గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జూన్ 2020, గురువారం

గతికా,ముముక్షు,మత్తరజినీ,గతి గమిత,సజావు,ఇచ్ఛాను సారి,సు నీతినీ,నిరతి,దహిత,చరిత,గర్భ"-ప్రజాజీవనా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
గతికా,ముముక్షు,మత్తరజినీ,గతి గమిత,సజావు,ఇచ్ఛాను సారి,సు నీతినీ,నిరతి,దహిత,చరిత,గర్భ"-ప్రజాజీవనా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         

ప్రజాజీవనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.య.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరశు రామ ప్రీతి జేసి!ప్రజా జీవనాల నెల్ల!పాతకీ!కరోన రక్కసీ!
చరతి మంచి మార్గమంచు!సజావేమి లేక జేసి!జాతకాలు మార్చి తేలనే?
పరమునైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళె దేల?వాత రోగమంటు నీకికన్!
నిరతి వీడి సాగె దేల?నిజేచ్ఛ న్జరింప బోకు!నేతనంచు పొంగ బోకుమా!

1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
పరశు రామ ప్రీతి జేసి!
చరతి మంచి మార్గమంచు!
పరము నైన లెక్క మాని!
నిరతి వీడి సాగె దేల?
2.గర్భగత"-ముముక్షు వృత్తము.
అనుష్టుప్ఛందము.య.జ.గల.గణములు.వృ.సం.110,
ప్రాసనియమము కలదు.
ప్రజా జీవనాల నెల్ల!
సజా వేమి లేక జేసి!
వజీరంచు త్రుళ్ళె దేల?
నిజేచ్ఛన్జరింప బోకు!
3.గర్భగత"-మత్తరజినీ వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాస నియమము కలదు.
పాతకీ!కరోన రక్కసీ!
జాతకాలు మార్చి తేలనె?
వాత రోగమంటు  నీ కికన్!
నేత నంచు పొంగ బోకుమా!
4.గర్భగత"-గతి గమిత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.య.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరశురామ ప్రీతి జేసి!ప్రజా జీవనాల నెల్ల!
చరతి మంచి మార్గమంచు!సజావేమి లేక జేసి!
పరము నైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళె దేల?
నిరతి వీడి సాగె దేల?నిజేచ్ఛ న్జరింప బోకు!
5.గర్భగత"-సజావు"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.జ.ర.లగ.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రజా జీవనాల నెల్ల!పాతకీ కరోన రక్కసీ!
సజావేమి లేక జేసి! జాతకాలు మార్చి తేలనే?
వజీరంచు త్రుళ్ళె దేల?వాతరోగ మంటు నీకికన్!
నిజేచ్ఛం జరింప బోకు!నేత నంచు పొంగ బోకుమా!
6.గర్భగత"-ఇచ్ఛానుసారి"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.జ.ర.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.
ప్రజా జీవనాల నెల్ల!పాతకీ కరోన రక్కసీ!పరశురాము ప్రీతి జేసి!
సజావేమి లేక జేసి!జాతకాలు మార్చి తేలనే?చరతి మంచి మార్గ మంచు!
వజీరంచు త్రుళ్ళె దేల?వాత రోగ మంటు నీ కికన్!పరము నైన లెక్క మాని! నిజేచ్ఛ చరింప బోకు!నేతనంచు పొంగ బోకుమా!నిరతి వీడి సాగె దేల?
7.గర్భగత"-సు నీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.యతి,10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాతకీ!కరోన"రక్కసీ!వరశు రాము ప్రీతి జేసి!
జాతకాలు మార్చి తేలనే?చరతి మంచి మార్గమంచు!
వాత రోగ మంటు నీకికన్!పరము నైన లెక్క మాని!
నేతనంచు పొంగ బోకుమా!నిరతి వీడి సాగె దేల?
8.గర్భగత"-నిరతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.య.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
పాతకీ!కరోన రక్కసీ!పరశురాము ప్రీతిజేసి!ప్రజా జీవనాల నెల్ల!
జాతకాలు మార్చి తేలనే?చరతి మంచి మార్గమంచు!సజావేమి!లేక జేసి!
వాత రోగ మంటు నీకాకన్!పరమునైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళెదేల?
నేతనంచు పొంగ బోకుమా!నిరతి వీడి సాగెదేల?నిజేచ్ఛ చరింపబోకు!
9.గర్భగత"-దహిత"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.భ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రజా జీవనాల నెల్ల!పరశురాము ప్రీతి జేసి!
చరతి మంచి మార్గమంచు!సజావేమి లేక జేసి!
పరమునైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళె దేల?
నిరతి వీడి సాగె దేల?నిజేచ్ఛ చరింప బోకు!
10,గర్భగత"-చరతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రజా జీవనాల నెల్ల!పరశురాము ప్రీతి జేసి!పాతకీ!కరోన రక్కసీ!
చరతి మంచి మార్గమంచు!సజావేమి!లేక జేసి!జాతకాలు మార్చి తేలనే?
పరమునైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళెదేల?వాత రోగమంటు నీకికన్!
నిరతి వీడి సాగె దేల?నిజేచ్ఛ చరింప బోకు!నేత నంచు పొంగ బోకుమా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.