గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మే 2023, మంగళవారం

సృజనస్వరం- ఆశావాది ప్రకాశరావు..ఇంటర్వ్యూ.. 1వ భాగం.. కస్తూరి మురళీకృష్ణ ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

29, మే 2023, సోమవారం

TANAలో అనంతచ్ఛందము ద్వారా నా పద్యపఠనము.

0 comments

 

జైశ్రీరామ్.


౮౮. మానస భంజని    భ  ర  య  స  జ  గ    యతి ౯వ అక్షరము.

మానవ ధర్మమెన్ని, ప్రేమంగనుటొప్పగున్ ధరన్

జ్ఞాన సుధా స్రవంతి లోకాన రహింపగన్ ప్రభన్

దీనజనాళియున్  బ్రశాంతిన్ స్థిరమై రహించుతన్

శ్రీనరసింహమా దయాశ్రీ కురిపించుమా కృపన్.

౮౯. సురాసురవంద్య.        జ   జ   జ   జ   జ   వ,   యతి ౯వ అక్షరము.

ఉమాధవుఁడేలను రాడొ కనంబడ పేదలకున్

బ్రమోదమొ వారికి భారము మోపుట కష్టములన్

సమంచిత వృద్ధిఁ బ్రశస్తముగా నిడి బీదలకున్.

సమస్త సుఖంబులు శాశ్వత భోగము గొల్పదగున్.

౯౯. వీణార.   త   జ   జ   జ   జ   జ   జ   జ.   యతి  ౧౦.   ౧౯ అక్షరములు,

లోకంబున ధర్మము వర్ధిలు మార్గము నీశ్వరు నిచ్చలు తెల్ప, గ్రహించి,

శ్రీకారమునందున నారసి మూలము చిత్తము పొంగ చిదాత్ముని గాంచి,

లోకాత్ముని చెంతను వర్తిలు చిత్తము శాంతిగ వర్ధిలు, దక్షత తోడ

లోకాన రచించుచు వెల్గులు మెల్గెడిమూర్తుల, మేలుగ నిద్ధరఁ గొల్తు. 

జైహింద్.

28, మే 2023, ఆదివారం

శ్రీ శివ సహస్ర నామములకు చంద్రికా భాష్యము వ్రాసిన శ్రీ అంబాళం పార్థ సారథిగారు మా యింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేశారు.

0 comments

జైశ్రీరామ్. 

ఓం నమో నారాయణాయ.

అంబాళాన్వయ! పార్థసారథి మహాత్మా! స్వాగతమ్మీకు, జ్ఞా
నం బాశంకర దత్తమై శివుని శ్రీ నామాళి సాహస్రమున్
సాంబుండే పులకింపగా వివరణన్ సంస్తుత్యమానంబుగా
శంభోశంకరయంచు వ్రాసిరికదా, శర్వాణియుప్పొంగగా.

మీ రాకన్ శుభ సంహతుల్ గలుగు సామీ! జ్ఞాన వారాశియే
మీ రూపంబున వచ్చి నన్ గృపగనెన్, మేలున్ సదా గొల్పగా,
ధీరోదాత్త శివంకరుండు దయతో దీర్ఘాయువున్ గొల్పుచున్
శ్రీరమ్యాక్షరసేవ చేయగ మిమున్ జిజ్ఞాసతోఁ బ్రోచుతన్.

చక్కని గ్రంథమునిచ్చిరి
మక్కుతో నన్ను గనిరి మహనీయుండా!
నిక్కముగా మీ ప్రేమను
వక్కాణింపంగ చాల, భద్రము మీకున్.

చింతా రామకృష్ణారావు.
జైహింద్.


24, మే 2023, బుధవారం

అక్షరామృతం ఉచ్చారణతో ఆరోగ్యం.

0 comments

 జైశ్రీరామ్.


జైహింద్.

21, మే 2023, ఆదివారం

నిరంతర సాధనతో గుర్తింపు పొందిన డా.బీ.హె.చ్వీ. రమాదేవి (కవయిత్రి)

0 comments

 

జైశ్రీరామ్.
నిరంతర సాధనతో గుర్తింపు పొందిన ఈ స్త్రీమూర్తికి నా అభినందనలు.
జైహింద్.

20, మే 2023, శనివారం

తెలుఁగు పద్యంలో క్రొత్త వృత్తాలు. తానా ప్రపంచ సాహిత్యవేదిక.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.





శ్రీకృష్ణుఁడు సత్యభామకు బహూకరించిన పారిజాతవృక్షము నేటికీ ఉన్నదిగా చెప్పబడుతున్నది ఇదే.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

19, మే 2023, శుక్రవారం

ముప్పదిమూడుకోట్లసురముఖ్యులు వీరలె, మీరెఱుంగుడీ.

0 comments

 

జైశ్రీరామ్.
ఈ చిరంజీవికి జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
జైహింద్.

18, మే 2023, గురువారం

శివునిలో అంతర్భాగమయిన భవానీ ప్రార్థనా గర్భితమగు శివలింగబంధ ఉత్పలమాల.. రచన .. చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్. 

ఓం నమశ్ళివాయ.

కను నను భవాని! నిను గొలిచెదను.

శ్రీ(క)ర! భా(ను)తేజ!(న)ను జేరగనీ ని(ను) ముక్తి గాంచగా,

యేక్రియ నీ(భ)వాంబుధి గతింతు న(వా)రితరీతి? ధీ (ని)ధీ!

నీక(ని) నే(ను)మున్(గొ)లుతు నీ(లి)సుకంధర! ప్రో(చె)దీవె యం

చే కరణిన్(ద)యన్ గనుదొ?యీశ్వరుడా! వి (ను) తింతు నిన్నిలన్.


జైహింద్.

10, మే 2023, బుధవారం

గీత పారాయణానంతరము గీతా మాహాత్మ్యము పఠించనిచో పారాయణ నిష్ఫలమే.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.   గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |                                     వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||

గీతా పఠన మహత్వము
నేతరి చదువకను గీత నెంత చదివినన్
ఖ్యాతిని గొలపదు. సరికద
యాతని శ్రమ వ్యర్ధమిలను. హరినుత భక్తా!

భావము.

గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో 
అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే(నిష్ఫలమే). అట్టివారి 
గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది.

జైహింద్.