కూపబంధము లో గౌరీ, వాణీస్తుతులు.
గౌరీస్తుతి:
గౌరీస్తుతి:
అద్రిరాజసూన అమ్బురుహానన
అర్కదీప్తిశోణ అమిత కరుణఁ
నన్ను గావుము హరిణవిశాలలోచనా
నమ్మి గొలుతు ప్రీణనము పనుగొన.
వాణీస్తుతి:
అవ్యయీనిధాన అమ్బురుహానన
అబ్జపీఠు జాణ అమిత కరుణఁ
నన్ను గావుము హరిణవిశాలలోచనా
నమ్మి గొలుతు ప్రీణనము పనుగొన.
చూచారా! మన రవి ఎంతటి సునాయాసంగా ఆటవెలదులను కూపబంధం చేసాడో! ఇటువంటి వినూత్న ప్రయోగాలు ఇంకా ఇంకా చేస్తూ సాటి రచయితలకు కవులకూ ఉత్తేజేత్సాహ కారకుడు కాగలడని ఆశిద్దాం.
జైశ్రీరాం.
జైహింద్.