tag:blogger.com,1999:blog-1376362995658113528.post7400492916411047102..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీకందరికీ అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-56630419229432160292011-08-30T20:21:44.695+05:302011-08-30T20:21:44.695+05:30పండిత నేమాని అవధాన శేఖరులకు. ఆర్యా! నమస్తే.
మానిత...పండిత నేమాని అవధాన శేఖరులకు. ఆర్యా! నమస్తే.

మానితమగు తెలుగున నే
మాని తమ గుణ ప్రశస్తి, మర్యాదలనే
మానితమని భావించితి.
మానిత నేమాని కవి! ప్రమాణము మీరే.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-79064194498563739912011-08-30T11:54:28.780+05:302011-08-30T11:54:28.780+05:30శబ్ద మధురిమయును సద్భావ సంపద
బహుళ ప్రక్రియా ప్రభావి...శబ్ద మధురిమయును సద్భావ సంపద
బహుళ ప్రక్రియా ప్రభావిభవము
సామరస్య పటిమ చక్కగా గలుగుచు
విశ్వ భాషలందు వెలుగు తెలుగుPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-71226219648112013512011-08-30T07:26:35.647+05:302011-08-30T07:26:35.647+05:30ఆర్యా! నారసింహా. నమోనమహ్. చక్కగా సెలవిచ్చారు మన మా...ఆర్యా! నారసింహా. నమోనమహ్. చక్కగా సెలవిచ్చారు మన మాత్ర్భాష ఆవిర్భావం గురించి.అద్భుతమైన సత్యాన్ని వెలువరించిన మీకు నా ధన్యవాదములు.

తెలు"గన్న వరమె"యందురు.
తెలుగదిమనకొదవినవిధి తెలిపిరి సుగతిన్.
తెలుగన్న వరదుఁడొసగిన
విలువగు మనభాష. తెలుగు వెలుగును సతమున్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-58053822974217037242011-08-29T23:34:00.201+05:302011-08-29T23:34:00.201+05:30నారదాది మునులు నారాయణుని జేరి
మధుర మైన భాష మాకు ని...నారదాది మునులు నారాయణుని జేరి
మధుర మైన భాష మాకు నిమ్ము
ననుచు గోరగ నత డాంధ్రము బలికించె
భారతమ్మ చేత, బ్రహ్మ నడిగి !

అందుచే మన మంతా అదృష్టవంతులము. అందఱికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-47323211693705369172011-08-29T22:17:32.934+05:302011-08-29T22:17:32.934+05:30ఆర్యా! మిస్సన్న గారూ!
చాలా చక్కగా చెప్పారండి.
పాప...ఆర్యా! మిస్సన్న గారూ!
చాలా చక్కగా చెప్పారండి.

పాప నవ్వు కన్న, పాల మీగడ కన్న,
మంచి గంధము మరి మల్లె కన్న,
వీణ పాట కన్న, విన సొంపు మిస్సన్న
తెలుగు పలుకు నిజము తేనె లొలుకు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-69623268726056284362011-08-29T21:52:30.585+05:302011-08-29T21:52:30.585+05:30ఆర్యా!
పాప నవ్వు వోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్...ఆర్యా!

పాప నవ్వు వోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్లు మల్లెలట్లు
వీణ పాట రీతి విన సొంపుగా నుండు
తీయ తేనె లొలుకు తెలుగు పలుకు.

తెలుగులందరికీ శుభా కాంక్షలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-69911428091613838562011-08-29T20:48:52.745+05:302011-08-29T20:48:52.745+05:30ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ!
తేనె తినగ నేల తెలుగు ...ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ!

తేనె తినగ నేల తెలుగు పద్యము గల్గ,
పటిక బెల్లమేల? పనస లేల?
చెరకు రుచులవేల?చిత్రకవితలుండ.
తెలుగు పద్య రుచులు తెలుసు మీకు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-74533763418982553212011-08-29T18:56:25.537+05:302011-08-29T18:56:25.537+05:30ఆర్యా ! నమస్కారములు.
తెలుగు వారందరికీ తెలుగు భాషా...ఆర్యా ! నమస్కారములు.
తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు.

తేనె తినగ నాకు తీయగా నే లేదు
పటిక బెల్లమందు పసయె లేదు
చెరకు రుచిని జూడ చెల్లుబాటుగ లేదు
తెలుగు పద్య రుచిని తెలిసి యుండ.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com