పాఠక శ్రేష్టులకు వందనాలు. తెలుగు పద్యాలలో గల మాధుర్యం మీ రచనలో కూడా చూడాలని వుండి.మీరు కూడా తప్పక ప్రయత్నించి పద్యం వ్రాస్తారనే గమ్పె డాశతోనున్నాను. మన ప్రయత్నానికో సమస్యాపూరణ.
శా:-__రామాయన బూతు మాట యనుచున్ కాంతల్ ప్రకోపించిరే! తప్పక ప్రయత్నించి పద్య పూరణ చేస్తారు కదూ?
నేనుకూడా యత్నిస్తాను. " యత్నే కృతే యది న సిద్ధ్యతి కో2త్ర దోషః ?మళ్ళీ కలుసుకొందాం. నమస్తే.
చింతా రామ కృష్ణా రావు .
Print this post
రాఘవ శతకము ఆర్కైవ్.కం లోను,స్క్రిబ్డ్ లోను ప్రకటించబడినవి. ఇది ఆలింకులు.
-
జైశ్రీరామ్.
రాఘవ శతకము ఆర్కైవ్.కం లో ప్రచురించారు. అలాగే స్త్రిబ్డ్ లో కూడా
ప్రచురించారు. ఆ లింకులు ఇచ్చుచుంటినండి
https://ia803409.us.archive.org/0/it...
9 గంటల క్రితం
వ్రాసినది












1 comments:
ఇచ్చిన సమస్య:-
శా:-__రామాయన బూతుమాటయనుచున్ కాంతల్ ప్రకోపించిరే !
నా పూరణ చూడండి.
శా:-చేరెన్ భక్తుడటంచు నమ్మి వనితల్. శ్రీకృష్ణ ! శ్రీ పాండు రం
గా! రామా! యన. బూతు మాట లనుచున్ కాంతల్ ప్రకోపించి రే
తీరున్ బల్కగ రాని దౌష్ట్యములతో తిట్టన్ దమన్. నిక్కమే.
నేరం బెన్నక ముందు గొల్చు. చఱచున్ నేరంబులన్ జేసినన్.
నేనిచ్చిన సమస్యను నే నీవిధంగా పూరించాను. దయతో మీరూ ప్రయత్నించండి.
చింతా రామ కృష్ణా రావు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.