జైశ్రీరామ్.
శ్లో. యత్రాస్తి భోగో నచ తత్ర మోక్షఃI - యత్రాస్తి మోక్షో నచ తత్ర భోగఃII
శ్రీ సుందరీ సేవన తత్పరాణాంI - భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ II
గీ. భోగమున్న చోట మోక్షంబు కరువగు,
మోక్షమున్నచోట భోగమటులె,
నమ్మ పాదసేవ నమరును రెండును
నమ్మపైన భక్తి యమరుత మది.
భావము. ఎక్కడ భోగాపేక్ష ఉంటుందో అక్కడ మోక్షం లభించదు. అలాగే ఎక్కడైతే మోక్షకాంక్ష ఉంటుందో అక్కడ భోగాసక్తి ఉండదు. కాని ఎవరైతే శ్రీ లలితా మహాత్రిపురసుందరి జననిని సేవిస్తారో వారికి భోగములు, మోక్షమూ సులభంగా కరతలామలకములౌతాయి, అంటారు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.