గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, సెప్టెంబర్ 2026, బుధవారం

ఎం.వీ.రావ్.ఫౌండేషన్, నెల్లూరు వారు నిర్వహించిన కవిసత్కారాలలో నాతో పాటు సత్కృతులందుకొనిన నా అభిమానులు.

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖులైన కవులకు రచయితలకు, సాహితీవేత్తలకు, ఉత్తమ ఉపాధ్యాయులకు తే. 06 - 9 -  2026 న ఎం.వీ.రావ్.ఫౌండేషన్, నెల్లూరు వారు అందఁ జేసిన పురస్కారములు గ్రహించిన వారిలో నాతో పాటు నా ఆత్మీయులైన నా అనుచరులు ఉండుట ముదావహము. వీరందరికీ నా అభినందనలు తెలియఁజేయుచు, ఆయా రంగాలలో వీరు పురోగతి సాధిస్తూ ఇంకా ఎన్నో పురస్కృతులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ కార్యక్రమమును అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వహించిన ఎం.వీ.రావ్.ఫౌండేషన్, నెల్లూరు వారిని, లీలామోహనులను మనసారా అభినందిస్తూ ఆజగన్మాత ఆశీస్సులు వీరికి నిరంతరం ఉండాలని కోరుకొంటున్నాను.

పురస్కృతుల వివరాలు.

జగన్మాత వీరికందరికీ ఆయురారోగ్యాఅనందైశ్వర్యసంపత్తులను మిన్నగా కలుగచేయాలని కోరుకొంటున్నాను.
జైహింద్.





Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.