tag:blogger.com,1999:blog-1376362995658113528.post2244312654685359005..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీగురుచరణారవిందాభ్యాంనమోనమః.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-11301319049649924762011-04-27T08:09:25.785+05:302011-04-27T08:09:25.785+05:30ఫణి కుమారా! మీకు ఆనందం కలిగించినందుకు ఆశారదాంబకు ప...ఫణి కుమారా! మీకు ఆనందం కలిగించినందుకు ఆశారదాంబకు పాదాభివందనాలు.మీకు నా ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-23701612589925770472011-04-27T07:56:35.155+05:302011-04-27T07:56:35.155+05:30శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి గారి గురించి మీరు,పండిత...శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి గారి గురించి మీరు,పండిత నేమాని గారు వ్రాసిన పద్యములు అత్యంత ఆనందదాయకంగా ఉన్నాయి. ధన్యవాదములు.ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-51031659425921394632011-04-17T20:54:39.286+05:302011-04-17T20:54:39.286+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.పండిత నేమానిhttp://lalithaedas.com/ramayanamnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-88846048304017229662011-04-17T20:52:10.018+05:302011-04-17T20:52:10.018+05:30గురు స్తుతి
శా. శ్రీనిష్ఠానిధి, వాగ్విభూషణుడు, రా...గురు స్తుతి

శా. శ్రీనిష్ఠానిధి, వాగ్విభూషణుడు, రాశీభూత కారుణ్యమున్
జ్ఞానానంద మహాబ్ధి, శిష్యగణ సంక్షేమానుసంధాయి, శ్రీ
మానాప్రగ్గడ శేషశాయి, బుధ సమ్మాన్యుండు, సద్భక్తితో
నేనా సద్గురు పాదపద్మ యుగళిన్ సేవింతు నశ్రాంతమున్

మ. నను సౌహార్దము నిండు దెందమున సన్మానించె, వాణీ స్వరూ
పునిగా జెప్పుచు గూర్చె గౌరవము, నా పొత్తమ్ములో పద్యముల్
మనమారన్ విని చాల మెచ్చుకొనె, నా మానాప్రగడ్వంశ చం
ద్రుని, చంద్రాతప కీర్తిమంతు వినుతింతున్ వాగ్లతాంతాళితోన్

తే.గీ. అతని తలపులు లోక శ్రేయస్కరములు
అతని పలుకులు ప్రథిత విద్యాంకురములు
అతని కృతులు సాహిత్య లోకాధ్బుతములు
శ్రిత హితార్థ ప్రదాయి శ్రీ శేషసాయి

ఇట్లు
నేమాని రామజోగి సన్యాసి రావpaMdita nEmAninoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-33890832141749651372011-04-15T17:40:57.520+05:302011-04-15T17:40:57.520+05:30ధన్యోస్మిధన్యోస్మిగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-2544694209921475332011-04-15T14:56:05.283+05:302011-04-15T14:56:05.283+05:30సీ:-
ప్రార్థనీయులు గన్న వరపుత్రకులు మీరు.
గన్నవరపు...సీ:-
ప్రార్థనీయులు గన్న వరపుత్రకులు మీరు.
గన్నవరపు వంశ గౌరవమును
దేశాంతరములందు దీపింప చేసిరి.
దీనుల హృదయాల దేవుఁడీరు.
కరుణ శోభిత వాణి కమనీయ చూడ్కుల
వెన్నెలలందిన విబుధులీరు.
నారసింహుని పేరు కోరి తాల్చిన గాని
మహనీయ సౌమ్యత్వ మహితులీరు.
గీ:-
కన్నవారల యొక్క కన్ సన్నలరసి
మెలగు మిము గాంచి కాంచితి తెలుగు వెలుగు.
వర భిషఙ్మణి! మీదు సచ్చరిత మరసి
తెలుగు జాతియె గర్వించు, దివ్య చరిత!

మీకు నా ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-72926666827671751062011-04-15T14:53:13.679+05:302011-04-15T14:53:13.679+05:30సోదరా!
శారదాంబ ముద్దు బిడ్డలైన మీవంటి వారి సాహచర్య...సోదరా!
శారదాంబ ముద్దు బిడ్డలైన మీవంటి వారి సాహచర్యము, అసాధారణ ప్రతిభా పాండితీ తేజస్వరూపులైన గురుదేవుల కరుణా కటాక్షము నాకు వరాలై పద్యకవితకు ప్రేరేపిస్తున్నాయే కాని అది నా సమర్ధత కానే కాదు. నీవు చేసిన ప్రసంశ చూస్తుంటే అది నీ హృదయ వైశాల్యానికి అద్దం పట్టుతోందే కాని ఆ ప్రశంసకు నేను పాత్రుఁడనని అనుకోలేను.
ఏది ఏమైనా నేను ధన్యుఁడను.
నీకు నా కృతజ్ఞతాభివందనములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-68061784604693044572011-04-15T07:06:10.060+05:302011-04-15T07:06:10.060+05:30పంజరమ్ము నందుఁ బంచ రంగుల చిల్క
పాట పాడి నటుల, బంధ ...పంజరమ్ము నందుఁ బంచ రంగుల చిల్క
పాట పాడి నటుల, బంధ మయ్యు
కవిత నాట్య మాడెఁ గన్నుల కింపుగా
రమ్య కవిత చంద్ర రామకృష్ణ !

అసమాన కవితా ప్రావీణ్యులైన శిష్యులను గాంచుట గంటే గురువులకు పరమావధి యింకేమి ఉంటొంది ? మీ వంటి శిష్య సంపద గలిగిన శ్రీ మానాప్రగడ శేషశాయి గారు అదృష్ట వంతులు. మీ ద్వారా వారి పాద పద్మములకు మా నమస్సుమాంజులులు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-84622706936938157972011-04-14T20:00:10.002+05:302011-04-14T20:00:10.002+05:30హృదయమంగా అను దానిని హృదయంగమంగా అని సరిచేసికో గోరుత...హృదయమంగా అను దానిని హృదయంగమంగా అని సరిచేసికో గోరుతున్నాను. టైపులో వచ్చిన తప్పుగా మన్నించ ప్రార్ధన.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-63286334941650776542011-04-14T19:56:53.232+05:302011-04-14T19:56:53.232+05:30గురు దేవుల ఆశీరమృత సేసలు మీ పై అపారముగా కురియుట చే...గురు దేవుల ఆశీరమృత సేసలు మీ పై అపారముగా కురియుట చేతనే కాబోలు, మీరింత అందముగా, ఛందస్సుందరముగా, హృదయమంగా, నిరుపమానంగా పద్య రచన చేయగలుగు చున్నారు.

ఇట్టి పద్య విద్య మీకబ్బుట మీ పురాకృత జన్మ విశేషపరిపాక ఫుణ్య ఫలమనుట ఎంత మాత్రము సత్య దూరము కానేరదు.

మీ వంటి సత్కవులు నా మిత్రులని చెప్పు కొనుట నాకు మిక్కిలి గర్వకారణము.

జయోస్తు. ప్రతిభా వ్యత్పత్తుల చేత కాక , కేవల వయసు చేత నా కంటె చిన్న వారగుట చేత శతమానం భవతి.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.com