యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
1 రోజు క్రితం
వ్రాసినది
Labels:












చ:-
ముసిరిన కర్మదుష్ఫలము పూజలుచేయఁగ బుద్ధిఁ బాపగా,
కసురుకొనేటి కర్మమును కాంచుటకైనను లేకఁ జేయు నా
బిసరుహనేత్ర లక్ష్మి సుమపేశలమానస, కొల్చు వారికిన్.
పసుపునుకుంకుమన్ పరమభక్తినొసంగుడు పేరటాండ్రకున్.
ఉ:-
శ్రావణమాసమందు సువిశాలహృదంతరవాసి యౌచు పల్
ధీవరులింటనిల్చు"సిరి" తృప్తిగ సంపద లందఁ జేయుచున్.
సేవలు చేసి యామె కృప చేకొనుడందరు. స్త్రీ జనంబులన్
యా వరలక్ష్మిగా తలచి యాదరమొప్పగఁ గొల్చుటొప్పెడిన్.
శా:-
అమ్మా!శ్రీహరి రాణి!నీదు కృపతో అష్టస్వరూపాత్మవై
నెమ్మిన్ మా గృహమందు నుండ తగునో యమ్మా! కృపాంభోనిధీ!
మమ్మున్ గావగ నెవ్వరమ్మ కలుగున్ మాయమ్మనీకన్న?నిన్
సమ్మాన్యంబుగ నందరందు కనుటన్ సత్ కృత్యమున్ గొల్పుమా!
జైహింద్.