జైశ్రీరామ్.
శ్రీ మహా లక్ష్మీ హృదయమ్
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
హరిః ఓమ్
అస్యశ్రీ ఆద్యాది శ్రీ మహా లక్ష్మీ హృదయ స్తోత్ర మహా మంత్రస్య
భార్గవ ఱుషిః
అనుష్టబాది నానా ఛందాంసి
కం:- శ్రీయను నక్కర మాదిగ
నా యమ శుభ లక్ష్మి వరల ననవరతంబున్!
పాయని భక్తితొ గొలుతుము
మాయా మయ మూర్తి జీవ మానంద మవన్!!
తే,గీ;-ఆది భార్గవ ఋషి వర్యు డరయ గూర్చె!
శ్రీ మహా లక్ష్మి హృదయము జెలువ మమర!
పలు తెరంగుల ఛందముల్!భాసిలంగ!
వరదు నారాయణాదిగా బరము కరుణ!!
తే,గీ;-శ్రీ మహాలక్ష్మి యనబొల్చు సిరుల తల్లి!
పరమ శ్రీహరి వామాంక వాసి యౌచు!
కనుల బొడగన్న భాగ్యంబు గలుగు కొఱకు!
మంత్ర పఠనంబు ఱుషి గూర్చె మహిత యశుడు!!
ఆద్యాది శ్రీ మహాలక్ష్మీ సహిత నారాయణో దేవతా
శ్రీమ్,బీజమ్,హ్రీం--శక్తిః,ఐమ్--కీలకమ్!
తే,గీ:-ఆది లక్ష్మికి పాదగు నట్టి,మంత్ర
మాదరంబున భక్తులు మనన జేయ!
సాహసించితి భార్గవు ఛందములను!
గీతికలు సేయ మా,లక్ష్మి కరుణ గోరి!!
శ్రీమ్--,బీజమ్,హ్రీమ్--శక్తిః,--ఐమ్ కీలకమ్
అథ న్యాసమ్,
ఓం--ఆద్యాది శ్రీ మహా లక్ష్మీ దేవతా యనమః---హృదయమ్
శ్రీమ్--బీజాయనమః--గుహ్యే,హ్రీమ్--శక్త్యై నమః--పాదయోః
ఐమ్--బలాయైనమః, --మూర్ధన్యాది పాద పర్యం. --విన్య సేత్!
ధ్యానమ్
ఓం- ఆద్యాది శ్రీ మహాలక్ష్మీ దేవతా యనమః--హృదయమ్!
శ్రీమ్--బీజాయనమః--గుహ్యే,హ్రీమ్--శక్త్యై నమః--పొదయోః!
ఐమ్--బలాయై నమః,మూర్థన్యాది పాద పర్యంతమ్ విన్యసేత్!
ఓం,--శ్రీం--హ్రీం-ఐం--కరతల కర పార్శ్వయోః
శ్రీం--అంగుష్టా భ్యా నమః, హ్రీం --తర్జనీభ్యాం నమః
ఐం--మధ్యమా భ్యాం నమః,--శ్రీం--అనామికాభ్యాం నమః
హ్రీం--కనిష్టి కాభ్యా నమః,ఐం--కర తల పుష్టాభ్యాం నమః!!
శ్రీం--హృదయాయనమః, హ్రీం--శిరసే స్వాహా!ఐం--శిఖాయై వౌషట్,
ఐం--అస్త్రాయ ఫట్ భూర్భు వస్సువరోం--ఇతి దిగ్బంధః!
ఓం--శ్రీం--హ్రీం--ఐం,కరతల పార్శ్వ యోః
శ్రీం--అంగుష్టాభ్యా నమః,హ్రీం--తర్జనీభ్యాం నమః,ఐం--మధ్యమాభ్యాం నమః
శ్రీం--అనామికాభ్యాం నమః,ఐం--కరతల కర పార్శ్వయోః!పుష్టాభ్యాం నమః
శ్రీం--హృదయాయనమః!
హ్రీం--శిరసే స్వాహా,ఐం--శిఖాయై వౌషట్,ఐం--అస్త్రాయ ఫట్ భూర్భు వస్సువరోం
ఇతి దిగ్బంధః---అని దిగ్బంథము చేయవలెను,----
(అనగా తన చుట్టనుచిటికెలు చేత రక్షణము చేసి ఆవాహిత యగు దేవతను
నిలుపు కొనుట,).
శ్లో;-హస్త ద్వయేన కమలే ధారయన్తీం స్వ లీలయాః!
హార నూపుర సంయుక్తాం--మహా లక్ష్మీ విచిన్తయేత్,!! 1.,
ధ్యానము
తే,గీ:-లీల కెంగేళి యుగళి స లీల యనగ!
ముత్తెముల పేరు యందెలు ముద్దు లొలయ!
వరద హస్తాన జనులకు వరములీను
వర మహాలక్ష్మి!ధ్యానింప వలయు నెపుడు!! 1.
శ్లో:-కౌశేయ పీత వసనా మరవిన్ద నేత్రామ్
పద్మ ద్వయా భయ!వరోద్యత పద్మ హస్తామ్!
ఉద్యచ్ఛ తార్క సద్యశం--పరమాంక సంస్థామ్!
ధ్యాయే ద్విధీశ నత పాద యుగాం జనిత్రీమ్!! 2.
తే,గీ:- పట్టు పుట్టాలు నొడ లెల్ల భాసిలంగ!
పద్మముల దోయి--యందెలు ముద్దు లొలయ!
అభయ హస్తాన శతకోటి భాను ప్రభల!
విష్ణు వామాంక సంస్థిత!విశ్వ మాత!!
తే,గీ:-బ్రహ్మ రుద్రాది సంపూజ్య పాద యుతను!
సర్వ లోకైక మాతను!సత్వ బుద్ధి!
కమల నేత్రను లక్ష్మిని వినుత మతిని
భక్తుడగు వాడు ధ్యానింప వలయు నెపుడు!! 2.
శ్లో:- శ్రీ లక్ష్మీ కమల ధారిణై సింహ వాహిన్యై స్వాహా
పీత వస్త్రాం, సువర్ణాంగీం పద్మ హస్త ద్వయాన్వితామ్
లక్ష్మీంధ్యాత్వేతి మంత్రేణ--సభవేత్పృథివీ పతిః!! 3.
తే,గీ:-మేలు బంగారు వన్నెయౌ!మేని ప్రభల
పట్టు పుట్టాల వెలుగుల భళె యనంగ
సింహ వాహిని నెపుడు పూజించు వాడె
మహిమ భూపతి కాగల్గు మంత్ర శక్తి!! 3.
శ్లో:-మాతులుంగం గదా ఖేటే పాన పాత్రంచ భిభ్రతీ!
నాగం లింగంచ యోనించ. భిభ్రతి నృప మూరథనిః!! 4.
తే,గీ:-గదయు,బాణంబు--ఫలమును కార్ముకంబు!
పాన పాత్రయు ధరియించి--పాణులందు!
నాగ--లింగ--యోన్యాదు లనం బరంగు!
ముద్రలను దాల్చు-- శ్రీ లక్ష్మి ముక్తి గొలుతు!! 4.
ఓం--శ్రీమ్--హ్రీమ్--ఐమ్.
శ్లో:-వందే లక్ష్మీం,పరశివ మయీం శుద్ధ జాంబూనదా భామ్!
తేజోరూపాం కనక వసనాం సర్వ భూషో జ్జ్వలాంగీమ్!
బీజాపూరం కనక కలశం హేమ పద్మం దధానా!
మాద్యాం శక్తిం సకల జననీం సర్వ మాంగళ్య యుక్తామ్!! 5.
ఓం--శ్రీమ్--హ్రీం--ఐం,
తే,గీ;-శుద్ధ జాంబునద ప్రభల శోభ లలర!
కనక వసనావృత శుభాంగి--కమల నేత్రి!
సర్వ భూషోజ్వలాంగి యో!సత్వ రూపి!
బీజ రూపిణి తేజస్వి--విశ్వ జనని!
తే,గీ;-హేమ పద్మంబు కలశంబు ప్రేమ దాల్చి!
సంయ మీంద్రుల పూజల సరగు నట్టి!
శక్తి రూపిణి శుభ దాయి--ముక్తి నిమ్మ!
వందనంబిదె మహలక్ష్మి--పరశివ మయి!! 5.
శ్లో:-శ్రీమత్సౌభాగ్య జననీం స్తౌమి లక్ష్మీం సనాతనీమ్!
సర్వ కామ ఫలా వాప్తి సాధనైక సుఖావహమ్! 6.
తే,గీ:-శ్రీలు గల మాత సిరులిచ్చు చిర విరాజి!
సర్వ కామ ఫలావాప్తి--సాధనమ్ము
నొసగు పావని భక్తుల నోము పంట!
భాగ్య లక్ష్మిని భజియింతు పరమ భక్తి! 6.
శ్లో:-స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరిత మానసః!
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీమ్!! 7.
తే,గీ:-దేవ దేవేశి శ్రీ లక్ష్మి--దివ్య రూప
ప్రేరణంబగు చిత్తాన బ్రీతి నిండ!
తల్లి యాజ్ఞను తలదాల్చి--తప్ప కెపుడు
భజన సేతును భవహర వరము గోరి! 7.
శ్లో:-సమస్త సంపత్సుఖదాం మహాశ్రియమ్!
సమస్త కల్యాణ కరీం మహాశ్రియమ్!
సమస్త సౌభాగ్య కరీం మహాశ్రియమ్!
భజామ్యహం జ్ఞాన కరీం మహాశ్రియమ్!! 8.
తే,గీ;-సర్వ సుఖములు నొసగెడి చారు మతివి!
పరమ కల్యాణ కారిణి భాగ్య రాశి!
భాగ్య దాయిని భార్గవి పరశివ మయి!
జ్ఞాన కారిణి సిరి గొల్తు సతత మేను!! 8.
శ్లో:-విజ్ఞాన సంపత్సుఖదాం మహా శ్రియమ్!
విచిత్ర వాగ్భూతి కరీం మనో రమామ్!
అనంత సౌభాగ్య సుఖ ప్రదాయినీమ్!
నమామ్యహం భూతి కరీం హరి ప్రియామ్!! 9.
తే,గీ:-శాస్త్ర సంపత్తి నిలయమౌ. చారు మతిని!
చిత్ర వాగ్భూతి కారిణి విష్ణు పత్ని
భూతి నర్ధించి సతతంబు భువన మాత
భాగ్య సుఖ దాయి భగవతి భజన సేతు!! 9.
శ్లో:-సమస్త భూతాంతర సంస్థితాత్వమ్!
సమస్త భక్తేశ్వరి విశ్వ రూపే!!
త్వం నాస్తి చాన్యద్వ్యతి రిక్త వస్తు!
త్వత్పాద పద్మం ప్రణమా మ్యహం శ్రీః!! 10.
తే,గీ:-సకల భూతాంతర స్థిత చంద్ర వదన!
విశ్వ రూపిణి భక్తుల వినుతు లందు!
తల్లి నీకంటె పెచ్చగు దైవ మేది?
చరణ కమలాల నర్చింతు సతత మేను! 10
శ్లో:-దారిద్ర్య దుఃఖౌఘ!తపో నిహన్త్రీ!
త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ!!
దీనార్తి విచ్ఛేదన హేతు భూతైః!
కృపా కటాక్షే రభిషీంచ మాం శ్రీః!! 11.
తే,గీ:-దుఃఖ దారిద్ర్య తమి నెల్ల తొలగ జేసి!
నీదు పాదారవిందంబు పాదు కొల్పి
దీన రక్షకి దయ జూపి దివ్య దృష్టి
కావ రావమ్మ నన్నెంతొ కనికరముగ!! 11.
శ్లో:-విష్ణు స్తుతి వరాం లక్ష్మీం స్వర్ణ వర్ణ స్తుతి ప్రియామ్!
వరదా భయదాం దేవీం వందే త్వాం కమలే క్షణే!! 12.
తే,గీ:-విష్ణు సంకీర్తనాసక్తి వరలు తల్లి!
స్వర్ణ వర్ణాన వెలుగొందు సగర తనయ!
వరము లొసగెడి గుణ రాశి!పద్మ గంథి!
దేవి!వందనంబిడు నన్ను, గావు మమ్మా!! 12.
శ్లో:-అంబ ప్రసీద కరుణాసు దయార్ద్ర దృష్ట్యా!
మాం త్వత్కృపా ద్రవిణ గేహ మిమం కురుష్వ!!
ఆలోకయ ప్రణత హృద్గత శోక హంత్రీ!
త్వత్పాద పద్మ యుగళం ప్రణమామ్యహం శ్రీః !! 13.
తే,గీ:-వర దయార్ద్ర దృష్టి ప్రసరణమున!
ద్రవిణ సంపద గృహమందు ప్రభల నిమ్మ!
ప్రబల హృద్గత శోకమున్ బాయ జేసి!
కావ రా వమ్మ!దివి నుండి కమల నిలయ!! 13.
శ్లో:-శాంత్యై నమోస్తు శరణాగత రక్షణాయై!
కాంత్యై నమోస్తు కమనీయ గుణాశ్రయాయై!!
క్షాంతై నమోస్తు దురితక్షయ కారణాయై!
ధాత్రై నమోస్తు ధన ధాన్య సమృద్ధి దాయై!! 14.
తే,గీ:-శరణు జొచ్చిన రక్షించు శాంత రూపి!
కాంతి రూపిణి సుగుణాలవాల తల్లి!
పాప హారిణి యోరిమి బరగు మాత!
పరమ దన దాన్య దాయికి వందనమ్ము!! 14.
శ్లో:-శక్తై నమోస్తు శశి శేఖర సంస్థి తాయై!
రత్యై నమోస్తు రజనీకర సోదరాయై!
భ క్తై నమోస్తు భవ సాగర తారకాయై!
మత్యై నమోస్తు మథు సూదన వల్లభాయై!! 15.
తే,గీ:-చంద్ర శేఖరు భజియించు శక్తి వీవు!
చంద్ర సోదరి రతి రూపి--చంద్ర వదన!
భక్తి రూపిణి తారణి భాగ్య నిలయ!
విష్టర శ్రవు పత్ని నే!వినుతి జేతు!! 15.
శ్లో:-లక్ష్మై నమోస్తు శుభ లక్షణ లక్షితాయై!
సిద్ధ్యై నమోస్తు సుర సిద్ధ సు పూజితాయై,
ధృత్యై నమోస్తు మమ దుర్గతి భంజనాయై!
గత్యై నమోస్తు వర సద్గతి దాయకాయై!! 16.
తే,గీ:-శుభ గుణాశ్రిత!శ్రీ లక్ష్మి సురుచిరాంఘ్రి!
సిద్ధ ,సుర పూజ్య మాత!సు సిద్ధి దాయి!
నాదు దుర్గతి బో జేసి నన్ను గాచి!
గతిని ధృతి నీయ,ప్రార్ధింతు కరము భక్తి!! 16.
శ్లో:-దేవ్యై నమోస్తు దివి దేవ గణార్చి తాయై!
భూత్యై నమోస్తు భువనార్తి వినాశ నాయై!
దాంత్పై నమోస్తు ధరణీ ధర వల్లభాయై!
పుష్టై నమోస్తు పరుషోత్తమ వత్సలాయై!! 17.
తే,గీ:-దేవ గణ సేవ లందెడు దేవి!నీవు!
భువన బాధలు తొలగించు భూతి వీవు!
శేషశాయికి సతివమ్మ!దాంతి నీవు!
వత్సలంబున గావుమా!వందనమ్ము!! 17.
శ్లో:-సుతీవ్ర దారిద్ర్య తమోప హన్త్ర్యై
నమోస్తు సర్వ భయాప హన్త్రై!
శ్రీ విష్ణు వక్షస్థల సంస్థితాయై!
నమో నమో సర్వ విభూతి దాయై!! 18.
తే,గీ:-తీవ్ర దారిద్ర్య తమహంత్రి దివ్య వాసి!
విష్ణు వక్ష స్థల విరాజి విశ్వ మాత!
సర్వ భయములు దొలగించు పర్వ రూపి!
భూతి దాయికి వందన సేతు నెపుడు!! 18.
శ్లో:-జయతు జయతు లక్ష్మీ!లక్షణాలంకృతాంగీ!
జయతు జయతు పద్మా!పద్మ సద్మాభి వన్ద్యా!
జయతు జయతు విద్యా విష్ణు వామాంక సంస్థా!
జయతు జయతు సమ్య సంపత్క్సకర శ్రీః!! 19.
తే,గీ:-లక్షణా లంకృతాంగి శ్రీ లక్ష్మి జయము!
పద్మ సద్మాభి వంద్యకు బహుళ జయము!
విష్ణు వామాంక సంస్థిత! విద్య ! జయము!
సర్వ సంపత్కర శ్రీ కి! సర్వ జయము!! 19.
శ్లో:-జయతు జయతు దేవీ దేవ సంఘాభి పూజ్యా
జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా,
జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన వేద్యా
జయతు జయతు సత్యా సర్వ భూతాంతరస్థా!! 20.
తే,గీ:-దేవ సంఘాభి పూజ్య,శ్రీ దేవి జయము!
భార్గవీ భాగ్య రూపకు భద్ర జయము!
నిర్మల జ్ఞాన వేద్యకు నిత్య జయము!
సర్వ భూతాంత రహితకు!సర్వ జయము!! 20.
శ్లో:-జయతు జయతు రమ్యా రత్నగర్భాంత రస్తా!
జయఠు జయతు శుద్ధా శుద్ధ జాంబూన దాభా!!
జయతు జయతు కాంతా కాంతి మద్భాసితాంగీ!
జయతు జయతు శాంతా!శీఘ్ర మాగచ్ఛ సౌమ్యే!! 21.
తే,గీ:-రత్న గర్భాంత రస్థ యోరమ్య!జయము!
శుద్ధ జాంబూ నద విభాసి!శుద్ధ జయము!
కాంతి మద్భాసితాంగి శ్రీకాంత జయము!
వరము లొసగంగ నరుదెంచు వనజ జయము!! 21.
శ్లో:-యస్యాః కలాయాః కమలోద్భవాద్యాః!
రుద్రశ్చ శక్ర ప్రముఖాశ్చ దేవాః!
జీవన్తి సర్వేపి సశక్తి యస్తే!
ప్రభుత్వ మాప్తాః!పర మాయు షస్తే! 22.
తే,గీ:-కమల నీదగు మహనీయ కళల నొకటి!
నలువ, రుద్ర, శక్ర, వీరులు!సరయ నంది!
దేవ పదవులు--నాయువు,దివ్య తేజ
మమర భాసిలు చుండిరి!మహిత కీర్తి!! 22.
ముఖ బీజమ్
ఓం--హ్రాం--హ్రీం--అం--ఆం--యం--రం--లం--వం
శ్లో:-విలేఖ నిటలే విధ ర్మమ లిపిం విసృజ్యా న్తరమ్
త్వయా విలిఖితవ్య మేతదితి తత్ఫల ప్రాప్తయే,
తదన్తిక ఫలంస్ఫుటం కమల వాసిని శ్రీ రిమాం
సమర్పయ సముద్రికాం సకల భాగ్య సం సూచికామ్!! 23.
ముఖ బీజమ్
ఓం--హ్రాం--హ్రీం---అం--ఆం--యం--రం--లం--వం
తే గీ:-బ్రహ్మ రాసిన రాతతో వదల బడిన
స్థలము నింపుమ తిరముగా సదమలమగు!
సకల సౌభాగ్య చిహ్నాల సత్వరముగ
లిపిని మార్చుమ!శ్రీ లక్ష్మి సిరు లెసంగ!! 23.
పాద బీజమ్
ఓం--అం--ఆం--ఈం--ఏం--ఐం--కం--లం--రం,
శ్లో:-కలయాతే యథా దేవీ జీవన్తి సచరా చరాః
తథా సంపత్కరీ లక్ష్మీ సర్వదా సంప్రసీదమ్!! 24.
పాద బీజము
ఓం--అం--ఆం--ఈం--ఏం--ఐం--కం--లం--రం,
తే,గీ:-సర్వ చరాచర జగము సాదరముగ!
నొక్క కళతోనె విలసిల్లె!చక్క నమ్మ!
దేవతా స్వరూపిణి వీవు తేజ మలర!
కమల! ముందర నిలుపుమా!కలుము లమ్మ!! 24.
శ్లో:-యధా విష్ణు ర్దృవం నిత్యం స్వ కలాం సన్నివేశయత్!
తధైవ స్వ కలాం లక్ష్మీ మయి సమ్య క్సమర్పయ, 25.
తే,గీ:-భజన జేసెడి నా దగు భాగ్య మనగ!
హరియు మురియంగ నొక కళ నమర జేసి!
తల్లి నీదగు భక్తుని దయను జూపి!
కళయు నొక్కటి ప్రసరించి గావు మమ్మ! 25.
శ్లో:-సర్వ సౌభాగ్య ప్రదే దేవి!భక్తానా మభయ ప్రదే!
అచలం కురు యత్నేన!కళాంమయి నివేశ్యతామ్!! 26.
తే,గీ:-సర్వ భాగ్య ప్రదాయిని,జయతు శుభాంగీ!
అభయ దాయిని భక్తుల నాదు కొనగ!
నీదు కళనుంచి నాయందు నిత్య యత్న
సాధ్య సంపచ్కరి వగుమ!చంద్ర వదన,!! 26.
శ్లో:-మాదా దాస్త మత్ఫాలే పరమ లక్ష్మీ స్ఫుట కళా
సదా వైకుంఠ శ్రీ ర్ని వసతు కళామే నయనయోః!
వసే త్సత్యే లోకే మమ వచసి లక్ష్మీ వరకళా!
శ్రీయః శ్వేత ద్వీపే నివసతు కళామే స్వకరయోః!! 27.
తే,గీ:-పరమ పద లక్ష్మి కళనుంచి ఫాలమందు!
నాదు కనుదోయి వసియించి యనవరతము!
సత్య వాక్కులు బల్కించు!జిహ్వ నుండి!
ముదము వరలగ హృదియందు!ముక్తి నిమ్మ!! 27.
నేత్ర బీజమ్
ఓం--ఘ్రుం--ఘ్రీం--ఘ్రేం---ఘ్రైం--ఘ్రైం--ఘ్రోం--ఘ్రౌం--ఘ్రాం--ఘ్రం--ఘ్రః,
శ్లో;-తావ న్నిత్యం మమాంగేషు క్షీరాబ్దౌ శ్రీ కలా వసేత్!
సూర్యా చంద్ర మసౌ యావత్తావ లక్ష్మీపతి శ్రియమ్!! 28.
నేత్ర బీజము,
ఓం--ఘ్రాం--ఘ్రీం--ఘ్రైం--ఘ్రైం--ఘ్రోం--ఘ్రోం--ఘ్రౌం--ఘ్రాం--ఘ్రిం--ఘ్రః,
తే,గీ:-క్షీర సాగర మందలి. శ్రీ కళ,యదె
నాదు సర్వాంగముల యందు నలము కొనియె!
సూర్య చంద్రులు!వెలగిచ్చు చుండు దనుక!
లక్ష్మి,విష్ణులు సర్వాంగ!రక్ష ! గూర్త్రు! 28.
శ్లో:-సర్వ మంగళ సంపూర్ణా!సర్వైశ్వర సమన్వితా!
అద్యాది శ్రీ మహా లక్ష్మీః!త్వత్కలా మయి తిష్టతు!! 29.
తే,గీ;-సర్వ మంగళ సంపూర్ణ!జయ వినోది!
సంపదల తల్లి శ్రీ లక్ష్మి!సాధు మతిని!
కోరు చుందును సర్వదా!కోర్కె మీర!
లక్ష్మి కళ నింపి రక్షింప!లా లనమున!! 29.
శ్లో:-అజ్ఞాన తిమిరం హన్తుం!శుద్ధ జ్ఞాన ప్రకాశికాః!
సర్వైశ్వర్య ప్రదా మేస్తు త్వత్కలా మయి సంస్థితా!! 30.
తే,గీ:-జ్ఞాన రాహిత్య తిమిరంబు కాన నీక!
జ్ఞాన దీపంబు విలిగించు దాన వమ్మ!
కామ్య ఫల సిద్ధి గూర్చుచు!కమ్మ నైన!
కళను నాయందు నింపుమా!కళల తల్లి!! 30.
శ్లో:-అలక్ష్మీం హరతు క్షిప్రం తను స్సూర్య ప్రభా యధా!
వితనోతు మమ శ్రేయః!త్వత్కలా మయి సంస్థితా!! 31.
తే,గీ:-దివస నాథుడు!తిమిరంబు దవులు నటుల!
నాదు మనసున నిండిన నీదు కళయు!
పార ద్రోలును దారిద్ర్య బంధములను!
సిరుల పెంపును గూర్చును !శీఘ్రముగను!! 31.
శ్లో:-ఐశ్వర్య మంగళో త్పత్తిః త్వత్కలాయాం విధీయతే!
మయి తస్మాత్కృతార్థోస్మి!పాత్ర మస్మిస్థితే స్థవ!! 32.
తే,గీ:-మంగళాకర మైనట్టి మహిత కళయు
నిండు నెడదను సంపద నింపె గాన!
ధన్యుడను సుమ్మి!మాయమ్మ!తగుదు నేను!
నీదు సత్కృప నందంగ! నిక్క మమ్మ!! 32.
శ్లో:-భవదావేశ భాగ్యార్హో భాగ్యవానస్మి భార్గవి!
త్వత్ప్రసాదా త్సవిత్రోహం లోక మాత ర్నమోస్తుతే!! 33.
తే,గీ:-భృగుని వంశోద్భవమున భార్గ వగుచు
వచ్చు నంతనె సిరు. లిచ్చి వరలు తల్లి!
కనుల నిను గాంచు ధన్యుండు!ఘనయశుండు!
వందనం బందు కొను మమ్మ! యిందు వదన!! 33.
శ్లో:-పునాసిమాం త్వత్కలయైవ యస్మా
దత స్సమాగత్త మమాగ్ర తస్త్వమ్!
పరం పదం శ్శ్రీర్భవ సు ప్రసన్నా!
మయ్యచ్యుతేన ప్రవిశాద లక్ష్మీ,!! 34.
తే,గీ:-పరమ పదమున వసియించు భాగ్య రాశి!
పరమ సత్కల ప్రభవింప!పావ నంబు
మదియు కాగను,వర్ఛస్సు,మహిమ పెరిగె!
నన్ను విడనాడ కుండుమా!నలిన నేత్రి!! 34.
శ్లో:-శ్రీ వైకుంఠ స్థితే లక్ష్మీ!సమాగచ్ఛ మమాగ్రతః!
నారాయణేన సహమాం!కృపా దృష్ట్యా వ లోకయ,!! 35.
తే,గీ:-పరమ వైకుంఠ సీమను బరగు లక్ష్మి!
కలిసి నారాయణుండును!కదలి రండు!
కరుణ తోడుత కాపాడి కనికరమున!
పూజ లందుడి సతతంబు!పూజ్యు లార!! 35.
శ్లో;-సత్యలోక స్థితే లక్ష్మీ మమాగచ్ఛ సన్నిధిం
వాసు దేవేన సహితా ప్రసీద వరదా భవ!! 36.
తేగీ:-సత్య లోక స్థిత యైన జయ లలామ!
సత్వ రంబున శ్రీహరి సరస నడువ
కదలి రా రండు!నను గావ!కనికరమున!
దయను జాపుడు!మోక్షంబు తగ నొసంగి!! 36.
శ్లో:-శ్వేత ద్వీప స్థితే లక్ష్మీ!శీఘ్ర మాగచ్ఛ సు వ్రతే!
విష్ణునా సహితా దేవి !జగన్మాతః ప్రసీదం,!! 37.
తే,గీ:-శ్వేత ద్వీపాన వసియించు శ్రీ వరాంగి!
విష్ణు దేవుడు సరియని వెనుక రాగ!
వేగ రా రమ్ము!నను గావ!విశ్వ జనని!
లోక రక్షకి! వే వేగ సాకు మమ్మ!! 37
శ్లో;-క్షీరాంబుధి స్థితే లక్ష్మీ!సమాగచ్చ సమాథవే!
త్వత్కృపా దృష్టి సుథయా!సతతం మాం విలోకయ,!! 38.
తే,గీ:-క్షీర సాగర వాసినీ!కీర వాణి!
మాథవుని గూడి వేవేగ మమ్ము బ్రోవ!
రమ్మ సత్కృప సుథలతో రంజిలంగ!
దర్శనం బిచ్చి కాపాడి!తనియ జేయ!! 38.
శ్లో:-రత్న గర్భా స్థితే లక్ష్మీ!పరిపూర్ణ హిరణ్మయి!
సమాగచ్ఛ సమాగచ్ఛ స్థిత్వాశు పురతో మమ!! 39.
తే,గీ:-రత్న గర్భుని నిలయమౌ!రమ్య రమణి!
పూర్ణ, పరిపూర్ణ, హేమ సంపూర్ణ వీవు!
రమ్ము !రా రమ్ము! నను గావ రాగ రాజ్ఞి!.
విడువ కెన్నడు!సిరు లిమ్మ!వినుతు లంది!! 39.
శ్లో:-స్థీరా భవ!మహాలక్ష్మీ!నిశ్చలా!భవ నిర్మలే!
ప్రసన్న కమలే దేవి ప్రసన్న హృదయీ భవ!! 40.
తే,గీ:-నిశ్చలంబగు!మనసుతో! నిరత మీవు!
తిరము నాముందు నిలిచియు!పరమ కరుణ!
దేవి వసియింప!మాయింట!తిరము గాను!
కమల వరదాయి!వరముల గావ రమ్ము!! 40.
శ్లో:-శ్రీ ధరే! శ్రీ మహాలక్ష్మీ ! త్వదన్తస్థం మహానిధిమ్
శీఘ్ర ముద్ధృత్య పురతః ప్రదర్శయ సమర్పయ!! 41.
తే,గీ:-శ్రీని ధరియించు శ్రీ లక్ష్మి చిర విరాజి
నిధిని వెలి జేసి పైకెత్తి నింపు మమ్మ!
భక్తు నింటను హేమంబు! రక్తి! మీర!
నొరుల పూజింప నెరుగ! సిరుల తల్లి!! 41.
శ్లో:-వసుంధరే శ్రీ ఎణవసుధే వసుధోగ్ధ్రీ కృపా మయీ
త్వత్కుక్షి గత సర్వస్వం శీఘ్రం మే సం ప్రదర్శయ!! 42.
తే,గీ:-వర వసుంధర వసుధవు వసు వొసగెదు!
కరుణ నిలయవు పరిపూర్ణ కామ దాయి!
కుక్షి గతమైన ధనమును కోరు కొందు!
చూపి రక్షింప గలవమ్మ శోభలలర,!! 42.
శ్లో;-విష్ణు ప్రియే రత్న గర్భే సమస్త ఫలదే శివే!
త్వద్గ ర్భ గత హేమాదీన్ సంప్రద ర్శయ,,!! 43.
తేగీ:-విష్ణు ప్రియ వమ్మ!తేజస్వి వేద మంత్ర
పఠన సాధ్యవు! త్వద్గర్భ భాగ్య మనెడి
నిండు ధనరాశి వెలి జేసి,నిన్ను దలచు
భక్త వరునకు జూపించి వరలు మమ్మ!! 43.
శ్లో;-రసాతల గతే లక్ష్మీ శీఘ్ర మాగచ్ఛ మే పురః
న జానే పరమం రూపం మాతర్మే సంప్రదర్శయ!! 44.
తే,గీ:-వర రసాతల గత వమ్మ! పద్మ గంథి!
శీఘ్ర మరుదెంచి నా చెంత నిలువు మమ్మ!
దివ్య మంగళ రూపంబు!భవ్య మమ్మ!
దర్శనం బిమ్మ! శ్రీ లక్ష్మి ! దలప నొరుల!! 44.
శ్లో:-ఆవిర్భవ మనోవేగా చ్ఛగ్ర మా గచ్ఛ మే పురః!
మావత్స భైరి హేత్యుక్త్వా కామం గౌరివ రక్షమాః!! 45.
తే,గీ:-భక్త మందార వరదాయి ముక్తి కాంత!
వర మహా లక్ష్మి వేవేగ వచ్చి నిలిచి!
వత్స!భయపడ వద్దని బల్కి నన్ను!
కామ ధేనువు భంగిని గావు మమ్మ!! 45.
శ్లో:-దేవి శీఘ్రం మమాగచ్ఛ
ధరణీ గర్భ సం స్థితే!
మాత స్త్వ ద్ధృత్య భృత్యోహం
మృగయే త్వాం కుతూహలాత్,!! 46.
తే,గీ:-ధరణి గర్భాన నున్నట్టి తరుణి లక్ష్మి!
కాన రాగదె? నిను గోరి కరము భక్తి!
వెతుకు చుంటిని సతతమ్ము విశ్వమందు
తల్లి కరుణించి కాపాడు!దాస జనుడ!! 46.
శ్లో:-ఉత్తిష్ట జాగృహి మయి సము త్తిష్ట సుజా గృహీ
అక్షయ్యాన్ హేమ కలశాన్ సువర్ణేన సు పూజితాన్!! 47.
తే,గీ:-జాగ రూకత గల తల్లి జాగదేల?
లెమ్ము! లే లెమ్ము! నా భక్తి వమ్ము గాక!
నక్షయంబగు బంగారు నాణెములను
నిండు తేజస్సు వెలయంగ నింపు మమ్మ!! 47.
శ్లో:-నిక్షేపాన్ సమాకృష్య సముద్ధృత్వ మమా గ్ర్రతః!
సమున్న తననా భూత్వా సమ్యగ్దేహి ధరా తలాత్!! 48.
తే,గీ:-లెమ్ము!నాయందు వసియించి!కమ్మ నైన
పుడమి నిధులను వెలిజేసి పూజ్యమైన
స్వర్ణ కలశము నింపుమా!సత్వరముగ!
నవ్వు మోముతొ! వరలక్ష్మి!నలిన నేత్రి!! 48.
శ్లో:-మత్సన్నిధిం సమా గచ్ఛ మదాహిత కృఫా రసా,
ప్రసీద శ్రేయసా దోగ్ధ్రీ లక్ష్మీర్మే నయనాగ్రతః!! 49.
తే,గీ:-నాదు హితకారిణివి యన పాదు కొన్న
భక్త వరునికి దయ జూపి--భజన లంది!
శుభ పరంపర లందించి--విభవ మలర
కమల! ముందుండి నడిపించు వినుతి లంది!! 49.
శ్లో:-అత్రోపవిశ్య లక్ష్మీ త్వం స్థిరాభవ హిరణ్మయీ!
సుస్థిరా భవ సంప్రీత్యా ప్రసన్నా వరదా భవ!! 50.
తే,గీ:-స్థీరము సంసార సాగర సేత వగుచు!
భమిడి ఛాయలు నొడలెల్ల పరిఢ విల్ల!
పూజ లందుచు స్థిరముగా!పుణ్య దాయి!
నిలిచి పోవమ్మ!మాయింట!నిండు బుద్ధి!! 50.
శ్లో:-అనీతాం స్తు త్వయా దేవి నిథిర్మే సంప్రదర్శయ
అన్య క్షణేన సహసా దత్వా సంరక్షమాం సదా!! 51.
తే,గీ:-మాత నీ చేత తేబడ్డ మహిత భాగ్య
నిథుల నేవత్తు నాముందునిలిపి చూపి,
సహజ సుందర రూపాన సత్వరంబు
ఇచ్చి రక్షించ వలె నమ్మ!నిచ్ఛ దీర!! 51.
శ్లో:-మయి తిష్ట తథా నిత్యం యదేంద్రాందిషు తిష్టసి
అభయం కురుమే దేవి మహా లక్ష్మీ నమోస్తుతే!! 52.
తేగీ:-ఇంద్రు డాదిగ సురలందు నిలుచు పగిధి!
చింతలను బాపి నా చెంత సుంత నిలిచి!
మానసంబున తిరముగా!మసలు మమ్మ!
అభవ దాయిని నీవమ్మ!శుభ వరాళి!! 52.
శ్లో:-సమాగచ్ఛ మహా లక్ష్మీ శుద్ధ జాంబూనద స్థితే,
ప్రసీద పురతః స్థిత్వా ప్రణతం మాం విలోకయ, 53.
తే,గీ:-మేలి తపనీయ వాసివి,! హే! లతాంగి!
సుప్రసన్నవు గావమ్మ!జ్యోత లివియె!
అందు కోవమ్మ! నాచెంత యలరు మమ్మ!
నన్ను కరుణతొ జూడమ్మ!నిన్ను గొలుతు!! 53.
శ్లో:-లక్ష్మీర్భువం గతా భాసి యత్ర యత్ర హిరణ్మయీ,
తత్ర తత్ర స్థితాత్వం మే తవ రూపం ప్రదర్శయ,!! 54.
తే,గీ:-భమిడి గత వయ్యు భాసించు!భూ రమణివి!
భమిడి గల దీవు లందున! బరగు దాన!
నీదు మంగళ రూపంబు నందు కనులు?
కనులు గద యమ్మ!వేఱొండు!కనులు గావు!! 54.
శ్లో:-క్రీడన్తి బహుధా భూమౌ!పరిపూర్ణ కృపామయి
మమ మూర్థనితే హస్తా మవి లంభిత మర్వయ!! 55.
తే,గీ:-లెక్క మీరిన రూపాల చక్క నమ్మ!
నాట లాడుదు వరలక్ష్మి నాదు శీర్ష
మందున కరముల నునిచి!మహిమ గావ!
కోరుకొందును సిరు లమ్మ!దారి చూపు,!! 55.
శ్లో:-ఫల భాగ్యోదయే!లక్ష్మీ!సమస్త పుర వాసిని,
ప్రసీదమ్ మహా లక్ష్మీ!పరి పూర్ణ మనోరథే!! 56.
తే,గీ:-సఫల భాగ్యోదయవు చంద్ర !చంద్ర రూప!
ఇందిరా!యిందు శీతల,యిందు వదన!
భూవన వాసివి! పరిపూర్ణ! పూజ్య మాత!
సుప్ర సన్నవు గావమ్మ! సు ప్రసీద!! 56.
శ్లో:-అయోధ్యాదిషు సర్వేషు నగరేషుసమాస్థితే
వైభవై ర్వివిధైర్యుక్తే సమాగచ్ఛ ముదాన్వితే!! 57.
తే,గీ:-విశ్వ జననివి పుష్టివి!విమల నీవు!
ప్రీతి పుష్కరిణివి శాంత!విష్ణు పత్ని!
వర,అయోధ్యాదిషు నగర నివాసి!మాత!
విభవ దాయివి!గరుణింప!వేగ రమ్ము!! 57.
శ్లో:-సమాగచ్ఛ! సమాగచ్ఛ! మమాగ్రే! భవ సుస్థిరా,
కరుణాకర! నిష్పన్న! నేత్ర ద్వయ విలాసిని
సన్ని ధత్స్వ మహా లక్ష్మీ త్వత్పాణిం మమ మస్త కే!! 58.
తే,గీ:-బ్రహ్మ, విష్ణు, శివాత్మిక!భర్గు ననుజ!
కాల విజ్ఞాన సంపన్న కాళి దుర్గ!
కరుణ రసభర నయనాల సురలు మెచ్చ!
గావ రావమ్మ వేవేగ!కల్ము లమ్మ!! 58.
శ్లో:-కరుణా సుథయా మాం త్వ మభిషి చ్య స్థిరం కురు!! 59.
తేగీ:-భువన మోహిని భవదీయ పూర్ణ మైన
దివ్య మంగళ రూపంబు!దిన దినంబు!
తలచి వర్తించు నాదగు తపన గాంచి!
కరుణ సుథలను చిందించి!గావు మమ్మా!! 59.
శ్లో:-సర్వ రాజ్య గృహే!లక్ష్మీ!సమాగచ్ఛ బలాన్వితే!
స్థిత్వాశు పురతో మేథ్య ప్రసాదే నాభయం!కురు !! 60.
తే,గీ:-భుజ బలంబును జూపించి పుడమి నేలు
రాజ,భవనాల వసియించు!రాజ్య లక్ష్మి!
చిన్మ యానంద తారక జీవ నమ్ము!
భక్తులకు నిచ్చి కాపాడ! వడిగ రమ్ము!! 60.
శ్లో:-సాదరం మస్తకే హస్తం మమత్వం కృపయార్పయ
సర్వ రాజ్య స్థితే లక్ష్మీ త్వత్కలా మయి తిష్టతు, 61.
తే,గీ:-నాదు మస్తక మందున సాదరముగ!
నభయ హస్తంబు నుంచియు!విభవ మలర!
రాజ్య లక్ష్మివి! కళ నొండు రంజి లంగ!
నుంచి కాపాడ వలె నమ్మ!యుద్ధరించి,!! 61.
శ్లో:-ఆద్యాది శ్రీ మహాలక్ష్మీ!విష్ణు వామాంక సంస్థితే!
ప్రత్యక్షం కురుమే రూపం!రక్షమాం!శరణాగతమ్!! 62.
తే,గీ:-ఆది దేవత శ్రీ లక్ష్మి యార్తి హారి!
విష్ణు వామాంక వర్తియౌ!విశ్వ మాత!
మనసు నిండైన మా లక్ష్మి!ధన విరాజి!
శరణు,రక్షింప రా వమ్మ!వరము లిచ్చి!! 62.
శ్లో:-ప్రసీదమే!మహా లక్ష్మీ!సుప్రసీద!మహా శివే!,
అచలా భవ!సు ప్రీతా! సుస్థిరా భవ మద్గృహే!! 63.
తే,గీ:-దివ్య తేజో విలాసిని! దివి విహారి!
సిరుల జిలుగుల! వెలుగొందు! సిరుల తల్లి!
సుగుణ గుణ గణ వరదాయి!సుందరాంగి!
నిలిచి పో వమ్మ! మాయింట! నిన్నె దలతు!! 63.
శ్లో:-యావత్తిష్టన్తి వేదాశ్చ యావ చ్ఛంద్ర దివాకరా
యావద్విష్ణుశ్చ యావత్త్వం తావత్కురు కృపామయి!! 64.
తే,గీ:-వేద వేదాంగములు భువి వెలుగు దనుక!
సూర్య చంద్రులు తేజంబు సోకు దనుక!
వరలు సంసార సుఖములు!పరమ కరుణ!
నుండి పోవమ్మ!నాయింట నుత్సుకమున!! 64.
శ్లో:-చాంద్రీ కళా యధా శుక్లే వర్ధతే సా దినే దినే!
తథా దయాతే మయ్యేవ వర్థతా మభి వర్థతామ్!! 65.
తే,గీ:-శుక్ల పక్షాన చంద్రుండు శుద్ధ మగుచు
కళల పెంపున వెలుగొందు కరిణి నీవు
దిన దినంబును దయ పెంచి దివ్యమైన
జీవ నంబును గూర్చుమా!సిరుల తల్లి!! 65.
శ్లో:-యథా వైకుంఠ నగరే యథావై క్షీర సాగరే,
తథా మద్భవనే తిష్ట స్థిరం శ్రీ విష్ణునా సహ, 66.
తే,గీ:-పరమ వైకుంఠ పురమున బరగె దెటులొ?
పాల కడలిలొ నెటు లుంటి వటుల నీవు
విష్ణు దేవుని తోడుత విమల రూపి
వచ్చి వసి యింపు!మాయింట!వరము లిచ్చి!! 66.
శ్లో:-యోగినాం హృదయే నిత్యం యథా తిష్టసి విష్ణునా,
తథా మద్భవనే తిష్ట ! స్థిరం శ్రీ విష్ణునా సహా!! 67
తే,గీ:-యోగ వర్యుల హృదయాన నొదిగి,విష్ణు
సహిత వయ్యును వర్తించు చందమునను
నిత్య నిర్మల చిత్తాన! నిన్ను గొలుచు
నాదు గేహాన నుండుమా! నళిన నేత్రి!! 67.
శ్లో:-నారాయణస్య హృదయే భవతీ యథాస్తే
నారాయణోపి హృత్కమలే యథాస్తే
నారాయణస్త్వమపి నిత్య విభూతథైవ
తౌ తిష్టతాం హృది మమాపి దయాన్విత శ్రీ!! 68.
తే,గీ:-వర పరాత్పరు హృదయాన వరలె దీవు!
పరమ పావని నీలోన బరగు హరియు!
సిరుల నొసగుచు మీ జంట!చెల్వ మమర!
దయను మదియందు వసియింప!దలతు నెపుడు!! 68.
శ్లో:-విజ్ఞాన వృద్థిం హృదయే కురుశ్రీః!
సౌభాగ్య వృద్ధిం కురుమే గృహేశ్రీః!!
దయాసువృష్టిం కురుతాం మయిశ్రీః!
సువర్ణ వృద్ధిం కురుమే కరే శ్రీః!! 69.
తే,గీ:-విశ్వ విజ్ఞాన మొందియు!విశ్వ మాత!
భాగ్య సంపత్తి పెంపుమా!పద్మ నిలయ!
కరుణ నాయందు జూపించి వరము లిచ్చి!
కనక వర్షంబు కురిపించి గావు మమ్మ!! 69.
శ్లో:-నమాంత్వ జేథా శ్రిత కల్ప వల్లి,
సద్భక్త చింతా మణి కామథేనుః
నమాం త్యజేథా భవ సుప్రసన్నా
గృహే కళ త్రేషు చ పుత్ర వర్గే!! 70.
తే,గీ:-ఆశ్రయించిన కాపాడు నమర తరువు
భక్త చింతామణివి నీవు!భాగ్య రాశి!
కామథేనువు నీ వమ్మ!గావ రమ్మ!
చిరము వసియించి కాపాడు!పరమ కరుణ!! 70.
కుక్షి బీజమ్
ఓం--అం--ఆం--ఈం--ఏం--ఐం,
శ్లో:-ఆద్యాది మాయే త్వ మజాండ బీజం
త్వ మేవ సాకార నిరాకృతీత్వం,
త్వయా ధృత శ్చౌజ్జ. భవాండ సంజ్ఞ
శ్చిత్రం చరిత్రం తవ దేహి విష్ణోః!! 71.
కుక్షి బీజము
ఓం--అం--ఆం--ఈం--ఏం--ఐం,
తే,గీ:-ఆది మాయా స్వరూపిణి నాది మాత!
బీజ మీవజాండమునకు!విష్ణు పత్ని!
వర నిరాకార సాకార వనజ వీవు!
చరిత వర్ణింప చిత్రమై వరలు గాదె!! 71
శ్లో:-బ్రహ్మ రుద్రాదయోః దేవాః
వేదాశ్చాపి న శక్నుయుః!
మహిమానం తమస్తోతుం
మందో హం శక్నుయాం కథమ్!! 72.
తే,గీ:-బ్రహ్మ రుద్రాది దేవతల్! ప్రదిత యశులు
వేద కర్తలు భర్తలు వేద విధులు
నీదు మహిమను తెలియంగ నేర రమ్మ!
మంద భాగ్యుండ!నేనెంత?మహిమ గనగ!! 72.
శ్లో;-అమృ తద్వత్స వాక్యాని సూక్తా సూక్తాని యానిచ
స్వీకురు సర్వజ్ఞే దయాళు త్వేన సాదరమ్!! 73.
తే,గీ:-తల్లి బిడ్డని మాటల నెల్ల వినియు
ఒప్పు తప్పుల నన్నిటి నొప్పు గాను
దలచు,నాతల్లి వీవని దలియు చుందు!
తప్పు మన్నించి గావుమా!ధర్మ బుద్ధి!! 73.
శ్లో:-భవన్తీం శరణం గత్వా కృతార్థాస్స్యుః పురాతనాః!
ఇతి సం చిన్త్య మనసా త్వా మహం శరణం వ్రజే!! 74.
తే,గీ:-నీదు కరుణంబు నొందియు నిశ్చయముగ!
చింతలను బాసి సుఖమయ జీవనములు
పూర్వు లొందిరి మాతరో!పుణ్య ఫలము!
కరణు !రక్షింపు వైష్ణవీ! సిరుల మాత!! 74.
శ్లో:-అనంతా నిత్య సుఖిన త్వద్భక్తా స్త్వత్పరాయణః
ఇతి వేద ప్రమాణాద్ధి దేవిత్వాం శరణం వ్రజే !! 75.
తే,గీ:-భక్త చూడామణులు దొల్లి భక్తి మీర!
నిత్య సుఖములు నొందిరి!నిన్ను గొలిచి!
వేద హితమైన మాటిది! వినుతి గనుమ!
రక్ష కివి గాన!రక్షింప రమణి రమ్ము!! 75.
శ్లో:-తవ ప్రతిజ్ఞా మద్భక్తా ననశ్యన్తీ త్యపి క్వచిత్!
ఇతి సంచిత్య సంచిత్య,ప్రాణాన్ సంధారయా మ్యహం!! 76.
తే,గీ:-తల్లి యాజ్ఞను శీర్షాన దావ్చి భక్తి!
కొల్చు వారికి నాశంబు కలుగ దనెడు
మాట నమ్మియు భక్తితో!మసలు చుంటి!
ప్రాణములు దాల్చి యున్నాడ!పరశివ మయి!! 76.
శ్లో:-త్వదధీన స్త్వహం!మాతః! త్వత్కృ పా మయి విద్యతే,
యావ త్సంపూర్ణ కామా స్వ్యాం! తావ ద్దేహి ధయానిధే!! 77.
తే,గీ:-నీ. యధీనుడ!నిరతంబు నిన్ను గొలుతు!
తల్లి దయయుంచి నాయందు తప్ప కెపుడు!
వాంఛితార్థంబు సిద్ధించు వరకు నన్ను!
కరుణ సిరు లిచ్చి గావుమా! కమల నిలయ!! 77.
శ్లో;-క్షణమాత్రం నశక్నోమి జీవితం త్వత్కృపాం వినా
జలజాని న జీవంతి జల త్యక్త్వా జల గ్రహాః!! 78.
తే,గీ:-జలము విడనాడి జలజముల్!నిలువ నటుల
క్షణము నినువీడి జీవింప జాల నమ్మ!
దయను జూపియు గాపాడు దాన వమ్మ!
నిన్ను దలతును నిత్యంబు!నీతి మీర!! 78.
శ్లో:-యథాహి పుత్ర వాత్సల్యా జ్జననీ ప్రస్నుత స్తనీ!!
వత్సం త్వరిత మాగత్య సంప్రీణయతి వత్సలా
యది స్యాం తవ పుత్రోహం మాతా త్వం యదిమామకి!
దయా పయోధర స్తన్య!సుథాభి రభిషించి మాం!! 79.
తే,గీ:-తల్లి గోమాత వత్సను దరికి జేర్చి
పాలు నిచ్చును వాత్సల్య భావమునను
మాత దయ యను దుగ్ధముల్!మహిమ నొసగి
పెంచగా రమ్ము!సుతు నిల!ప్రేమ మీర!! 79.
శ్లో:-మృగ్యోన గుణ లేశో పి మయి దోషైక మందిరే!
పాంసూనాం వృష్టి బిందూనాం దోషా నాంచ నమే!మతిః !! 80.
తే,గీ:-వర్ష బిందు గణన వలను పడని యటుల!
రేణు వర్షంబు లెక్కింప లేని యటుల!
సుగుణ సంపత్తి లేనట్టి దుర్గుణుండ!
నాదు పాపాలు లెక్కింప! నలవి గాదు!! 80.
శ్లో:-పాపినా మహ మేకాగ్రో దయాళూనాం త్వ మగ్రణీః!
దమ నీయో మదన్యోస్తి తవ కోత్ర జగ త్రయే,!! 81.
తే,గీ:-అగ్ర పాపిని నేనమ్మ!యవని యందు!
వర దయామయి వీవమ్మ!వనజ వాసి!
మూడు లోకాల బహు పాపి మూఢ జనుడ!
శిక్ష పాత్రుడు లే డొండు? శిక్ష నిమ్మ!! 81.
శ్లో:-విధి నాహం నసృష్టశ్చేన్న శ్యేత్తవ దయాళుతా
ఆమయోవా న సృష్టశ్చేత్ ఔషధస్య వృధో దయా!! 82.
తే,గీ:-జబ్బు పుట్టింప బడకున్న జగము నందు!
ఔషధోత్పత్తి వెలుగునే?యవని యందు!
నలువ సృష్టింప కున్న చో? నన్ను భువిని!
నీ దయాళుత్వ మేవిధి?నిండు నొందు!! 82.
శ్లో:-కృపా మదగ్రజా కింతే అహం కింవా తదాగ్రజా
విచార్య దేహిమే విత్తం తవ దేవీ దయానిధే!! 83.
తే,గీ:-నేను సృష్టింప బడగానె!నీదు దయయు
సృష్టి నందెను కాబోలు!చిగురు బోణి!
దయయు సృష్టింప బడగానె దాత నన్ను!
సృష్టి జేసెనొ?దెల్పుమా? శీఘ్ర గతిని!! 83.
శ్లో:-మాతా పితాత్వం గురు సద్గతి శ్రీః!
తదేవ సంజీవన హేతు భూతా,
అన్యం న మన్యే జగదేక నాధే!
త్వమేవ సర్వం!మమ దేవి సత్యమ్!! 84.
తే,గీ:-లాల నంబున తల్లివి! లక్ష్మి మాత!
పోషణం బిచ్చు సిరి వీవు పుణ్య దాయి!
విద్య నందించు గురునిగా! వెలిగి తీవు!
నాదు సర్వము నీవందు? నమ్మ నిజము!! 84.
హృదయ బీజమ్:-
ఓం--ఘ్రాం--ఘ్రీం--ఘ్రాం--ఘ్రైం--ఘ్రౌం--ఘ్రః--హుం--పట్--
కురు కురు స్వాహా!
శ్లో:-ఆద్యాది లక్ష్మీ !భవ సు ప్రసన్నా!
విశుద్ధ విజ్ఞాన! సుఖైక దోగ్ద్రీ,!
అజ్ఞాన హంత్రీ! త్రిగుణాతి రిక్తా!
ప్రజ్ఞాన నేత్రీ! భవసు ప్రసన్నా!! 85.
హృదయ బీజము,:-
ఓం--ఘ్రాం--ఘ్రీం--ఘ్రాం--ఘ్రెం--ఘ్రౌం-- ఘ్రః--హుం--పట్--
కురు కురు స్వాహా!
తే,గీ:-శుద్ధ విజ్ఞాన సుఖ దోగ్ధ్రి బుద్ధి వమ్మ!
సుగుణ సంపత్తి నెలకొన్న భృగుని తనయ!
అమల నేత్రివి!అజ్ఞాన హంత్రి వీవు!
త్రిగుణ శాసని!నన్నేలు! దివిజ రాజ్ఞి!! 85.
శ్లో:-అశేష వాజాఢ్య మలాప హన్త్రీ!
నవం నవం సుష్టు సు వాక్య దాయినీ,
మమైవ జిహ్వాగ్ర ! సురంగ నర్తినీ!
భవ ప్రసన్నా! వదనే చ మే శ్రీః!! 86.
తే,గీ:-దు స్వరంబులు దొలగించి సుస్వర యుత
నవ నవోన్మేష మాకృతి నాదు జిహ్వ
వరల నర్తించు చుంటివే!వన మయూరి
నాదు వదనంబు ముందుండి నన్ను నడుపు!! 86.
శ్లో:-సమస్త సంపత్సు విరాజ మానా!
సమస్త తేజస్సు విభాస మానా!
విష్ణుప్రియేత్వం భవ దీప్య మానా!
వాగ్దేవతా మే వదనే ప్రసన్నా!! 87.
తే,గీ:-రాజితంబగు సౌభాగ్య రాశి వమ్మ!
పుణ్య తేజో విరాజివి పుణ్య దాయి,
దీప్య మానవు! శ్రీ విష్ణు తేజి వమ్మ!
వదన కాంతుల వాగ్దేవి వమ్మ! నీవు!! 87.
శ్లో:-సర్వ ప్రదర్శే సకలార్థ దేత్వమ్
ప్రభాసు లావణ్య దయా ప్రదోగ్థ్రీ!
సువర్ణ దేత్వం సుముఖీ భవ శ్రీః!
హిరణ్మయీ మే నయనే ప్రసన్నా,!! 88.
తే,గీ:-దర్శనీయవు!సకలార్థ దాయి వగచు!
ప్రేమ లావణ్య ప్రభలను పెంపు జేసి
స్వర్ణ రాసులు నింపుచు శాశ్వతముగ
కనుల! వెలుగును సర్వదా!కమల నిలయ!! 88.
శ్లో:-సర్వార్థదా సర్వ జగత్ప్ర సూతిః!
సర్వేశ్వరీ !సర్వ భయోప హన్త్ర్రీ,
సర్వొన్నతా త్వం సుముఖీ భవ శ్రీః!
హిరణ్మయీ మే భవ సుప్రసన్నా!! 89.
తే,గీ:-జగతి కారణ మీవమ్మ!జగము తల్లి!
సర్వ సంపద కారివి! జయవు నీవు!
దేవతాగ్రవు!భవహారి!పావనాంఘ్రి!
దర్శనం బిమ్మ మా యమ్మ!తపన దీర!! 89.
శ్లో:-సమస్త విఘ్నౌఘ వినాశ కారిణీ
సమస్త భక్తో ద్ధరణే!విచక్షణా,
అనంత సమ్మోద సుఖ ప్రదాయినీ
హిరణ్మయీ మే నయనే ప్రసన్నా!! 90.
తే,గీ:-సర్వ విఘ్న వినాశవు!చారుమతివి
భక్త రక్షకి!పూజ్యమౌ!శక్తి నీవు!
మోది సుఖ దాయి!మాథవు మురిపె మీవు!
చూపు లందున మెలుగుమా!సుందరాంగి!! 90.
శ్లో:-దేవి ప్రసీద దమనీయ తమాయ మహ్యమ్!
దేవాధి నాథ!భవదేవ! గణాది వంద్యే!
మాత స్తదైవ భవ సన్ని హితా దృశోమే!
పత్యా సమం మమ ముఖే భవసుప్రసన్నా!! 91.
తే,గీ:-హర,విరించి,భవాదులు కరము భక్తి!
పూజ సేతురు శ్రీ లక్ష్మి పుణ్య రాశి!
మాతలకు మాత!నన్నేలు!జాత రూప!
దర్శనం బిమ్మ విష్ణుతో!దనివి తీర!! 91.
శ్లో:-మావత్సభీర భయ దాన కరో ర్పిత స్తే!
మౌళీ మమేతి! మయి దీన దయాళు కంపే!
మాత స్సమర్పయ ముదా కరుణా!కటాక్ష
మాంగళ్య బీజ మహి మాన సుజన్మ మాతః.!! 92.
తే,గీ;-దీన రక్షకి వీ వమ్మ దివ్య మాత!
బాలుడా! నీ కభయ మని బల్కి!గరుణ
నభయ హస్తాలు శీర్షాన నమర నిలిపి
శుభము లలరంగ మోక్ష సు శోభలిమ్మ!! 92.
కంఠ బీజమ్--
ఓం--శ్రాం--శ్రీం--శ్రూం--శ్రేం--శ్రౌం--శ్రం--శ్రాః ,
శ్లో:-కటాక్ష ఇహ కామధృక్ తవ మనస్తు చింతామణిః.
కరస్ఫుర తరు స్సదా నవనిథి స్త్వమే వేందిరే!
భవ త్తవ దయారసో రసాయ నాంచా న్యహమ్
ముఖాంతర కలా నిధిర్వి విధ!వాంఛితార్థ ప్రదమ్!! 93.
కంఠ బీజము
ఓం--శ్రాం--శ్రీం--శ్రూం--శ్రేం--శ్రౌం--శ్రం--శ్రాః
తే,గీ:-కామదంబగు నీ చూపు కల్ప సమము!
మనసు చింతామణియు కాగ మహిమ నొప్పి!
కల్ప తరు సమ కరముల గాతు వీవు!
చంద్ర వదనవు!నిథి రూపి!వంద నమ్ము!! 93.
శ్లో:-యథా రస స్ఫర్శనతో యశోపి
సువర్ణతా స్యాత్క మలే తథా స్థే!
కటాక్ష సం స్పర్శనతో జనానామ్!
అమంగళానా మపి మంగళత్వమ్!! 94.
తే,గీ:-ఇనుము జేర్చినచో,రస మినుమడింప
గలదు,మేలి బంగారమ్ము!కరము కాంతి
తల్లి కరుణ రసము జేరి దరికి రాక
నశుభ తతులు శుభము లగు!నవని యందు!! 94.
శ్లో:-దేహీతి నాస్తీతి వచః ప్రవేశాత్
భీతో రమే త్వాం శరణం ప్రద్యే
అత స్సదాస్మి! న్న భయ! ప్రదాత్వమ్
సహైవ పత్యా మమ సన్ని దేహీ!! 95.
తే,గీ:-దేహి!దేహి!యటంచును దిరిగి నాడ!
నమ్మి నర్థించు వారికి నాస్తి యంటి!
దేహి నాస్తుల ,భీతిని, దేవ, దేవి !
పోవ గాచియు నీ పొందు నొంద నిమ్మ,!! 95.
శ్లో:-కల్ప ద్రుమేణ మణినా సహితా సురాభ్యా!
శ్రీ స్తే కలామయి రసేన రసాయనేన
ఆస్థాయితో మమచ ధృక్కర పాణి పాద
సృష్ట్వా సువర్ణ వపుష స్థిర జంగ మాస్స్యుః!! 96.
తే,గీ:-కమ్ర రూపిణి నీకళ కామ థేను
కల్ప పాదప మణులందు కలిసి నటుల
భక్తి రసభర! కళయది! భవహర! మయి!
భాగ్య ఫలదము,గావలె?పరమ కరుణ!! 96.
శ్లో:ఆద్యాది విష్ణో స్థిర ధర్మ పత్నీ
త్వమంబ సత్యా మమ సన్ని దేహీ
ఆద్యాది లక్ష్మీ త్వదను గ్రహేణ
పదే పదే మే నిథి దర్శనం స్యాత్!! 97.
తే,గీ:-ఆది శక్తిని!త్రిభువని!ఆది పురుషు
సన్ని ధానమ్ము!నందించు శక్తి వీవు!
నడుగడుంగున నిథు లుంచి నన్ను గాచి
దర్శనంబిమ్మ !భక్తుండు దనియు నటుల!! 97.
ఫల శృతి
========÷
శ్లో:-ఆద్యాది లక్ష్మీ హృదయం పఠేద్యమ్
స రాజ్య లక్ష్మీ మచలాం తనోతి
మహా దరిద్రోపి భవే ద్ధనాఢ్యా
స్త దన్వయే శ్రీ స్థిరతాం ప్రయాతి!!
ఆ,వె:-ఆది లక్ష్మి హృదయ మవలీల పఠియింప!
రాజ్య లక్ష్మి నందు రహిని మించి!
ధనము లేని వాడు!ధనవంతుడై యొప్పు!
తిరము సుఖము లంది దివురు చుండు!!
శ్లో:-యస్య స్మరణ మాత్రేన తుష్టాస్యాద్విష్ణు వల్లభా!
తస్యాభీష్టం దదా త్వా తం పాలయతి పుత్రవత్!!
తే,గీ:-స్మరణ మాత్రాన తుష్టియై వరలు తల్లి!
పుత్ర తుల్యత పాలించు పుణ్య మాత!
విష్ణు దేవుని దేవేరి!విమల రూపి!
కోర్కె లీడేర్చు తల్లిని గొల్తు నేను!!
శ్లో:-ఇదం రహస్యం హృదయం సర్వ కామ ఫల ప్రదమ్!
జపః పంచ సహస్రస్తు పున శ్చరణ ముచ్యతే!!
తే,గీ:-లక్ష్మి హృదయంబు శ్రీకర లక్షితంబు!
కామ ఫల దంబు!భక్తుల కల్ప తరువు!
వేయి ఐదులు పఠియించు విమల యశుడు
తల్లి కరుణచె తరియించు!తపన దీర!!
శ్లో:-త్రికాలం మేక కాలంవా నరో భక్తి సమన్వితః
యః పఠే చ్ఛృణుయాద్వాపి నయాతి పరమాం శ్రీయమ్!! 98.
తే,గీ:-దిన దినంబున కొకసారి దీక్ష మీర!
పఠన జేసిన వినినను భాగ్య మబ్బు!
మూడు కాలాల పఠియింప!ముక్తి గల్గు!
మాత వసియించు నింటిలో!మహిమ లలర!! 98.
శ్లో:-మహా లక్ష్మీ సముద్దిశ్య నిశి భార్గవ వాసరే,
ఇదం శ్రీ హృదయం జప్త్వా!పంచ వారం ధనీ భవేత్!! 99.
తే,గీ:-వర మహా లక్ష్మి హృదయంబు పరమ నిష్ట
శుక్ర వారాల రాత్రుల శుచి యుతముగ!
నైదు వారాలు పఠియింప!నతివ సిరియు
ధనము జేకూర్చి కాపాడు!వినయ మొసగి!! 99.
శ్లో:-అనేన హృదయే నాన్నమ్ గర్భిణ్యై అభి మంత్రితామ్,
దదాతి తత్కులే పుత్రో జాయతేశ్రీ పతి స్వ యమ్!! 100.
తే,గీ:-హృదయ పఠనంబు గావించి విదిత భక్తి!
అన్న మభిమంత్రితము జేసి యాలి కింత
నీయ,తత్కుల మందున!నీతి యుతుడు
సుతుడు విష్ణ్వంశ జనియించు!మతి యుతుండు!! 100.
శ్లో:-నరేణా ప్యధవా నార్యా లక్ష్మీ హృదయ మంత్రితే!
జాతే పీతేచ తద్వంశే! మంద భాగ్యో నజాయతే!! 101.
తే,గీ:-నారి యైనను,నరుడైన,నధిక.భక్తి
లక్ష్మి హృదయంబు పఠియించి లక్ష్మి దలచి
నీర మభిమంత్రితము జేసియెవరు?గొనునొ!
వారి సంతతి బాగుండు వసుధయందు!! 101.
శ్లో:-య ఆశ్వజే మాసిచ శుక్ల పక్షే
రమోత్సవే సన్నిహితేచ భక్త్యా!
పఠే తథై కోత్తర వార వృద్ధ్యా!
అనేక సౌవర్ణ మయీం సువృష్టిమ్!! 102.
తే,గీ:-ఆశ్వియుజ మాస మందున నరులు భక్తి!
వర రమోత్సవ కాలాన పరము నిష్ట!
హృదయ మంత్రంబు పఠియింప,సుదతి రమయు
మంచి వర్షాలు పంటలు మహి నొసంగు!! 102.
తే,గీ:-య ఏక భక్త్యాన్వహ మేక వర్షమ్!
విశుద్ధ ధీ సప్తతి వార జాపి
సమన్భాద భాగ్యోపి రమా కటాక్షాత్
భవే త్సహ స్రాక్ష శతాధిక శ్రీః!! 103
తే,గీ:-వార సప్తతి మారులు వర్ష మందు!
శుద్ధ మానస యుతుడయి!బుద్ధి నిలిపి
మంత్ర పఠనంబు గావింప!మా విభూతి!
సిరులు నూరింత లలరును సిద్ధముగను!! 103.
శ్లో:-శ్రీ శాఙ్ఞ్రి భక్తిం హరి దాస దాస్యం
ప్రసన్న మంత్రార్థ ధృడైక నిష్టామ్,
గురోస్మృతిం నిర్మల బోధ బుద్ధిం
ప్రదేహి మే తే పరమం పదం శ్రీః!! 104.
తే,గీ:-గురు తలపోసి పఠియించి హరిని దలచి
సిరిని హరిదాసు బోధల సరస వినియు
మంత్ర భావాలు నిష్టతో మనన జేయ
పరమపద!మిచ్చు! కల్యాణి!భాగ్య లక్ష్మి!! 104.
శ్లో:- పృధ్వీ పతిత్వం పురుషోత్తమత్వం
విభూతి వాసం వివిదార్థ సిద్ధిమ్,
సంపూర్ణ కీర్తిం బహు వర్ష భోగమ్
ప్రదేహిమే,లక్ష్మి పునః పునస్త్వమ్!! 105.
తే,గీ:-పుడమి నేలెడు భాగ్యంబు పూజ్య మైన
పురుష శ్రేష్టత జేకూర్చి భూ తలాన!
భోగ భాగ్యాల తుల తూగ కోరు కొందు!
సిరియు నీవమ్మ!శ్రీ లక్ష్మి! జెల్వ మమర!! 105.
శ్లో:-వాదార్థ సిద్ధిం బహులోక వశ్యం
వయస్థ్సి రత్వం లలనా సు భోగమ్,
పుత్రాది లబ్ధిం సక లార్థ సిద్ధిం
ప్రదేహి మే భార్గవి జన్మ జన్మనిః!! 106.
తే,గీ:-వాద పఠిమము బహు లోక వశ్య సిద్ధి
లలన భోగంబు! జీవన లాలనంబు!
పుత్ర పౌత్రాభి వృద్ధియు పురుష సిద్ధి!
జన్మ జన్మాల భాగ్యముల్ సరగ నిమ్మ!! 106.
శ్లో:-సువర్ణ వృద్ధిం కురుమే గృహే శ్రీః,
సు ధాన్య వృద్ధిం కురుమే గృహే శ్రీః
కల్యాణ వృద్ధిం కురు మే గృహే శ్రీః
విభూతి వృద్ధిం కురు మే గృహే శ్రీః,!! 107.
తే,గీ:-స్వర్ణ వృద్ధిని జేకూర్చు స్వ ర్ణ పర్ణ!
ధాన్య వృద్ధినిగలిగించు!ధర్మ నిలయ!
శుభ పరంపర లెలయించు!సోము ననుజ!
భూతి వృద్ధిని జేకూర్చు!భూత దాయి!! 107.
శిరో బీజమ్
ఓం--యం--హం--కం--లం--వం--శ్రీః,
శ్లో:-ధ్యాయే లక్ష్మీం ప్రహసిత ముఖీం కోటి బాలార్ర భాసాం
విద్యుద్వర్ణా స్ఫుర వర ధరాం భూషనాడ్యాం సుశోభామ్,
బీజా పూరం సరసిజ యుగ బిభ్రతీం స్వర్ణ పాత్రం
భర్త్రా యుక్తాం ముహు రభ యదాం మప్యచ్యుత శ్రీమ్!! 108.
శిరో బీజము
ఓం--యం--హం--కం--లం--వం--శ్రీః,
తే,గీ:-నవ్వు మోమున నలరారు నలిన నేత్రి!
కోటి బాలార్క భాసిత కోమలాంగి!
బీజ పూరను!వరదాయి తేజ యుతను
పద్మ హస్తను పూజింప వలెను జనులు!! 108.
------00------
ఓమ్
తత్సత్ శ్రీ పరబ్రహ్మార్పణ మస్తు,
ఇత్యా ధర్వణ రహస్యే--ఉత్తర భాగే
ఆద్యాది శ్రీ మహా లక్ష్మీ హృదయ స్తోత్రమ్
సంపూర్ణమ్,
మంగళమ్ మహాత్,
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ,,
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.