జైశ్రీరామ్.
శ్లో. న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి |హవిషా కృష్ణవర్త్మేన భూయ ఎవాభి వర్తతే ||
గీ. అనుభవించిన కొలదియునధికమగును
కోరిక.హవిస్సు హుతమున చేరు కొలది
వృద్ధి చెందెడు తీరున. శ్రద్ధ తోడ
మనమునదుపునందుంచిన మనకు మేలు.
కోరికల ననుభవించిన మాత్రాన కోరిక తీరదు. హవిస్సుచేత అగ్నిహోత్రం వృద్ధి చెందినట్లు కోరికల ననుభవించుటచేత కోరికలు పెరుగుతూనే ఉంటాయి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును కోరికలకు అంతు దరీ ఉండదు మంచి సూక్తి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.