గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మే 2023, సోమవారం

TANAలో అనంతచ్ఛందము ద్వారా నా పద్యపఠనము.

 

జైశ్రీరామ్.


౮౮. మానస భంజని    భ  ర  య  స  జ  గ    యతి ౯వ అక్షరము.

మానవ ధర్మమెన్ని, ప్రేమంగనుటొప్పగున్ ధరన్

జ్ఞాన సుధా స్రవంతి లోకాన రహింపగన్ ప్రభన్

దీనజనాళియున్  బ్రశాంతిన్ స్థిరమై రహించుతన్

శ్రీనరసింహమా దయాశ్రీ కురిపించుమా కృపన్.

౮౯. సురాసురవంద్య.        జ   జ   జ   జ   జ   వ,   యతి ౯వ అక్షరము.

ఉమాధవుఁడేలను రాడొ కనంబడ పేదలకున్

బ్రమోదమొ వారికి భారము మోపుట కష్టములన్

సమంచిత వృద్ధిఁ బ్రశస్తముగా నిడి బీదలకున్.

సమస్త సుఖంబులు శాశ్వత భోగము గొల్పదగున్.

౯౯. వీణార.   త   జ   జ   జ   జ   జ   జ   జ.   యతి  ౧౦.   ౧౯ అక్షరములు,

లోకంబున ధర్మము వర్ధిలు మార్గము నీశ్వరు నిచ్చలు తెల్ప, గ్రహించి,

శ్రీకారమునందున నారసి మూలము చిత్తము పొంగ చిదాత్ముని గాంచి,

లోకాత్ముని చెంతను వర్తిలు చిత్తము శాంతిగ వర్ధిలు, దక్షత తోడ

లోకాన రచించుచు వెల్గులు మెల్గెడిమూర్తుల, మేలుగ నిద్ధరఁ గొల్తు. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.