28, ఫిబ్రవరి 2025, శుక్రవారం
వ్యాఘ్రేశ్వరలింగావిర్భూతి...... వివరణ....శ్రీ క్రొవ్విడి నేంకట రాజారావు.
0
comments

27, ఫిబ్రవరి 2025, గురువారం
కూరగాయల మార్కెట్ లో సంస్కృత సంభాషణ Conversation in Sanskrit #samskrutam...
0
comments

మహా శివరాత్రి సంస్కృత సంభాషణ Conversation in Sanskrit #మహాశివరాత్రి #m...
0
comments

ఏకో౽పి కృష్ణస్య కృతః ప్రణామః ... మేలిమిబంగారం మన సంస్కృతి
0
comments
జై శ్రీరామ్.
శ్లో. ఏకో౽పి కృష్ణస్య కృతః ప్రణామః - దశాశ్వమేధావభృథేన తుల్యః ౹
దశాశ్వమేధీ పునరేతి జన్మ - కృష్ణప్రణామీ న పునర్భవాయ ౹౹ (సుభాషితరత్నకోశః)
తే.గీ. కృష్ణునకు వందనము చేయ విష్ణుని కృప
నశ్వమేధదశకఫల మందు మనకు,
నశ్వమేధఫలము తుద నతఁడు పుట్టు,
పుట్టడిక కృష్ణ భక్తుఁడు ముక్తిఁ గనును.
భావము. కృష్ణునికి హృదయపూర్వకంగా చేసిన ఒకేఒక నమస్కారం పది
అశ్వమేధయాగాలు చేశాక అవభృథస్నానం చేసినంత ఫలితం ఇస్తుంది.
కానీ? కృష్ణునికి చేసిన నమస్కారంలో ఒకవిశేషం ఉంది. దశాశ్వమేధాలు
చేసినవాడు మళ్లీ జన్మిస్తాడు. కానీ? "కృష్ణునికి నమస్కరించినవాడు
మళ్లీ జన్మ ఎత్తడు.
జైహింద్.

24, ఫిబ్రవరి 2025, సోమవారం
పురూరవుని జననక్రమం. వివరణ. .... శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు.
0
comments

న తథాఽసిస్తథా తీక్ష్ణః ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. న తథాఽసిస్తథా తీక్ష్ణః - సర్పో వా దురధిష్ఠితః |
యథా క్రోధో హి జంతూనాం - శరీరస్కో వినాశకః || (ఆపస్తంబస్మృతి)
తే.గీ. కత్తిపై, మరి పాముపై కాలుమోప
హాని కలిగించు తప్పక, యది నిజంబు,
వీటికిని మించి హానిని మేటిగాను
కలుఁగఁ జేయును కోపంబు కనఁగ నరుఁడ!
భావము. కనిపించకుండా త్రొక్కబడిన కత్తియైనా పామైనా ప్రమాదాన్ని
కలిగిస్తాయి.కానీ వాటి కంటే ఎక్కువగా శరీరంలో ఉన్న కోపం జీవులకు
హాని చేస్తుంది.
జైహింద్.

కలిః శయానో భవతి ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. కలిః శయానో భవతి - సంజిహానస్తుద్వాపర
ఉత్తిష్ఠే త్రేతా భవతి - కృతం సంపద్యతే చరన్.
తే.గీ. నిదుర కలియగమెన్నగ, నిదురలేవ
ద్వాపరంబౌను, త్రేతయౌ వరల నడువ,
కృతయుగమౌను సత్యంబు నతులితముగ
కనఁగ నడచినన్, సత్యమే కనిము నడచి.
భావము. నిద్రపోతుంటే కలియుగము. లేచి కూర్చుంటే ద్వాపరయుగము.
లేచి నిలబడితే త్రేతాయుగము. లేచి తన లక్ష్యం వైపు అడుగులు వెయ్యడం
కృతయుగము. లక్ష్య ప్రాప్తి కొఱకు అడుగులు వెయ్యాలి. ముందుకు వెళ్ళాలి.
జైహింద్.

రాజ దేశ కుల జ్ఞాతి ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. రాజ దేశ కుల జ్ఞాతి - స్వధర్మాన్ నైవ దూషయేత్।
శక్తోఽపి లౌకికాచారం - మనసాపి న లఙ్ఘయేత్॥
తే.గీ. తనదు రాజును, దేశమున్, తన కులమును,
తనదు జ్ఞాతులన్, ధర్మమున్, తానె చేయఁ
దగదు దూషణమెప్పుడున్, తగియు తాను
లౌకికాచార వర్జనమసలు తగదు.
భావము. తన రాజును, దేశమును, కులమును, బంధువులను, ధర్మమును
ఎన్నడూ దూషించకూడదు. నీకు శక్తి ఉన్నప్పటికీ నీ సంఘముయొక్క
ఆచారవ్యవహారాది మర్యాదలను మనసా అయిననూ ఉల్లంఘించవద్దు.
జైహింద్.

నిష్కేవలస్వర, నిష్పంచవర్గ, నిర్బిందు, నిర్గద్య, దశాక్షరీయమైన శౌరి శైశవ లీల.... రచన....పోకూరి కాశీపత్యవధాని.
0
comments

23, ఫిబ్రవరి 2025, ఆదివారం
బాలక సఖత్వమకారణహాస్యం..ంఏలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. బాలక సఖత్వమకారణహాస్యం - స్త్రీషు వివాదమసజ్జనసేవా।
గార్దభయానమసంస్కృతవాణీ - షట్సు నరో లఘుతాముపయాతి॥
తే.గీ. బాలకుల తోడ స్నేహము, స్త్రీలతోడ
తగవు, కారణమే లేని నగవు, దుష్ట
జనుల సేవ, యవాగ్ఝరి, చనుట గార్ధ
భముపయి, ననునారును, విలువలను చెరచు!
భావము. బాలురతో స్నేహం, కారణంలేని నవ్వు, స్త్రీలతో వివాదం, దుర్జనులను
సేవించుట, గాడిదపై ప్రయాణించుట, సంస్కారయుక్తముకాని మాట -
ఈ ఆరింటివల్ల మనుష్యుడు అల్పుడగుచున్నాడు.
జైహింద్.

అష్టవిధ నాయికలు.....ఱచన.....చింతా రామకృష్ణారావు......తే. 26 - 02 - 2020.
0
comments

22, ఫిబ్రవరి 2025, శనివారం
నాఽస్తి కామ సమో వ్యాధిః | ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. నాఽస్తి కామసమో వ్యాధిః | - నాఽస్తి మోహసమో రిపుః |
నాఽస్తి కోపసమో వహ్నిః | - నాఽస్తి జ్ఞానాత్ పరం సుఖమ్ ||
తే.గీ. కామమును మించు వ్యాధియే కనఁగ లేదు,
మోహమునుమించఁ గల్గు రిపువన లేదు,
కోపమును మించ లేదగ్ని కువలయమున,
జ్ఞానమునుమించు సుఖమిం గనఁగ లేదు.
భావము. కామముతో సమానమైన వ్యాధి మఱొకటిలేదు. మోహముతో సమానుడైన
శత్రువు మఱొకడు లేడు. కోపముతో సమానమైనది మఱొక యగ్ని లేదు.
ఆత్మజ్ఞానమునకు మించిన సుఖమింకొకటి లేదు.
జైహింద్.

తే. 13 - 02 - 2025న జరిగిన శ్రీ మహాభారత సభాపర్వము. సభావిజ్ఞాన సమీక్ష గ్రంథావిష్కరణము. రచన. శ్రీమాన్ శ్రీమత్తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు.
0
comments
21, ఫిబ్రవరి 2025, శుక్రవారం
సుందోపసుందుల కథ......శ్రీ క్రొవ్విడి వేంకటరాజారావు.
0
comments

20, ఫిబ్రవరి 2025, గురువారం
షోడశదళ పద్మ బంధము. వివరణ. శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు.
0
comments

చిత్రకావ్యం-బంధకవిత్వం -గ్రంథపరిచయం- సమర్పణ......శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు.
0
comments
జైశ్రీరామ్.
చిత్రకావ్యం-బంధకవిత్వం
-గ్రంథపరిచయం-
ఆశు,మధుర,చిత్ర, విస్తరకవిత్వంలో చిత్రకవిత్వం ఒకటి.
ప్రపంచంలో దాదాపు అన్నిప్రసిద్ధ భాషలలోనూ చిత్రకవిత్వం
ఉంది.అయితే సంస్కృతంలో ఉన్నంత చిత్రకవిత్వం ఇతర
భాషలలో మృగ్యం.
అలంకారగ్రంథాలలో దండి కావ్యాదర్శం నుంచీ నేటిదాకా
బంధకవిత్వం వివిధ ప్రాంతాలనుంచీ, వివిధ కాలాలలో వివిధ పండితుల కలాలనుంచి వెలువడుతూ నే ఉంది.
ప్రస్తుతం"చిత్రకావ్యమ్"అనేరచనలోఉండిన చిత్రబంధాలను
గురించి నామమాత్రంగా తెలుసుకుందాం.
ముందుగా "చిత్రకావ్యం" రచించిన కవివర్యుని గురించి
సంక్షిప్తంగా--
"చిత్రకావ్యం"ను రచించినమహాకవివర్యులు శ్రీమాన్.ఉ.వే.
శ్రీరామభద్రాచారియర్.వీరికి శ్రీరామభద్రకవి అని కూడా వ్యవహారం. వీరి జన్మస్థలం 'కోయంబత్తూ రు'కు సమీపానగల
"సుందరపాలయం".
శ్రీమాన్ రామభద్రాచారియర్ కాలం క్రీ.శ.1840-1904.
సుందరపాలయం ఆకాలంలోపండితులకునిలయం. శ్రీమాన్
ఆచార్యులవారు తమ జన్మస్థలంలోనే విద్యలను అభ్యసించి,
సంప్రదాయ విద్యాభ్యాసంకోసం శ్రీరంగం వెళ్లినారు. అక్కడ
'అహోబిలమఠవారి శ్రీమత్ ఆండవాన్ వారి ఆశ్రమం'లో చేరినారు.శ్రీమత్పెరియాండవాన్ స్వామివారి సన్నిధానంలో
సంప్రదాయసాహిత్యాన్ని అధ్యయనం చేసినారు.శ్రీస్వాముల
వారిసన్నిధానంలోని "అష్టదిగ్గజవిద్వన్మహాకవిపండితవర్యు" లలో వీరుకూడా ఒకరుగా విరాజిల్లినారు.అక్కడ ఎనిమిది సంవ త్సరాలు ఉండి, ఆతర్వాత "సుందపాలయం" స్వస్థ
లానికి తిరిగి వేంచేసినారు.
శ్రీమాన్ శ్రీరామభద్రాచారియర్ స్వామివారు బహుగ్రంథ
ప్రణేత.వీరు రచించిన గ్రంథాలలో "చిత్రకావ్యం"ఒకటి.
"చిత్రకావ్యమ్"గ్రంథం చెన్నపట్టణంలోని మైలాపూర్ నుండి క్రీ.శ.1892వ సంవత్సరంలోప్రచురితం
-:గ్రంథంలోని బంధాల పరిచయం:-
"చిత్రకావ్యమ్" రెండు పరిచ్ఛేదాలుగా విరచితం. ప్రథమ
పరిచ్ఛేదంలో24ప్రకరణాలుఉన్నాయి.ద్వితీయపరిచ్ఛేదంలో
10ప్రకరణాలు ఉన్నవి.
ప్రస్తుతం బంధపరిచయం మాత్రమే చేయాలనుకోవడం
వల్ల ద్వితీయ పరిచ్ఛేదంలోని బంధనామాలను వరుసగా
తెలుసుకుందాం.ద్వితీయ పరిచ్ఛేదంలోని బంధప్రకరణాలు
పదికూడా వరుసగా సంప్రదాయానుసారంగా ఉండడం స్మర
ణీయం.ఇక ఆయా ప్రకరణాలలోని బంధానుక్రమణిక---
చిత్రకావ్యమ్
ద్వితీయ పరిచ్ఛేదః
1.పంచాయుధ బంధ ప్రకరణమ్
1.సుదర్శన బంధః
2.శంఖ బంధః
3.గదా బంధః
4.ఖడ్గ బంధః
5.శార్జ్గ బంధః
2.చక్రబంధ ప్రకరణమ్
1.చతురర చక్రబంధః
2.చతురర చక్రబంధః(మరొకటి)
3.విశృంగాటక చక్రబంధః
4.ద్విచతుష్క చక్రబంధః
5.(కవినామవిషయనామాంక)చక్రబంధః
6.గురునామ,కర్తృనామ,విషయనామాంకిత చక్రబంధః
3.తృతీయం మంత్రప్రకరణమ్
1.ద్వాదశాక్షర గోరథబంధః
2.అష్టాక్షర ఢక్కాబంధః
3.షడక్షర ఉలూఖలబంధః
4.పంచాక్షర భృంగారకబంధః
4.చతుర్థభాగః-ఉపకరణబంధ ప్రకరణమ్
1.చిత్రాందోలికాబంధః
2.సాధారణాందోళికాబంధః
3.సవితాన మంచబంధః
4.సాధారణ మంచబంధః
5.డోలాబంధః
6.సాధారణ ఛత్రబంధః
7.ముక్తాసరచ్ఛత్రబంధః
8.చామరబంధః
9.తాలవృంతబంధః
10.ధ్వజబంధః
11.ముక్తాహారబంధః
5.పంచమం సేనాంగ బంధప్రకరణమ్
1.(సాధారణ)రథబంధః
2.మహారథబంధః
3.గజబంధః
4.తురగబంధః
5.పదాతిబంధః
6.(మరొకటి)పదాతిబంధః
6.షష్టం ఆయుధబంధప్రకరణమ్
1.ఖడ్గబంధః
2.కఠారిబంధః
3.గజబంధః
4.కుంతబంధః
5.పరశుబంధః
6.చాపబంధః
7.శరబంధః
8.ఖేటబంధః
9.క్షురికాబంధః
10.అసిబంధః
7.సప్తమం గోమూత్రికాబంధః
1.(సాధారణ)గోమూత్రికాబంధః
2.సమానవృత్తపాదానులోమప్రతిలోమ గోమూత్రికాబంధః
3.సమానవృత్తపాదానులోమ గోమూత్రికాబంధః
4.భిన్నవృత్తార్థానులోమ గోమూత్రికిబంధః
5.భిన్నవృత్తార్థానులోమ గోమూత్రికాబంధః
6.భిన్నవృత్తపాదానులోమ ప్రతిలోమ గోమూత్రికాబంధః
7.భిన్నవృత్తార్థానంలోమ ప్రతిలోమ గోమూత్రికిబంధః
8.అష్టమం నాగబంధ ప్రకరణమ్
1.కుండలిత ఏకనాగబంధః
2.(సాధారణ)నాగబంధః
3.చతుర్నాగబంధః
4.ద్వినాగబంధః
5.అష్టనాగబంధః
6.కృష్ణసర్పబంధః
7.వాసుకీద్వినాగబంధః
9.నవమం పద్మబంధ ప్రకరణమ్
1.కుముదబంధః
2.పంచదళ పుండరీకబంధః
3.అష్టదళ పద్మబంధః
4.అష్టదళ నీలోత్పలబంధః
5.(కవినామాంకిత)అష్టదళపద్మబంధః
6.మహాష్టదళపద్మబంధః
7.(మరొకరకం)కవినామాంకిత అష్టదళపద్మబంధః
8.కవినామాంకిత అష్టదళపద్మబంధః(రేఖాభేదః)
9.విషయనామాంకిత అష్టదళపద్మబంధః
10.ద్వాదశదళపద్మబంధః
11.షోడశదళపద్మబంధః
12.ద్వాదశదళ నళినీబంధః
13.విలక్షణ చతుర్దళ పద్మబంధః
14.పంచదళ ఉత్పలబంధః
15.షోడశదళకమలబంధః
16.ద్వాత్రింశద్దళ కమలబంధః
17.స్థలకమలబంధః(మెట్టతామర) 10.దశమం సంకీర్ణబంధప్రకరణమ్
1.ఊర్ధ్వపుండ్రబంధః
2.ఘంటాబంధః
3.కరకబంధమ్
4.పుష్పహారబంధం
5.పురుషబంధః
6.నారీబంధః
7.హంసబంధః
8.మయూరబంధః
9.మురజబంధః
10.అంగదబంధః
11.గుచ్ఛబంధః
12.కంఠాభరణబంధః
13.మత్స్యబబంధః
14.వృశ్చికబంధః
15.గోపురబంధః
16.బృందావనబంధః
17.అర్ధభ్రమకబంధః
18.సర్వతోభద్రబంధః
19.చతురంగే తురంగబంధః
20.హలబంధః
21.వీణాబంధః
22.నిశ్శ్రేణికాబంధః
23.తులాబంధః
24.నవవర్షక జంబూద్వీపబంధః
25.దీపస్తంభబంధః
26.వృక్షబంధః
27.ఘటికాబంధః
-చిత్రకావ్యంలోని మొత్తంబంధాలు-
1.నారాయణస్య పంచాయుధబంధాః 05
2.చక్రబంధాః 06
3.మంత్రబంధాః 04
4.భోగోపకరణబంధాః 11
5.సేనాంగబంధాః 06
6.ఆయుధబంధాః 10
7.గోమూత్రికాబంధాః 07
8.నాగబంధాః 07
9.పద్మబంధాః 17
10.సంకీర్ణబంధాః 26
మొత్తం ... ... 100
వందబంధాలు అందమైన సముచిత చిత్రాలతో,సందర్భోచితమైన వ్యాఖ్యానంతో,శ్రీమాన్ శ్రీరామభద్రాచారియర్ స్వామివారు రచించినచిత్రకావ్యమ్ చదివితే బంధకవిత్వాభిమానులలో అద్భుతరసాన్ని ఆవిష్కరిస్తుంది.
సమర్పణ
వైద్యంవేంకటేశ్వరాచార్యులు.
జైహింద్.

ఏకాదశ దళ పద్మవృత్త బంధము. భాగవతము 10వ స్కంధము 1009వ పద్యము. చిత్రం శ్రీవైద్యం
0
comments

19, ఫిబ్రవరి 2025, బుధవారం
మొఘల్ పాలనకు గోరీ కట్టిన వీరుడి శంభాజీ చరిత్ర | great warrior Shambhaji real s...
0
comments

17, ఫిబ్రవరి 2025, సోమవారం
దిలీపుడు - సంతానయోగ్యత....శ్రీ క్రొవ్విడి వేంకటరాజారావు.
0
comments

16, ఫిబ్రవరి 2025, ఆదివారం
తులతూగు,చరితార్ధ,నెడ నెడ,జీవన కల,గర్భ"-పరార్ధతా"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.

15, ఫిబ్రవరి 2025, శనివారం
యో యమర్థం ప్రార్థయతే. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. యో యమర్థం ప్రార్థయతే - తదర్థం చేహతే క్రమాత్ |
అవశ్యం స తమాప్పోతి - న చేదర్ధాన్నివర్తతే || (యోగవాసిష్ఠం 2 - 4 - 12)
తే.గీ. కోరునది పొంద కృషీచేసుకొను నెవండు
వాఁడు మధ్యలో తన కృషి వదలకున్న
పొందు నద్దానిఁ దప్పక, బిధవరేణ్య!
మంచి పొందఁగ కృషి చేయు మాన్యులెపుడు.
భావము. ఎవడు ఏ ప్రయోజనాన్ని కోరుతున్నాడో, దాని కోసం అతడు అర్ధాంతరంగా
వదిలిపెట్టకుండా నిరంతరం కృషి చేస్తే, చివరికి దానిని తప్పకుండా సాధిస్తాడు.
జైహింద్.

14, ఫిబ్రవరి 2025, శుక్రవారం
మంచిపెంచు,మించకేగు,కుంచిత,కీర్తిదము,సత్కృప,కురచన,మెరుగులు,సుఖజీవన,పరమాత్మ,అరిషడులు,మితి మీరు,చెడుతలపు,మరచు,లోభత్వ,గర్భ"బ్రతుకు తీరు"వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.

వరదాంగ,ఉజ్వల,కాంతిదా,ఆనందవర,ఝరీ,ఆనందకరీ.సాంభవా,సర్వేశ్వర,జీవాత్మ,పరమాత్మ,స్థిరణశప్రాసాద,సంస్తుత్య,సత్కృపా, గర్భ"కృపానంద"-వృత్తము.....రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.

విశ్వనాథ గళంలో రామాయణ కల్పవృక్ష శబరి పద్యాలు(కఠిన పద అర్థాలతో)-01వభాగం
0
comments

ఒక్క కందంలో మొదటి రెండు పాదాలలోనే దశావతారాల నిమిడ్చి చెప్పిన తిరుపతివేంకట కవులు.....శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.
0
comments
జైశ్రీరామ్.
దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు !
.
ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.
పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా!
'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు.
దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.
సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు.
జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ..
మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,
క. జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం
డిల తిరుపతి వేంకటశా
స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.
అదీ వారి పాండిత్యం!
జైహింద్.

శ్రీమద్భాగవతలీలాకల్పద్రుమం. ... శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.
0
comments
జైశ్రీరామ్.
శ్రీమద్భాగవతలీలాకల్పద్రుమం
ఏక శ్లోకాన్ని భాగవత ద్వాదశస్కంధాలలోని ఇతివృత్తాలుగ
వ్యాఖ్యానించిన గ్రంథం.
వ్యాసులవారి సంస్కృత ~ భాగవతపురాణం,ప్రథమస్కం, ప్రథమాధ్యాయం-౧
శ్లో. జన్మాద్యయస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞఃస్వరాట్
తేనేబ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా
ధామ్నాస్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి.
ఈ శ్లోకాన్ని బమ్మెర పోతన ఇలా తెనిగించినాడు.
సీ.విశ్వ జన్మస్థితి-విలయంబు లెవ్వని
వలన నేర్పడు నను-వర్తనమున
వ్యావర్తనమున గా-ర్యములం దభిజ్ఞుడై
తాన రాజగుచు జి-త్తమున జేసి
వేదంబు లజునకు-విదితముల్ గావించె
నెవ్వడు బుధులు మో-హింతు రెవ్వ
నికి నెండమావులు-నీట గాచాదులు
నన్యోన్యబుద్ధి దా-నడరునట్లు
ఆ.త్రిగుణ సృష్టి యెందు-దీపించి సత్యము
భంగి దోచు స్వప్ర-భానిరస్త
కుహకు డెవ్వ డతని-గోరి చింతించెద
ననఘు సత్యు బరుని-నను దినంబు
-భాగవత కథాప్రారంభం(అవతారికతర్వాత)1స్కం,34
వ్యాసుని సంస్కృతభాగవతంలోని పై మొదటి శ్లోకానికి
వంశీధరశర్మ అనే విద్వన్మణి ప్రథమస్కంధంనుండి ద్వాదశస్కంధంవరకు
ఉండే వివిధ ఇతివృత్తాలుగల 134 అర్థాలు వచ్చేవిధంగా వ్యాఖ్యానం
రచించినాడు. అంటే
ఈ శ్లోకాన్ని 134 విధాలుగ వ్యాఖ్యానించినాడు.ఆ రచనకు శ్రీమద్భాగవత
లీలాకల్పద్రుమం అని పేరు. ఈ రచను తెలుగు అనువాదంతో 2011 లో
డా.తలముడిపి బాల సుబ్బయ్య ప్రచురించినారు.
పైశ్లోకానికి ప్రథమస్కంధం నుండి ద్వాదశస్కంధం వరకూ
ఉండే వివిధ ఇతివృత్తాలుగా అర్థం చెప్పడం విశేషం. సంస్కృత భాగవతంలోని
ఒకే శ్లోకానికి 134అర్థాలుగలశ్రీమద్భాగవతలీలాకల్పద్రుమం అరుదైన
విశేష గ్రంథం.
జైహింద్.
మాండవ్యోపాఖ్యానము...... శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు
0
comments

13, ఫిబ్రవరి 2025, గురువారం
సూర్య సూక్తం. డా. ఆముదాల మురళి. SURYA SUKTHAM BY DR AMUDALA MURALI
0
comments

స్రగ్విణీ, భుజంగప్రయాత, కంద గర్భ సీసము.. రచన శ్రీ గరిమెళ్ళ సోమయాజి శర్మ(1970లో)
0
comments

సర్వమంగళా! నా పద్య పంచకము.
0
comments
జైశ్రీరామ్.

చరాచర,పరంపర,నిరంతర,కెరటాల,పర్వం,శోకతా,తత్వం,సాకర,గురిత్వ,నినద,వనధి,పనుప,జీవజాల,తపనార్తి,గర్భ"వాగధీశ"-వృత్తము... రచన. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
