🙏ఓం శ్రీమాత్రే నమః.🙏
శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటిలో 3వ పద్యము.
3. నీ రూపమే కనిన నేరూపమున్ గనఁగఁ గోరంగ లేము ధరణిన్,
ధారాళ సత్ కవిత పారున్ నినుం గనిన శ్రీరమ్య తేజ నిలయా.
పారాడు దుర్గతుల నేరీతిఁ బాపుదువొ చేరంగ నిన్ శుభ మతిన్,
వారాహి నిన్ దలచు వారే మహాత్ములిల వారిన్ నుతింతును సతీ!
భావము.
ఓ సతీమాతా! నీ దివ్యమయిన రూపమును చూచినచో భూమిపై మరే రూపమును చూడవలెనని కోరలేమమ్మా. లక్ష్మీప్రదమయిన కాంతికి నిలయమయిన తల్లీ!నిన్ను చూచినచో ధారాళమయిన మంచి కవిత్వము ఉరకలు వేయుచు వచ్చును.ంఅంచి మనసుతో నిన్ను నేను చేరుట కొఱకు ఈ నడచుచున్న దుర్గతిని నీవు ఏ విధముగాపోగొట్టుదువో కదా.ఓ తల్లీ!నిన్ను భూమిపై నిన్ను తలచునటువంటివారే మహాత్ములమ్మా.
Print this post
గాజుల మల్లయ్య(దుర్గాదాసు) ... పద్యకృ తి ... శ్రీ కడయింటి కృష్ణ మూర్తి.
-
జైశ్రీరామ్.
గాజుల మల్లయ్య(దుర్గాదాసు)
కథా మూలం:
ఇది ‘సుమన్’ టివి లో శ్రీమతి రమా రావి గారు చెప్పిన కథ(దుర్గాదాసు)
ఆధారంగా......(వారితో ఫోన్ లో మాట్లాడడ...
3 రోజుల క్రితం
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.