జైశ్రీరామ్.
శ్లో. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం
లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి
ఆ.వె. శాస్త్ర మేమి చేయు చక్కని దగు ప్రజ్ఞ
లేనినాడు జగతిలోన మనకు,
కనులు లేనినాడు కరమున నద్దంబు
కలిగియున్ననేమి కలదు సుఖము?
భావము. ఎవనికైతే స్వయం ప్రజ్ఞ ఉండదో వానికి శాస్త్రం ఏమి చేయగలదు?
కనులు లేనివానికి దర్పణము ఏమి చేయగలదు?
కనుక మనం తెలిసికున్నదానిని లోతుగా పరిశీలించుకోనపుడు అర్థం
చేసికోనపుడు తెలిసికున్నదానివలన ప్రయోజనము ఉండదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.