శా. శ్రీమన్మంగళ భావ శోభిత జయశ్రీ మూర్తి కాత్యాయినీ
ప్రేమోద్భాసితమంగళాంగ విభవా! శ్రీనీలకంఠేశ్వరా!
కామాదుల్ప్రభవింపఁ జేసి జనులన్ కష్టంబులం ద్రోసితే?
యేమాత్రంబును జాలి లేదొ? యభవా! హే పార్వతీవల్లభా!
అశ్వధాటి.
రుద్రా! మహత్త్సుజన భద్రా! త్రిశూలహత క్షుద్రా! విశేష ఫలదా!
నిద్రాణ శక్తులను సద్రూప! మేల్కొలిపు, మద్రక్షకా! శుభకరా!
రౌద్రంబు చూపెడి దరిద్రాళిఁ మాపఁగను రుద్రా ప్రయత్నింపవా?
సద్రక్షణార్థమయి నిద్రన్త్యజించుమయ! క్షుద్రాళి మాపుము హరా!
జైహింద్.
1 comments:
నమస్కాములు
" శివం " అన్నపదానికీ " శివ = శ+ఇ+వ. శ కార, ఇ కార, వ కార, శబ్ధ ములకుగల అమృతమయమైన శక్తులను చక్కని విధముగా వివరించి నందులకు ధన్య వాదములు " అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.