర్శించుకొని పఠించాలి.

జైహింద్.

ఉదయశ్రీ లలితాతారావళి. ప్రాతఃకాల పద్య స్తోత్రము. రచన. ... బ్రహ్మశ్రీ మరుమామల దత్తాత్రేయశర్మ. సంగీతం. శ్రీ స్వరసాధన శ్రీనివాస్. గానం. శ్రీమతి సరస్వతీరామశర్మ.

0 comments

 

జైశ్రీరామ్.
కం.  శ్రీ దాయిని నిత్యోదయ 
వేదాంత నిరూపితార్థ ప్రియవాగ్ధాత్రిన్ 
నాదౌ రీతిని దలతు ను 
షోదయవేళా విరాజ శోభాకృతిగాన్ ...1
భావము.
అమ్మా శ్రీ లలితా! అన్ని విధాల సిరిసంపదలు ఇచ్చే తల్లివి నీవు. వేదవేదాంతాలే నిన్ను ఇలా ఉంటావని పూర్తిగా నిరూపించలేక ఎప్పుడు కొత్తగానే నీ గురించి చెప్తాయి. ఐనా నా మాటలన్నీ ఇష్టంగా నీవు ఇచ్చినవేకదా! ఇలా ఏదో నాకు తోచిన విధంగా ఇష్టమైన ఈ మాటలతో ప్రతి ఉదయాన వెలిగే వెలుగుల అందమైన రూపానివిగా నిన్ను భావించి తరిస్తున్నాను. కనికరించు.

కం.  తలచెద నుదయపు వేళల 
లలితాంబిక వదన కమల రాగాధరమున్ 
లలియౌ ముత్తెపు ముక్కెర 
గల చంపక నాసికన్ ప్రకాశిత నేత్రన్...2
భావము.
అమ్మ శ్రీ మాతా! ఈ ఉదయం నిన్ను తలుచుకోగానే అందమైన కమలంలాంటి నీ ముఖంలో ఎరుపెక్కిన పెదాలు కనిపించాయి. అవి నాకేదో అద్భుతమైన మాటలు చెబుతున్నాయేమో అనిపించింది. అదిగో నీ ముక్కున మెరిసే సొగసైన ముత్యాలముక్కెర. దాని తెల్లని వెలుగుల్లో నీ మాటలు నన్ను ఆశీర్వదిస్తున్నట్టు ఉన్నాయి. ఆపైన సంపెంగలాంటి అందమైన కోటేరు ముక్కు, దానిపైన ప్రకాశించే నీ రెండుకళ్ళు.. ఇవన్నీ నాకు ఈ ఉదయాన్ని మరింత శోభామయం చేశాయమ్మా!

కం.  తలచెద చెవిదాకెడి క 
న్నుల వాత్సల్యమును గుఱియు, నూతన తిలకో 
జ్జ్వల ఫాలలోచనను, కుం 
డల దీప్తిన్ మందహాస టంకార శృతిన్...3
భావము.
అమ్మా !ఈ తెల్లారి వేళ నిన్ను తలచుకోగానే నీ ఏటవాలుకళ్ళు నా పైన అనంతమైన, కరుణాపూరిత వాత్సల్య రసాన్ని కురిపిస్తున్నాయి. నీ కడగంటి కటాక్షానికి నోచుకున్న ప్రియతనూజుడిని నేనే కదా! నీ విశాలమైన నుదిటిభాగంలో పెట్టుకున్న కుంకుమ ఎప్పుడూ క్రొత్తగా ప్రకాశిస్తూ అందమైన మూడవకన్నులా అగుపిస్తుందమ్మా! (త్రినేత్రుని అర్థాంగివి కదా) అది మా పైన ఎప్పుడు అమృతాన్నే వర్షిస్తుందమ్మా! నీ చెవులకు పెట్టుకున్న ఆ అందాలదుద్దులు, అవి సూర్యచంద్ర మణులతో వెదజల్లే కాంతులలో అలా అలా కదులుతూ మృదువైన టంకార నాదాలు చేస్తూ, నీ పలుకులకు శృతి కలుపుతున్నట్టుగా ఉన్నాయమ్మా!

కం. తలచెద లలితా సుందరి 
గళమంగళ సూత్రరక్షఁ గారుణ్యముతో 
తలదాల్చిన నెలవంకను 
తులలేని విభవములిచ్చు తోయజ నేత్రన్..4
భావము.
అమ్మా లలితా మాతా! సర్వమంగళ స్వరూపిణివి అయిన నీవు మంగళ సూత్రంతో ఎల్లవేళలా ఈ లోకాలనన్నిటినీ కాపాడుతున్న జగన్మాతవు! పరమ కరుణామయమైన హృదయంతో తలపైన నెలవంకను ధరించి ఈ లోకాలకు వెలుగులు ప్రసాదిస్తున్నావు. నీవే పద్మవు. పద్మం లాంటి నీముఖ బింబంలో కమలాల వంటి నీ కళ్ళు మాకు లెక్క లేనన్ని సంపదలను అందిస్తున్నాయి . ఉదయాన్నే ఇంతటి నీ త్రిపురసుందరీ రూపాన్ని తలచుకుంటే చాలు అన్ని శుభాలే!

కం. కొలిచెద నుదయమె సదయను 
కలితమృగమద సులలాట కాంతిన్ క్షాంతి 
న్నలకల చిరుమేఘావళి  
కళలలరారెడు విలాస కాదంబినినిన్...5
భావము.
అమ్మ శ్రీ లలితా! ప్రతి ఉదయము అందమైన నీ నుదుటి కాంతితో విరిగిపోతుందమ్మా! తలచుకుంటే చాలు ఒళ్ళు పులకరించిపోతుంది. లోకాని కంతటికీ క్షమాగుణంతో క్షేమాన్ని కలిగించడానికి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను పూయగా తళుక్కుమనే నీ నుదుటి భాగం సరికొత్త కాంతితో మెరిసిపోతుందమ్మా! నల్లటి దట్టమైన నిండైన నీ కొప్పు ఆకాశంలాగా ఉంటే నుదుటిఅద్దంపై అలా అలా నెమ్మదిగా కదలాడే నీలిముంగురులు చిరు మేఘాలలాగా ఊగిసలాడుతున్నాయి.

కం. అలయక భజింతు లలితాం 
బ లసద్విలసిత కదంబ ప్రాంచద్భూషాం 
చల నికురంబ కరంబుల 
మలంపులల రత్నకుంభ కాంతిచ్ఛటలన్ ...6
భావము.
అమ్మా లలితాంబికా! కోరిన కోరికలు తీర్చే కదంబకల్పవృక్షం లాంటి నీ అందమైన రత్నాభరణాలుగల చేతులలో ధరించిన ఆపాత్ర ఏమిటమ్మా? ఓహో ! అది మా కొరకు అందిస్తున్న దయామృత రత్న భాండమే కదా! దాన్ని మాపై ఒడుపుగా ఒలికిస్తున్నప్పుడు గలగలమని వినిపించే మణి మాణిక్యాలు పొదిగిన నీ గాజుల చప్పుడు దివ్యకాంతి రేఖలను కూడా మాపై ప్రసరింపజేస్తుంది. ఇంతటి దయామయివైన నిన్ను అలుపన్నది లేకుండా కొలుస్తాను.

కం. ఉదయమె దలంతు మణులను 
పొదిగిన హేమాంగుళీయ ప్రోద్యత్ప్రభలం 
దొదవెడు రమణీయామే 
య దయావిర్భూత వాంఛితార్థవిధాత్రిన్...7
భావము.
తల్లీ! ఈ ఉదయం వేళ నిన్ను చూస్తున్న సమయంలో నీ పది చేతుల వేళ్లకు ధరించిన బంగారు ఉంగరాలు, వాటికి పొదిగిన రత్నాలు అంతులేని ఆనందాన్ని కలిగిస్తున్నాయమ్మా! నీ చేతి వ్రేళ్ళకున్న ఉంగరాలలోని రత్నాల కాంతి సామాన్యమైనదా! అది కాంతి కాదేమో మా కోరిన కోరికలన్నీ తీర్చడానికి దయామయివైన నీ హృదయంలో ఉప్పొంగిన ప్రేమనంతా ఇలా మాపై కురిపించడానికి నీ చల్లని చేతులలో అంతటి వెలుగులు దాచుకున్నవేమో!
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోకంలో శ్రీ మన్నారాయణమూర్తి అవతరించిన పది అవతారాలు కూడా నీ పది వేళ్ళ నుంచి వచ్చినవే కదా !

కం. ఉదయమె భజింతు జననిని 
హృదయానందకర లీల నీశ్వర ప్రేమా 
స్పద విభవాఢ్య సుహాసిని 
రదనాచ్ఛ రుచిర విభాస రాగాహ్లాదిన్...8
భావము.
జననీ! నిన్ను తలచుకుంటే చాలు. ఈ ఉదయము మా హృదయాలను రాగరంజితం చేసే నీ అనురాగం లాగా ఉంది. పరమేశ్వరుని ప్రేమకు నిలయమైన ఆనందదాయనివి నీవు. నీ సుందర దరహాసంలో ఈశ్వరుని ప్రేమ ఉంది. అది నీ చిరునవ్వురూపంలో ఈ లోకానికి చాటుతున్నావు. స్వచ్ఛంగా మనోజ్ఞంగా నవ్వుతున్నప్పుడు తెల్లనైన నీ పలువరస నుండి వెలువడే అందమైన కాంతులు ఈ ఉదయరాగంలో ప్రతిబింబించి మా మనసును ఆనంద డోలికలలలో ఓలలాడిస్తుందమ్మా!

కం. లలితాంబిక ప్రాభవముల 
తొలిపొడుపులగని నుతింతు తోషమునిండన్ 
ఖల తామసము హరించెడు 
విలయాభీల వికరాళి విజయన్కాళిన్...9
భావము.
తల్లీ! ఈ తొలిపొద్దుపొడుపులలో నిన్ను ఎంతగా పొగిడితే అంతగా నా మనసు ఆనందంతో ఊగిపోతుంది. నీవే దేవివి కనుక ఈ దివ్యత్వం అంతా నీ కరుణే కదా! తల్లిగా లాలిత్యాన్ని చూపుతావు. దుష్టులపాలిటి కాళికవౌతావు.
అజ్ఞానమనే అంధకారాన్ని తనుమాడడానికి అవతరించిన ప్రళయకాలభీకర వికరాళివి, విజయాలకు కారణభూతమైన విజయ దుర్గవు నీవే! చిమ్మ చీకట్లను చీల్చిచెండాడి వెలుగుల వివేకాన్నిపంచి పెట్టే నీకు నమస్సులు.

కం. తలతు నుదయ సంధ్యారుణ 
తిలకంబును భ్రుకుటి మధ్య దీర్చిన తీరున్ 
ఛలధూర్వహ తిమిరాపహ 
కలభాస్వంత ముఖబింబ గౌరవదీప్తిన్...10
భావము.
జగన్మాతా! ఈఉదయ సంధ్యా సమయంలో నెమ్మది నెమ్మదిగా తిమిరాలను చీల్చివేస్తూ అరుణారుణ కాంతులు వెల్లడౌతున్నాయి. ఉదయభాను బింబం నీ నుదుటి నడుమతీర్చిదిద్దిన కుంకుమ విలేపనంలాగా తోస్తుంది. నీముఖబింబానికి మరింత శోభను గౌరవాన్ని కలిగించే ఉదయరవిబింబాన్ని తలచుకోగానే మాలోలోపలి చీకట్లన్నీ పారిపోతున్నాయి.

కం. తలచెద నుదయ కుహూరత 
కిలకిల సుస్వన పతంగ గీర్వాణోక్తుల్ 
పలికిన పలుకులు జననికి 
పులకలు గలిగించు మేలు పొద్దులుగాగన్...11
భావము.
అమ్మా! ఈ ఉదయాన్ని తలచుకుంటే ఎంత మనోజ్ఞంగా ఉందోచూడు. మాకన్నా ముందుగానే నిద్దుర లేచిన పక్షులన్నీ కిలకిలమని కుహూ కుహ రావాలు చేస్తున్నాయి. బహుశా పక్షులన్నీ మధురాతి మధురంగా వాటి భాషలో ఈ అందమైన ఉదయవేళ నీకు శుభాకాంక్షలు చెప్తున్నాయేమో! అందుకేనేమో నీకీ గగుర్పాటు కలుగుతుంది కదా!

కం. తలచెద ప్రభాత వేళల 
తలవాకిట వేచియుండు దనుజారి గమిన్ 
తలమోపగ తల్లియెదుట 
నిలువంబడు వే నిలింప నికరము నిపుడున్... 12
భావము.
జగదానందకారిణివైన జనయిత్రీ! తెల్లవారుజామున గుమ్మం ముందు నీ దర్శనానికై దేవతలందరూ వేచిఉన్నారు. ఎప్పుడెప్పుడు నీ దర్శనం అవుతుందా అని ఎదురుచూస్తూ కనపడగానే నీ పాదాలపై తలలుంచి నమస్కరించాలని ఆరాటంతో వేగిరపడుతున్న ఈ దేవత సమూహాన్ని కనికరించడానికి త్వరగా నిద్రలేచి రావమ్మా! అని తలచుకుంటున్నాను.

కం. తలచెద బలరిపు గణముల 
మిలమిలమెరిసెడు కిరీట మేదుర కాంతుల్ 
గల లలిత రత్న నూపుర 
ఝలంఝల విలాస కాంతి సదమల శోభన్... 13
భావము.
మాతా! నీ ఉదయకాల దర్శనం కోసం కొలువుదీరిన ఇంద్రాది దేవతలందరి అదృష్టం పండింది. అద్భుతమైన దివ్యమైన నీదర్శనభాగ్యం వారికి లభించింది. అమ్మా! ఇంద్రుడు మొదలైన దేవతలందరు నీకు పాద నమస్కారాలు చేసేవేళ వారి కిరీటాలలో పొదిగిన మణులకాంతుల ధగధగలతో నీ పాదాల మువ్వల రత్నాలకాంతులు జతపడి మరింతగా వెలుగులీనుతున్నాయి. స్వచ్ఛమైన నీపాదమంజీరాల చిరుసవ్వడులుతెచ్చే కాంతి ప్రసారంతో ఈ ఉదయ దర్శనం సరికొత్తగా భాసిస్తుంది.

కం. శ్రీ లాస్యంబుగ దలచెద 
లాలిత కుసుమమలయానిలమ్ముల జల్లున్ 
దూలిన పరీమళములకు 
శ్రీలలితాసతి మురిసెడు స్మితవదనంబున్...14
భావము.
అమ్మా! నీవు నిద్ర లేచే సమయం అయిందని ఎలా తెలిసిందో ఏమో ఈ
ప్రకృతి కూడా పులకరించిపోతుంది. విలాసంగా పూల చెట్లన్నీ అందాల
పూల జల్లులు కురిపిస్తున్నాయి. పూల జల్లులు కురుస్తూ ఉన్న ఉదయం
పూట మలయ పర్వతం నుంచి వచ్చే చల్లనిగాలి ఆ పూల పరిమాణాలను
మోసుకుని వస్తూ ఉంటే అమ్మా! అది అందమైన నీ విలాస లాస్యంలాగా
మాకు తోస్తుంది. ఈ పూల జల్లులకు, ఈ మలయానిల సౌరభాలకు
మురిసిపోతూ చిరునవ్వులు చిందించే నీ సుందర ముఖబింబాన్ని
దర్శించడమే మా భాగ్యంకదా!

కం. ప్రాభాత వేళ దలచెద 
సౌభాగ్యము గూర్ప భూరి సాష్టాంగవిధిన్ 
శ్రీ భక్త సౌఖ శాయని 
కాభీష్ట ప్రణతుల మురియు హ్లాదమ్మునకున్...15
భావము.
ఓ శ్రీ మాతా! ప్రతి సుప్రభాత సమయంలో నిన్ను తలిచి పొంగిపోతున్నానమ్మా! నీ భక్తులు పొద్దుపొద్దుననే నిన్ను నిద్దుర లేపి కుశలమడిగి, చేస్తున్న సాష్టాంగ నమస్కారాలకు నీవెంతో మురిసిపోతున్నావమ్మా! నమస్కరించినంత మాత్రాన వారి మదిలోని కోరికలను గ్రహించి సంతోషంతో సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తున్నావు కదమ్మా!

కం. నిత్యోదయ దర్శనముల 
నత్యంత సుఖద కవోష్ణ హార్ధస్పర్శా 
దిత్య కరమ్ముల వెలిగెడు 
సత్యానుభవమ్ము జనని సాంగత్యముగన్..16
భావము.
ఓ జనయిత్రీ ! ప్రతి నిత్యము నిన్ను దర్శించడానికి వచ్చిన సమయంలో, అప్పుడే ఉదయించిన లేలేత సూర్యుని కిరణాల గోరువెచ్చని వేడి, ఆ వేడితో పాటు వచ్చేవెలుగు మాకు వెచ్చగా తగలడం వల్ల అమ్మా! నీఒడిలొ పడుకున్న మా చిన్నప్పటి ఆనంద స్పర్షా సుఖాన్ని అనుభవిస్తున్నాను. నిజమైన నీ ప్రణయాన్ని ఇలా సూర్య కిరణాల రూపంలో అందిస్తూ లాలిస్తున్నావు కదా!

కం. ఉదయశ్రీరాగమధుర 
మృదులోహల సద్ద్విజాళి మేల్భజనంబుల్ 
సదయామయి తల్లికిడెడు 
హృదయాంజలి సుప్రభాత మిదియని దలతున్... 17
భావము.
అమ్మా! దయామయీ!! ప్రతి ఉదయం నిన్ను మేల్కొల్పే సమయంలో వేద పండితులు సుసంస్కృత శబ్దాలతో, శ్లోకాలలో మృదు మధురంగా సుప్రభాతగీతాలు ఆలపిస్తారు. సద్విజులు చేసే ఆ అమృత గానం ఎంత గొప్పదో అప్పుడప్పుడే నిద్రలేచి రెక్కల నల్లారుస్తూ పక్షులు ( ద్విజులు) చేసే ఈ కిలకిలా రావాలు కూడా ఉదయశ్రీ రాగంలో నిన్ను కీర్తిస్తున్న మేలి మేలుకొలుపు లాగానే అనిపిస్తుందమ్మా నాకు.

కం. కన్మూసి తెరిచినంతనె 
తన్మూలమగుజగతి గతి తడబడురీతిన్ 
మన్మనమునదలచెద నా 
యున్మేషనిమిష విపన్న ప్రోద్యద్ధాత్రిన్..18
భావము.
అమ్మా! నీవు కన్ను తెరిస్తే సకలచరాచర సృష్టికి జననం. నీ కనుల వెలుగుసోకితే జీవచైతన్యం. నీవు కన్నుమూస్తే విలయం. ఒక్కసారి నీవు కన్ను మూసి తెరిచినంతలో(రెప్పపాటులో) ఈ జగత్తంతా చావు పుట్టుకల సయ్యాటగా మారిపోతుంది. సృష్టి, స్థితి, లయకారకు రాలివయిన నీవే కదా ఈ జగతికి ఆధారం. అందుకనే మదిలో నీ స్మరణతోనే ప్రతి ఉదయాన్ని ప్రారంభిస్తాను.

కం. పతి విసమున్ ద్రావగ స 
మ్మతినిడు సౌభాగ్య సర్వమంగళ నిచ్ఛా 
మతిదలతును ప్రత్యుదయము 
శ్రుతిసీమంతిని నపర్ణ శుభకామేశిన్... 19
భావము.
జగన్మాతా! క్షీరసాగర మధన సమయంలో పాలసముద్రాన్ని చిలుకుతున్న సమయంలో పుట్టిన విషాన్ని త్రాగడానికి నీ భర్త అయిన పరమేశ్వరునికే అనుమతినిచ్చిన గొప్ప ఇల్లాలివి కదా! నీ మంగళ సూత్రాల పైన నీకున్న నమ్మకం అలాంటిది. తల్లులందరి మంగళసూత్రాలను కాపాడే సర్వమంగళ స్వరూపిణివి నీవే కదా! వేదాలే తలపై దాల్చిన సౌభాగ్యకర సిందూర రూపమైన అపర్ణా సతివి నీవు. కామేశ్వరునికి ప్రాణ సఖివి కనుకనే అన్ని సౌభాగ్యాలకు నిలయవైనావు. నిన్ను తలచుకున్న ప్రతి ఉదయమూ నాకు శుభోదయమే.

కం. ప్రాతర్వేళల వినెదను 
మాతృశ్రీ విభవ వేదమంత్రోచ్చరణో 
పేత శుచీభూత ఘన 
శ్రౌతస్మృతి విధి పఠించు సామనిగమమున్...20
భావము.
తల్లీ! తెల్లవారిపోతుంది. ఉదయకాల స్నానసంధ్యావందనాదులు నిర్వర్తించుకొని వేదవిదులైన వారు శ్రీ సూక్త అరుణసూక్తాది పారాయణలతో నీ గుణ వైభవాలను మంత్రముగ్ధ గానంగా ఆలపిస్తుంటే, వారు పఠిస్తున్న సుస్వర సామగానం, ఆ వేదనాదం మనసులను పవిత్రం చేస్తుందమ్మా! వింటున్న మేమెంత మురిసిపోతున్నామో నీకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది కదమ్మా!

కం. వేదనతొలగగ గొలిచెద 
సాదరి మా! సరిగ సాగ సామసుదీప్తిన్ 
వేదమయిన్ నాదాత్మగ 
పాదసరిగ రిగమ దద పపాయని శ్రుతులన్...21
భావము.
హేమాతా! సంగీత సాహిత్య సమలంకృతివి నీవు. వేదమయివి, నాదమయివీ నీవేకదా! వినగానే ఆనంద డోలికలలో విహరింపజేసే సంగీతానికి ఉన్న లయాత్మకత మా వేదనలన్నీ తొలగిస్తుందమ్మా! మా నిర్వేదాన్ని పారద్రోలే వేదాన్ని "సాగరి మా సరిగా సాగా పాదసరిగా రిగమా దాదా పపా " అని సప్త స్వరాల ఆరోహణ అవరోహణలతో అందిస్తున్న సామగానం నీవు కూడా చెవులకింపుగా వింటున్నావు కదా!

కం. వెలుగై నొకపరి చెలగుచు 
తలపై నొకపరి నితాంత తామస హరమై  
పలుకైవెలువడి వైఖరి 
పలుతీరులగాంతు జనని వాగ్వైభవమున్...22
భావము.
అమ్మా! సృష్టిలో ఏ ప్రాణికోటికి ఇవ్వని వాక్కును మాకు ప్రసాదించావు. నీవు ఇచ్చిన ఈ వాక్కుతోనే అనేక తీరులుగా నిన్నే స్తుతించగల అదృష్టాన్ని నాకు ప్రసాదించావు.
చైతన్య రూపమైన ప్రకాశానివై నాలోనే ఉంటూ చీకట్లను పారద్రోలుతావు. ఒక్కొక్కసారి పరా రూపంలో హృదయంలో కుదురుకున్న వాక్కువై పశ్యంతిగామారి మధ్యమగా నాలుకపై చేరి వైఖరీ రూపమైన మాటగా లోకానికి నిన్ను అందించే శక్తిని ప్రసాదిస్తావు. ఈజన్మకు ఇంకేం కావాలమ్మా!

కం. వెలుగుల వెల్లువ లలలై 
మిలమిల ప్రాచీ దిశగను మేల్మురిపెపు ద్రో 
వల శ్రీ లావణ్యంబై 
చెలగిన మృదుభావనము వచింతును సతమున్..23
భావము.
అమ్మా! తూరుపు తెల్లబారుతుంది. క్రమక్రమంగా వెలుగుల ప్రవాహం అలలు అలలుగా లోకమంతా విస్తరిస్తుంది. వెలుగులన్నీ తూర్పు దిక్కునుంచి ముద్దు మురిపెంగా ప్రయాణం చేస్తూ శోభస్కరమైన అందాలతో కనువిందు చేస్తున్న వైనాన్ని మృదుమధురమైన భావనలతో ఇలాగే ప్రతి ఉదయాన వర్ణిస్తూనే ఉంటానమ్మా!

కం. హృదయ మపర్ణాలయముగ 
నొదవిన ప్రతిపద్యమామె యూపిరి కాగా 
సదయామయి నర్చింతును 
మృదుకచ్ఛపి నాదమట్లు మేలిమి జతితోన్...24
భావము.
అమ్మా! ఎంతటి దయగల తల్లి వమ్మానీవు! శివుని యెదలో నీవు కొలువై ఉన్నట్లే నా హృదయంలోనూ అపర్ణాదేవివై నిండుగా నీవై ఉన్నావు. నాలో పురుడు పోసుకున్న ప్రతిపద్యానికీ నీవే ఊపిరులూదుతున్నావు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో నీవు మ్రోగించే కచ్చిపి నాదమే శ్రుతి చేసుకుని వుంటుంది. ఇలాగే ఉండమని నిన్ను ఎల్లప్పుడూ కొలుస్తుంటాను.

కం. ప్రాతస్సంధ్యా సమయ 
జ్యోతిర్మండల ప్రదీప్త శోభామయమౌ 
శ్రీతను కాంతిని శాంతిని 
చేతన ముప్పొంగ గొలుతు క్షేమంకరినిన్... 25
భావము.
అమ్మా! లోకాల కన్నిటికీ క్షేమాన్ని సమకూర్చే తల్లివి నీవే కదా! ఉదయసంధ్యా సమయంలో ఆకాశమండలంలో వెలిగే నక్షత్రాలన్నీ నీ శరీరకాంతిని లోకానికి అందిస్తూ శాంతిని ప్రసాదిస్తున్నాయి. కాంతికీ, లోక శాంతకీ ఆధారానివి నీవే! ఇంతటి దయగల నిన్ను నా మనసు పొంగిపోయే విధంగా పదేపదే కొలుస్తుంటానమ్మా!

కం. తేజస్స్వాంత విధాత్రికి 
నైజాప్తత నొసగినట్టి నయవినయములే 
నాజన్మకు సాఫల్యత 
పూజాపుష్పంబునగుదు పుణ్యోన్నతిచే. ..26
భావము.
అమ్మా! అంతులేని ప్రకాశాన్ని నా హృదయం నిండా నింపినటువంటి నీదైన ఆత్మీయతకు ఎంతో ఎంతో మురిసిపోతున్నానమ్మా ! నాకు నిన్ను ఎంతోకొంత వర్ణించగల నేర్పరితనాన్ని ఇచ్చావు. అందుకు తగిన వినయాన్నీ ప్రసాదించావు. ఇంకేం కావాలి? ఇంతకంటే నా జన్మకు సఫలత మరొకటి ఉంటుందా? అందుకే ఈ పద్యాలరూపంలో నా పూర్వజన్మ పుణ్యంతో నీ పూజకు పుష్పాన్నై పరీమళిస్తాను.

కం. శ్రీ దాక్షాయని రక్షగ 
భేదమ్ముల బోనడంచి కృపగనువేళన్ 
హ్లాదమ్మెల్లడల విరియ 
గా దల్లికి నొనరనిడుదు కార్తజ్ఞ్యంబుల్...27
భావము.
అమ్మా! నీ పేరే దాక్షాయిని. నీకంటే దయామయమైన తల్లి ఇంకెవరుంటారు?నీదయ కురిస్తేచాలు మాబాధలన్నీ పటాపంచలైపోతాయి. హృదయం ఆనందం తాండవ చేస్తుంది. ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన నీకు ఎన్నైనా కృతజ్ఞతలు చెప్పుకుని నా ఋణం కొంతైనా తీర్చుకుంటాను.
***
ఇంత చక్కగా ఉదయశ్రీ లలితాతారావళి
రచించిన దత్త సహోదరులకు,
మనోహర సంగీతనును అందించిన శ్రీనివాసులకు, 
చక్కగా ఆలపించిన సరస్వతీ రామశర్నకు అభినందనలు.
జైహింద్.



జైహింద్.

 

సౌందర్య లహరి 96 - 100 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం ... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

20, నవంబర్ 2024, బుధవారం

సౌందర్య లహరి 91- 95 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు, సంగీతం, గానం ... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

19, నవంబర్ 2024, మంగళవారం

దర్శనమ్‌ ‌ద్విదశాబ్ది మహోత్సవం| శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి గురు వందనమ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

క్షుధాం దేహవ్యథాం త్యక్త్వా, ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  క్షుధాం దేహవ్యథాం త్యక్త్వా బాలః క్రీడతి వస్తుని । 

తథైవ విద్వాన్ రమతే నిర్మమో నిరహం సుఖీ ॥ 

(వివేకచూడామణి537)

తే.గీ.  ఆకలిని దేహబాధల నతఁడు మరచి

యాడుకొను బాలుఁడెట్టులో యటులె పండి

తుండు మమకారమహము తా తుడిచివైచి

ధ్యానమగ్నుఁడై యానంద మానసుఁడగు.                                                      

భావము.  ఆకలి దప్పుల్ని దేహ బాధను వదలి బాలుడు ఆటపాటల్లో ఎలా 

నిమగ్నమై ఉంటాడో, అలానే తత్త్వవేత్త దేహేంద్రియ మనోబుద్ధి 

చిత్తాహంకారాలను నేననే  భ్రాంతిని వీడి,నిత్య నిరతిశయానంద నిష్ఠలో 

నిమగ్నమై ఉంటాడు.

జైహింద్.

సౌందర్య లహరి 86 - 90 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు, సంగీతం గాంఉ ... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

18, నవంబర్ 2024, సోమవారం

శకటరేఫ యుక్త పదముల, సాధురేఫ యుక్త పదముల, మరియు అర్థానుస్వారపూర్వక వర్ణయుక్తపదముల, అర్థానుస్వారవర్ణ రహిత పదముల అర్థములు వేరువేరుగా ఉండునవగుటచే మనము వాటిని గ్రహింపవలసి యున్నది. గమనింపుడు.

0 comments

జైశ్రీరామ్.

శకటరేఫ యుక్త పదముల, సాధురేఫ యుక్త పదముల, మరియు 

అర్థానుస్వారపూర్వక వర్ణయుక్తపదముల, అర్థానుస్వారవర్ణ రహిత పదముల 

అర్థములు వేరువేరుగా ఉండునవగుటచే మనము వాటిని గ్రహింపవలసి

యున్నది. గమనింపుడు. 

కరి = ఏనుగు

కఱి = నల్లని

కారు = ఋతువు, కాలము

కాఱు = కారుట (స్రవించు)

తరి = తరుచు

తఱి = తఱచు

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం (ఖండించటం)

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి (తీరింది)

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

అఱుగు = జీర్ణించు

అరుగు = వెళ్ళు, పోవు

అరుఁగు = వీధి అరుగుకాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగా గల

వాడి = ఉపయోగించి

మడుఁగు = వంగు, అడఁగు

మడుగు =  కొలను, హ్రదము

ఈ విధముగా ఎన్నో ఉన్నాయి.

జైహింద్.

సౌందర్య లహరి 81- 85 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం... శ్రీమతి వల్లూరి సరస్వతి.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

17, నవంబర్ 2024, ఆదివారం

యశస్వినీ సాహితీ సమితి ll పద్యకోకిల, అష్టావధాని డాక్టర్ బోచ్కర్ ఓమ్ప్రకాశ...గ్రంథత్రయావిష్కరణ, నాకు, శ్రీమతి వేదాల గాయత్రి గారికి సాహితీ పురస్కారము.

0 comments

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

డా. బోచ్కర్ ఓం ప్రకాశ్ గారికి గ్రంథత్రయావిష్కరణ సందర్భముగా అభినందనలు.
🌹🍇🍑🤝🏼👍🏻

శా. శ్రీమన్మంగళ సత్ సభాసదులకున్ శ్రీ యోంప్రకాశ జ్ఞానికిన్,
శ్రీమద్వేదిక నున్న పూజ్యులకు, వాసిన్ వెల్గు మిత్రాళికిన్,
బ్రేమానంద మహత్వ మూర్తులకు, భావిన్ బ్రోచు పూజ్యాళికిన్,
శ్రీమచ్ఛాంభవి దీవనల్ కలుగుతన్, శ్రీభారతీ సత్కృపన్.

శా.  శ్రీమన్మంగళ బోచ్కరాన్వయ! సుధీ! శ్రీ యోంప్రకాశా! శుభం
బో మాన్యా! వరలంగ లోకమున దివ్యోద్భాస గ్రంథత్రయం
బీ మాన్యాళి సమక్షమందు సభలో నిప్పట్టు నావిశ్కృతిన్
బ్రేమన్ జేయఁగఁ జేసె భారతి, భళీ! విజ్ఞుల్ మిమున్ మెచ్చగన్.

సీ.  ఆనందభరిత నిత్యానందరావుగా 
రతిథిగా సభలోన నలరినారు,

కమనీయ సాహిత్య కమలాకరంబైన 
సాగివంశజ శర్మ సభను వెలిగె,

ప్రఖ్యాత రమణీయ పద్యప్రకాశాత్మ 
శ్రీరమణాచారి చెలగిరిచట,

మామిడి హరికృష్ణ మహిత సాంస్కృతిక సం 
చాలకు లిచ్చోటు సదయనిచ్చె,

తే.గీ.  దర్శనానంద హైందవ ధర్మమూర్తు
లెందరెందరో యీ సభ యందు  కలరు,
శ్రీ ఫణీంద్రుఁడున్, మహితులున్ జిత్తమలర
నిలిచి రావిష్కరణమున నిండుగాను.

సీ.  జయ మార్గమున శ్రీయశశ్వినీ సత్కృతిన్ 
మంచినీళుల రమామణి వచించె,

సభను నానారాజ సందర్శనానుశీ
లనను సాయి వచించె ఘనతరముగ,

ప్రఖ్యాత రమణీయ ప్రద్యప్రకాశ సద్ 
వ్యాఖ్యను రాజేంద్ర ఖ్యాతిఁ దెలిపె,

మహితమైన సభాస మన్వయ సద్వ్యాఖ్య 
స్వాతిప్రసాదంబు వరలఁ జేసె,

తే.గీ.  యిట్టి మహనీయ సభలోన నిచ్ఛతోడ
నన్ను, గాయత్రిగారిని, సన్నుతముగ
నుత పురస్కృతులను జేసి క్షితిని మాకు
ఘనత పెంచిరో బోచ్కర్ సుకవివరేణ్య!

ఉ.  మంగళమౌత బోచ్కరుని మంజుల గ్రంథ సురత్న పాళికిన్,
మంగళ మోంప్రకాశునకు, మంగళ మీ సభనున్నవారికి,
మంగళమౌత గ్రంథములు మంచిగ నెంచి పఠించువారికిన్,
మంగళమౌత శాంభవికి, మంగళముల్ మన భారతాంబకున్.

స్వస్తి.
అమ్మ దయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.


జైహింద్.

సౌందర్య లహరి 76-80 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

16, నవంబర్ 2024, శనివారం

శివనామ ,భవాంబోధి,నివహము,ప్రదోష,ఆర్తి హర,హరియించు,ఆహ్లాద,బోధామృతం, సత్యతా,శ్రవణోపేయ,చిదానంద,నిదానతా,సదామోద,ఛిద్రంబేర్చు,గర్భ"సద్రామ,"వృత్తము. రచన శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

0 comments

జైశ్రీరామ్.

 శివ నీనామ మహాత్మ్యమే!చిదానంద బోధామృతమ్!చిద్రూపా!సంపత్కరా!హరా!

భవ దంబోధి తరింపగున్!ప్ర దోషార్తి హర్యం బగున్!భద్రాత్మా! నిత్యంబు సత్యమై!
నివహంబు ల్శుభ శోభలన్!నిదానంబు చేకూర్పగన్!నిద్రం ఛిద్రంబేర్చు స్తుత్యమై!
శ్రవణోపేయమై చనున్!సదామోద మోదంబునౌ!సద్రామంబై నిల్పు లోకమున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

సత్+రమంబై=సద్రమంబై,  సత్ యనే శ్రీరమా దేవియై

1,గర్భగత"శివనామ"వృత్తము,

శివ నీనామ మహాత్మ్యమే!
భవాంబోధి తరింపగున్!
నివ హంబుల్శుభ శోభలన్!
శ్రవణోపేయమై!చనునున్! 

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి ఛందము లోనిది,
ఫ్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"భవాంబోధి"వృత్తము,

చిదానంద బోధామృతమ్!
ఫ్రదోషార్తి హర్యంబగున్!
నిదానంబు చేకూర్పగన్!
సదామోద మోదంబునౌ!!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము నందలిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3"గర్భగత"నివహము"వృత్తము,

చిద్రూపా!సంపత్కరా!హరా!
భద్రాత్మా! నిత్యంబు సత్యమై!
నిద్రం ఛిద్రంబేర్చు స్తుత్యమై!
సద్రమంబై నిల్పు లోకమున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము గలదు,పాదమునకు9,అక్షరము లుండును,

4,గర్భగత"ప్ర దోష"వృత్తము,

శివ నీ నామ మహాత్మ్యమే!చిదానంద బోధామృతమ్!
భవ దంబోధి తరింపగున్!ప్ర దోషార్తి హర్యం బగున్!
నివహంబుల్శుభ శోభలన్!నిదానంబు చేకూర్పగన్!
శ్రనణోపీయమై!చనున్!సదామోద మోదంబునౌ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,

5,గర్భగత"ఆర్తి హర"వృత్తము,

చిదానంద బోధామృతమ్!శివ నీ నామ మహాత్మ్యమే!
ప్రదోషార్తి హర్యం బగున్!భవ దంబోధి తరింపగున్!
నిదానంబు చేకూర్పగన్!నివ హంబుల్శుభ శోభలన్!
సదామోద మోదంబునౌ! శ్రవణోపేయమై చనున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17,అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

6,గర్భగత"హరియించు"వృత్తము,

శివ నీ నామ మహాత్మ్యమే!చిద్రూపా!సంపత్కరా!హరా!
భవ దంబోధి తరింపగున్!భద్రాత్మా! నిత్యంబు సత్యమై!
నివ హంబుల్శుభ శోభలన్!నిద్రం ఛిద్రంబేర్చు స్తుత్యమై!
శ్రవణోపేయమై చనున్!స ద్రమంబై నిల్పు లోకమున్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"అక్షరమునకు చెల్లును,

7,గర్భగత"ఆహ్లాద"వృత్తము,

చిద్రూపా!సంపత్కరా!హరా!శివ నీ నామ మహాత్మ్యమే!
భద్రాత్మా! నిత్యంబు సత్యమై!భవ దంబోధి తరింపగున్!
నిద్రం ఛిద్రం బేర్చు స్తుత్యమై!నివహంబుల్శుభ శోభలన్!
స ద్రమంబై నిల్పు లోకమున్!శ్రవణోపేయమై చనున్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-బోధామృత"వృత్తము,

చిదానంద బోధామృతమ్!చిద్రూపా!సంపత్కరా!హరా!
ప్రదోషార్తి హర్యం బగున్!భద్రాత్మా! నిత్యంబు సత్యమై!
నిదానంబు చేకూర్పగన్!నిద్రం ఛిద్రం బేర్చు స్తుత్యమై!
సదామోద మోదంబునౌ!స ద్రమంబై నిల్పు లోకమున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"సత్యతా"వృత్తము,

చిద్రూపా!సంపత్కరా!హరా!చిదానంద బోధామృతమ్!
భద్రాత్మా!నిత్యంబు సత్యమై!ప్రదోషార్తి హర్యంబగున్!
నిద్రం ఛిద్రం బేర్చు స్తుత్యమై!నిదానంబు చేకూర్పగన్!
సద్రమంబై నిల్పు లోకమున్!సదామోద మోదంబునౌ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"శ్రవణోపేయ"వృత్తము,

చిదానంద బోధామృతమ్!శివ నీ నామ మహాత్మ్యమే!చిద్రూపా!సంపత్కరా!హరా!
ప్రదోషార్తి హర్యంబగున్!భవ దంబోధి తరింపగున్!భద్రాత్మా!నిత్యంబు సత్యమై! !
నిదానంబు చేకూర్పగన్!నివహంబుల్శుభ శోభలన్!నిద్రం ఛిద్రం బేర్చు!స్తుత్యమై!
సదామోద మోదంబు నౌ!శ్రవణో పేయమై చనున్!సద్రమంబై నిల్పు లోకమున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరములుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"చిదానంద"వృత్తము,

శివ నీ నామ మహాత్మ్యమే!చిద్రూపా!సంపత్కరా!హరా!చిదానంద బోధామృతమ్!
భవ దంబోధి తరింపగున్!భద్రాత్మా!నిత్యంబు!సత్యమై!ప్ర దోషార్తి హర్యం బగున్!
నివ హంబుల్శుభ శోభలన్!నిద్రం ఛిద్రం బేర్చు స్తుత్యమై!నిదానంబు చేకూర్పగన్!
శ్రవణోపేయమై చనున్!స ద్రమంబై!నిల్పు లోకమున్!సదామోద మోదంబునౌ!

అనిరుద్ఛందమందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10',19,అక్షరములకు చెల్లును,

12,గర్భగత"నిదానతా"వృత్తము,

చిద్రూపా!సంపత్కరా!హరా!శివ నీ నామ మహాత్మ్యమే!చిదానంద బోధామృతమ్!
భద్రాత్మా!నిత్యంబు!సత్యమై!భవ దంబోధి తరింపగున్!ప్ర దోషార్తి హర్యం బగున్!
నిద్రం ఛిద్రం బేర్చు స్తుత్యమై!నివ హంబుల్శుభ శోభలన్!నిదానంబు చేకూర్పగన్!
సద్రమంబై!నిల్పు లోకమున్!శ్రవణో పేయంబునౌ గదే!సదా మోద మోదంబు నౌ!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"సదామోద"వృత్తము,

చిదానంద బోధామృతమ్!చిద్రూపా!సంపత్కరా!హరా!శివ నీ నామ మహాత్మ్యమే!
ప్ర దోషార్తి హర్యం బగున్!భద్రాత్మా!నిత్యంబు!సత్యమై!భవ దంబోధి తరింపగున్!
నిదానంబు చేకూర్పగన్!నిద్రం ఛిద్రం బేర్చు స్తుత్యమై!నివ హంబుల్శుభ శోభలన్!
సదా మెద మోదంబు నౌ!స ద్రమంబై!నిల్పు లోకమున్!శ్రవణో పేయంబు నౌ!గదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"ఛిద్రం బేర్చు"వృత్తము,

చిద్రూపా!సంపత్కరా!హరా!చిదానంద బోధామృతమ్!శివ నీ నామ మహాత్మ్యమే!
భద్రాత్మా!నిత్యంబు!సత్యమై!ప్రదోషార్తి హర్యం బగున్!భవ దంబోధి తరింపగున్!
నిద్రం ఛిద్రం బేర్చు స్తుత్యమై!నిదానంబు చేకూర్పగన్!నివ హంబుల్శుభ శోభలన్!
స ద్రమంబై!నిల్పు లోకమున్!సదామోద మోదంబు నౌ!శ్రవణో పేయంబు నౌ గదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26,అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును, 
జైహింద్.

సౌందర్య లహరి 71-75పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

న హ్యస్త్యవిద్యా మనసోఽతిరిక్తా. ... మేలిమిబంగారం మన సమ్స్కృతి.

0 comments

జైశ్రీరామ్.

 శ్లో.  న హ్యస్త్యవిద్యా మనసోతిరిక్తా  - మనో హ్యవిద్యా భవబన్ధహేతుః ।

తస్మిన్వినష్టే సకలం వినష్టం  - విజృమ్భితేయస్మిన్సకలం విజృమ్భతే ।।

(వివేకచూడామణి 169)

తే.గీ.  వెలుపల మదికి నెన్న నవిద్య లేదు,

మనసవిద్య, బంధముల్ మనకుఁగొలుపు,

నది నశించిన నశియించు నన్నియుఁ గన

నది విజృంభింప రేకెత్తునన్నియు, హరి!

భావము.  మనస్సు వెలుపల అజ్ఞానం (అవిద్య) లేదు. మనస్సు ఒక్కటే అవిద్య, 

పరివర్తన బంధానికి కారణం. అది నాశనమైనప్పుడు, మిగతావన్నీ నాశనమవుతాయి, 

మరియు అది వ్యక్తమైనప్పుడు, మిగతావన్నీ వ్యక్తమవుతాయి.

జైహింద్.

15, నవంబర్ 2024, శుక్రవారం

శుక్లయజుర్వేద నమక చమకములు.

0 comments

జైశ్రీరామ్. 

నమకము.

శ్రీగురుభ్యో నమః. హరిః ఓమ్.
ఓం నమో భగవతే రుద్రాయ.
ఓం నమ్.
నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవే నమః |
బాహుభ్యాముత తే నమః ||
యా తే రుద్ర శివా తనూరఘోరాపాపకాశినీ |
తయా నస్తన్వా శంతమయా గిరిశన్తాభి చాకశీహి ||
యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే |
శివాం గిరిత్ర తాం కురు మా హిఁసీః పురుషం జగత్ ||
శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి |
యథా నః సర్వమిజ్జగదయక్ష్మఁ సుమనా అసత్ ||
అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్ |
అహీఁశ్చ సర్వాన్జమ్భయన్త్సర్వాశ్చ యాతుధాన్యో ధరాచీః పరా సువ ||
అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః |
యే చైనఁ రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశో వైషాఁ హేడ ఈమహే ||
అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః |
ఉతైనం గోపా అదృశ్రన్నదృశ్రన్నుదహార్యః స దృష్తో మృడయాతి నః ||
నమో స్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే |
అథో యే అస్య సత్వానో హం తేభ్యో కరం నమః ||
ప్ర ముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్న్యోర్జ్యామ్ |
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప ||
విజ్యం ధనుః కపర్దినో విశల్యో వాణవాఁ ఉత |
అనేశన్నస్య యా ఇషవ ఆభురస్య నిషఙ్గధిః ||
పరి తే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః |
అథో య ఇషుధిస్తవారే అస్మన్ని ధేహి తమ్ ||
యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః |
తయాస్మాన్విశ్వతస్త్వమయక్ష్మయా పరి భుజ ||
అవతత్య ధనుష్ట్వఁ సహస్రాక్ష శతేషుధే |
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ ||
నమస్త ఆయుధాయానాతతాయ ధృష్ణవే |
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే ||
మా నో మహాన్తముత మా నో అర్భకం మా న ఉక్షన్తముత మా న ఉక్షితమ్ |
మా నో వధీః పితరం మోత మాతరం మా నః ప్రియాస్తన్వో రుద్ర రీరిషః ||
మానస్తోకే తనయే మా న ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః |
మానో వీరాన్రుద్ర భామినో వధీర్హవిష్మన్తః సదమిత్త్వా హవామహే ||
నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో 
వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమ: ||
నమః శష్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో నమో
హరీకేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః ||
నమో బభ్లుశాయ వ్యాధినే న్నానాం పతయే నమో నమో 
భవస్య హేత్యై జగతాం పతయే నమ: నమో
నమో రుద్రాయాతతాయినే క్షేత్రాణాం పతయే నమో ||
నమః సూతాయాహన్త్యైవనానాం పతయే నమః ||
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో 
భువన్తయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమ: 
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయేనమో నమో 
ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమః ||
నమః కృత్స్నాయతయా ధావతే సత్వనాం పతయే నమో నమః 
సహమానాయనివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః 
నమ: కకుభాయ నిషఙ్గిణే స్తేనానాంపతయే నమో నమో
నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః ||
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో నమో 
నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమ: 
నమః సృకాయిభ్యో జిఘాఁసద్భ్యో ముష్ణతాం పతయే
నమో నమో సిమద్భ్యో నక్తం చరద్భ్యో వికృన్తానాం పతయే నమః ||

నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో నమ
ఇషుమధ్బ్యో ధన్వాయిభ్యశ్చ వో నమ: 
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వోనమో నమ 
ఆయచ్ఛద్భ్యో స్యద్భ్యశ్చ వో నమః ||
నమో విసృజద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో నమః 
స్వపద్భ్యోజాగ్రద్భ్యశ్చ వో నమ: 
నమః శయానేభ్య ఆసీనేభ్యశ్చ వో నమో నమో
స్తిష్ఠద్భ్యోధావద్భ్యశ్చ వో నమః ||
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో నమో 
శ్వేభ్యో శ్వపతిభ్యశ్చవో నమో నమ: 
నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో నమ
ఉగణాభ్యస్తృఁహతీభ్యశ్చ వో నమః ||
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో 
వ్రాతేభ్యోవ్రాతపతిభ్యశ్చ వో నమ: 
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో నమో
విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః ||
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమో 
రథిభ్యో అరతేభ్యశ్చవో నమో నమః 
నమఃక్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమో 
మహద్భ్యోఅర్భకేభ్యశ్చ వో నమః ||

నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః 
కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో 
నమో నిషాదేభ్యః పుఞ్జిష్టేభ్యశ్చ వో నమో నమః
శ్వనిభ్యో మృగయుభ్యశ్చ వో నమః ||
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమో నమో భవాయ చ రుద్రాయ చ
నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ ||
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనేచ 
నమో గిరిశయాయ చ శిపివిష్టాయ చ నమో మీఢుష్టమాయ చేషుమతే చ ||
నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ 
నమో వృద్ధాయ చ సవృధే చ నమో గ్ర్యాయ చ ప్రథమాయ చ ||
నమ ఆశవే చాజిరాయ చ నమః శీఘ్ర్యాయ చ శీభ్యాయ చ 
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ నమో నాదేయాయ చ ద్వీప్యాయ చ ||

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చాపరజాయ చ 
నమో మధ్యమాయ చాపగల్భాయ చ నమో జఘన్యాయ చ బుధ్న్యాయ చ ||
నమః సోభ్యాయచ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమః
శ్లోక్యాయ చావసాన్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ ||
నమో వన్యాయ చ కక్ష్ణ్యాయ చ నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ 
నమ ఆశుషేణాయ చాశురథాయ చ నమః శూరాయ చావభేదినే చ ||
నమో బిల్మినే చ కవచినే చ నమో వర్మిణే చ వరూథినే చ నమః
శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ ||
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ నమో నిషఙ్గిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ ||

నమః స్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ 
నమః కుల్యాయ చ సరస్యాయ చ నమో నాదేయాయ చ వైశన్తాయ చ ||
నమః కూప్యాయ చావట్యాయ చ నమో వీధ్ర్యాయ చాతప్యాయ చ 
నమో మేఘ్యాయచ విద్యుత్యాయ నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ ||
నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ
నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ ||
నమః శంగవే చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ 
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయసే చ 
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ ||
నమః శమ్భవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ 
నమఃశివాయ చ శివతరాయ చ ||

నమః పార్యాయ చావార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ
నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః శష్ప్యాయ చ పేన్యాయ చ ||
నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమః కిఁశిలాయ చ క్షయణాయ చ 
నమః కపర్దినే చ పులస్తయే చ నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ ||
నమో వ్రజ్యాయ చ గోష్ఠ్యాయ చ నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ 
నమో హృదయ్యాయ చ నివేష్యాయ చ నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ ||
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ నమః పాఁసవ్యాయ చ రజస్యాయ చ 
నమో లోప్యాయ చోలప్యాయ చ నమ ఊర్వ్యాయ చ సూర్వ్యాయ చ ||
నమః పర్ణాయ చ పర్ణశదాయ చ నమ ఉద్గురమాణాయ చాభిఘ్నతే చ 
నమ ఆఖిదతే చ ప్రఖిదతే చ నమ ఇషుకృద్భ్యో ధనుష్కృద్భ్యస్చ వో నమ: 
మో వఃకిరికేభ్యో దేవానాఁ హృదయేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమో విక్షిణత్కేభ్యోనమ ఆనిర్హతేభ్యః ||

ద్రాపే అన్ధసస్పతే దరిద్ర నీలలోహిత |
ఆసాం ప్రజానామేషాం పశూనాం మా భేర్మా రోఙ్మో చ నః కిం చనామమత్ ||
ఇమా రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్ర భరామహే మతీః |
యథా శమసద్ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్ ||
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహా భేషజీ |
శివ రుతస్య భేషజీ తయా నో మృడ జీవసే ||
పరి నో  హేతి రుద్రస్య ర్వృత్యా పరి త్వేషస్య దుర్మతిర్మహీమాతు |
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడ ||
మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ |
పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆ చర పినాకం బిభ్రదా గహి ||
వికిరిద్ర విలోహిత నమస్తే అస్తు భగవః |
యాస్తే సహస్రఁ హేతయో న్యమస్మన్ని వపన్తు తాః ||
సహస్రాణి సహస్రశో బాహ్వోస్తవ హేతయః |
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి ||
అసంఖ్యాతా సహస్రాణి యే రుద్రా అధి భూమ్యామ్ |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
అస్మిన్మహత్యర్ణవే న్తరిక్షే భవా అధి |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
నీలగ్రీవాః శితికణ్ఠా దివఁ రుద్రా ఉపాశ్రితాః |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే వృక్షేషు శష్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే పథాం పథిరక్షిణా ఐలబృదా ఆయుర్యుధః |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే తీర్థాని ప్రచరన్తి సృకాహస్తా నిషఙ్గిణః |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే న్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్ |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
య ఏతావన్తశ్చ భూయాఁసశ్చ దిశో రుద్రా వితస్థిరే |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
నమో స్తు రుద్రేభ్యో యే దివి యేషాం వర్షమిషవః |
తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాః |
తేభ్యో నమో అస్తు తే నో వృణయన్తు తే నో మృడయన్తు 
తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తమేషాం జమ్భే దధ్మః ||
నమో స్తు రుద్రేభ్యో యే న్తరిక్షే యేషాం వాత ఇషవః |
తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాః |
తేభ్యో నమో అస్తు తే నో వన్తు తే నో మృడయన్తు 
తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తమేషాం జమ్భే దధ్మః ||
నమో స్తు రుద్రేభ్యో యే పృథివ్యాం యేషామన్నమిషవః |
తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాః |
తేభ్యో నమో అస్తు తే నో వన్తు తే నో మృడయన్తు 
తే యం ద్విష్మోయశ్చ నో ద్వేష్టి తమేషాం జమ్భే దధ్మః ||
ఓం. నమో భగవతే రుద్రాయ.
హరిః ఓమ్.
జైహింద్.