గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 99వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

99. ఓం పరంజ్యోతిషే నమః.

గోమూత్రికాబంధ గూఢ పంచమపాదయుక్త తరువోజ - మత్తకోకిల - ద్విపదద్వయ గర్భ సీసము.

క్షేమమీవె యనంత! శ్రీ ఖగ సేవ్య! శ్రీ - సతి మోహనా! చిత్త శక్తివి, నుత!

శ్రీ మనమ్మ! సుచంద్ర శేఖర సేవ్య! శ్రీ - శ! వసించు మా చిత్ ప్రశస్త! మహిని. 

క్షేమ మిచ్చెడి భద్ర చిత్త! ప్రసేవ్య జీ - వ! నృసింహుఁడా! చిత్ ప్రభావ! మనుమ!

నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య ని - ర్మలుఁ జేయుమా! నేర్పు రమ్య గతిని.

గీ. పాద త్రితయస్థ గోమూత్ర బంధ యుక్త - ఛంద త్రితయ *పరంజ్యోతిషా*మ్ పతివయ!

భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

99వ సీస గర్భస్థ గోమూత్రికా బంధస్థ గూఢ పంచమ పాదము.

క్షే మ మీవె   య నంత శ్రీ ఖ గ సేవ్య    శ్రీ - సతి మోహ నా!  చిత్త     శక్తివి    నుత!

శ్రీ మ న మ్మ! సు చంద్ర శే  ఖ ర  సే వ్య శ్రీ-శ! వ సిం చు మా చిత్ ప్ర శ  స్త! మహి ని. 

క్షేమ మి చ్చెడి    భ ద్ర cచిత్త!ప్ర సే వ్య జీ-వ! నృ సింహుఁడా!చిత్ ప్రభావ     మ నుమ!.

క్షేమమిమ్మయ చంద్రశేఖర సేవ్య   శ్రీ - శ! నృసింహ మా చిత్ ప్రశస్త మహిత.

99వ సీస గర్భస్థ తరువోజ (3ఇం.గ, 1సూ.గ. 3ఇం.గ. 1సూ.గ. యతి 1-3-5-7 గణాద్యక్షరములు)

క్షేమమీవె యనంత! శ్రీ ఖగసేవ్య! శ్రీ సతి మోహనా! చిత్తశక్తి విను,

శ్రీ మనమ్మ! సుచంద్ర శేఖర సేవ్య శ్రీ శ! వసించు మా చిత్ ప్రశస్త! మహి. 

క్షేమ మిచ్చెడి భద్ర చిత్త! ప్రసేవ్య జీవ! నృసింహుఁడా! చిత్ ప్రభావ! మను!

నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య నిర్మలుఁ జేయుమా! నేర్పు రమ్యగతి.

99వ సీస గర్భస్థ మత్తకోకిల. (ర స జ జ భ ర .. యతి 11)  

క్షేమమీవె యనంత! శ్రీ ఖగసేవ్య! శ్రీ సతి మోహనా! 

శ్రీ మనమ్మ! సుచంద్రశేఖర సేవ్య శ్రీశ! వసించుమా!. 

క్షేమ మిచ్చెడి భద్రచిత్త! ప్రసేవ్య జీవ! నృసింహుఁడా!

నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య నిర్మలుఁ జేయుమా!

99వ సీస గర్భస్థ ద్విపదద్వయము. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం.గ.1సూ.గ .. యతి 3వ గణము 1వ అక్షరము) 

(1)క్షేమమీవె యనంత! శ్రీ ఖగ సేవ్య! - శ్రీ మనమ్మ! సుచంద్రశేఖర సేవ్య!  

(2)క్షేమమిచ్చెడి భద్ర చిత్త! ప్రసేవ్య! - నీ మనంబున నన్ను నిల్పుమ నిత్య!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పొగడబడువాడా! ఓ శ్రీసతి మోహనా! ఓ యనంతా! క్షేమము

నీవే. చిచ్ఛక్తియు నీవే. ఓ లక్ష్మీ హృదయా! చంద్ర శేఖర సుసేవ్యా! ఓ శ్రీశా! ఓ ప్రశస్తా! మా మదులందు నివసించుము.

క్షేమప్రద భద్ర చిత్తుఁడా! జీవులచే సేవింపబడువాడా! ఓ చిత్ప్రభావా! నీవు మాలో మనుము. నీ మనసులో నన్ను

నిల్పుము. నన్ను నిత్యనిర్మలునిగా చేయుము. రమ్యగతిని నేర్పుము.మూడు పాదములందు

గోమూత్రికాబంధమొప్పుచుండ, మూడు వృత్తములు గర్భముననొప్పు సీసమునందు వెలుగెడి పరంజ్యోతిషాంపతివి నీవు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.