గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, సెప్టెంబర్ 2026, సోమవారం

శతావధాని చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్తునకు నేనిచ్చిన సమస్య సంఖ్య 6 నకు అవధాని పూరణము మరియు నా పూరణము. జగన్మాత ఈ శతావధానికి శుభములను చేకూర్చుగాక.

 జైశ్రీరామ్.

శతావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్

ఓం శ్రీమాత్రే నమః.

శతావధాని చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్తునకు

జగన్మాత శుభములను చేకూర్చుగాక.

శా.  శ్రీ కల్యాణ శతావధాన క్రతువున్ శ్రీమంత సాహిత్ సుధీ!

లోకుల్ మెచ్చ మనోజ్ఞమార్గమున సుశ్లోకుండ! కావించితే!

నీకున్ శాంభవి దివ్యశక్తి నిడి క్షోణిన్ వర్ధిలన్ జేయుతన్,

శ్రీకారంబు శతద్వయంబునకు భాసింపన్ ధృతిన్ జుట్టుమా.

అభినందనలతో

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.